ఈ రకమైన కవిత్వం మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా, కనీసం ఇస్మాయిల్ నాస్టాల్జియా కోసమన్నా, ఈ సంకలనం తెప్పించుకొని చదువుతారని నా కోరిక!
మార్చ్ 2007 సంచిక విడుదల
అనుకోని సాంకేతికమైన ఇబ్బందుల నుండి బయటపడి ఒకరోజు ఆలస్యంగా మార్చ్ సంచికను విడుదల చేస్తున్నాం. ఓపిగ్గా “ఈమాట” కోసం నిరీక్షిస్తూ, మాకెంతో ప్రోత్సాహం ఇచ్చిన పాఠకులకు, రచయితలకు మా హార్దిక వందనాలు. మార్చ్ 2007 సంచికలో-
- కె.వి.గిరిధరరావు, ఫణి డొక్కా, జె.యు.బి.వి. ప్రసాద్, సౌమ్య బాలకృష్ణ, వేమూరి , లైలా యెర్నేని, రవికిరణ్ తిమ్మిరెడ్డి, వేలూరి గార్ల కథలు
- యథార్థ చక్రం చివరి భాగం
- ఇటీవలే కాలం చేసిన ఓ.పీ. నయ్యర్కు నివాళిగా ఆయన గురించి రోహిణీప్రసాద్ గారి వ్యాసం
- పాశ్చాత్య, కర్ణాట సంగీత సంప్రదాయాలలో ఖ్యాతిగాంచిన ఎనిమిది దిగ్గజాల జీవితాలను, సంగీతాన్ని విశ్లేషించే నాగరాజు పప్పు గారి వ్యాసం
- పల్లెలో మా పాత ఇల్లు పుస్తక పరిచయం
- విన్నకోట రవిశంకర్, వైదేహీ శశిధర్ గార్ల కవితలు
- ఇంకా జానపద సాహిత్యంలో స్త్రీలు – 2, వికీపీడియా ల గురించి వ్యాసాలు
ఈ సంచిక రసజ్ఞ పాఠకులకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాం.
సంపాదకులు
ఎంత సేపూ ఏదో పుస్తకాలమీద ఎక్కువ ధ్యాస. చిన్నప్పుటినుంచీ ఏర్పడిపోయిన అలవాటు. మళ్ళీ మేఘసందేశం తియ్యబోతుంటే , గబుక్కున ఆమెకు మధ్యాహ్నం మూడు గంటలకు టెన్నిస్ లెసన్ ఉన్న సంగతి గుర్తొచ్చింది.
ఈ మెటీరియల్ rat చేజ్ లో ఐతే విజయం సాధించాంగానీ, ఆ విజయంలో జారిపోయిన జీవితాన్ని గమనించలేకపోయాం.
అసాధ్యంకాని ఆదర్శాలనికూడా ఆచరణలో పెట్టడాని కొచ్చేటప్పటికీ,మన సంస్థలు,ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకొనే స్థోమత ఉన్నసంస్థలు,– తానా,ఆటా లు రెండూ అడవిలో అబ్బా అంటున్నాయా అన్న సందేహం రాక మానదు.
ఈ వ్యాసం పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికీ, కర్ణాట శాస్త్రీయ సంగీతానికీ ఉన్న సారూప్యాలూ, ఈ రెండు సంగీత సంప్రదాయాలని మహోన్నత స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుల జీవితాలలోను, ఆ సంగీత సంప్రదాయాన్ని వారు తిప్పిన మలుపుల్లో ఉన్న సారూప్యాలను పరిచయం చెయ్యడానికి చేసిన చిరు ప్రయత్నం.
మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
అప్పుడే పుట్టిన పసికందును
ఒక్క క్షణం కూడా వదలలేక
తడిమి తడిమి ముద్దాడే
తొలిచూలాలిలా
సూర్యుడు కూడా చలితో
గజగజ వణుకుతాడు.
అతను లతా మంగేశ్కర్ చేత పాడించకుండానే హిందీ సినీ రంగంలో సంగీత దర్శకుడుగా వెలిగాడు. స్వరజ్ఞానమేదీ లేకుండానే సంగీత దర్శకత్వం చేపట్టి విజయం సాధించాడు.
ఆ ఇల్లో తులసి వనం, నేనో నిగమ శర్మ
ఆ చలికి భూమ్యాకర్షణ కూడ గడ్డకట్టుకు పోయిందా అన్నట్లు మంచు కూడ కురవటం మానేసింది. అంత చలిలో కంఠంలో ప్రాణం ఉన్న ఏ జీవి కూడ సాహసించి బయటకి రాలేదు. కాని, బయట ఏదో ఉంది. లోపలకి రాడానికి ప్రయత్నిస్తూన్నట్లు ఉంది. కుటీరపు గోడలని గోకుతోంది!
బీచ్ లో అందరూ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. నా కష్టాల కడలి నాతో ఆడుకుంటోంది. అలలతో దోస్తీ చేస్తూ, అమ్మ నాన్న ల కేకల్ని లెక్కచేయక మున్ముందుకు వెళుతున్నారు పిల్లలు. ఇలా లోలోపలికి వెళితే ….. సమస్యలు తీరవూ? ఎన్నడూ లేని కొత్త ఆలోచన నాలో.
“ఒక్క పూట మందు లేకపోతే ప్రాణం పోదులే…రమేష్ గారు చూడండి…అస్సలు మందు ముట్టుకోరట. ఏ దురలవాటూ లేదట. వింధ్యకు అన్ని పనుల్లో చాలా హెల్ప్ చేస్తాడట. చూసి నేర్చుకోండి” అంటూ బయల్దేరదీసింది.
“హరిణి గుజరాతీ అమ్మాయి అని మా అమ్మ అభ్యంతరం. మా నాన్నకీ అదే అభ్యంతరం అని నా నమ్మకం” కాస్త కోపంగా అన్నాడు.
బుల్లి భూషయ్యకి మహరాజవుదామని కోరిక పుట్టింది. ఒకటే ఉబలాటం. ఇదేమీ కొత్తగా పుట్టిన కోరిక కాదు. అన్నయ్య చిన భూషయ్య ఆరేళ్ళకిందట అనుకోకండా మహరాజుగా ఎంపిక అయినప్పటినుంచీ, తను కూడా మహరాజవ్వాలని తహ తహలాడటం మొదలెట్టాడు. తనకేం తక్కువయిందని? చదువులేదా? చక్కని సంసారం లేదా?
ఇద్దరి మనసులూ ఒక్కసారి అవ్యాజమైన ప్రేమ పూరితాలయ్యాయి. ఇంతకుముందూ అదే ప్రేమ ఉంది. ఇప్పటి ప్రేమకంటే వెయ్యి రెట్లు ఉండేది. కానీ ఆ ప్రేమలో కోరిక ఉంది. ఈ క్షణం ఈ ప్రేమలో ఏ కోరికా లేదు. నిర్వాణం పొందిన మనస్సు లో జీవన రహస్యాన్ని తెలిపే యదార్థమైన ప్రేమ ఉంది.
జానపద సాహిత్యంలో సంవాదాలు ఆలుమగల మధ్య కలహం ఎంతసేపు అంటే “అద్దం మీద పెసరగింజ వేసినంత సేపు” అని “ఆరిక కూడు ఉడికినంత సేపు” […]