Yippee! I’m a poet, and I know it

Yippee! I’m a poet, and I know it
Hope I don’t blow it.

అని బాబ్ డిలన్ I shall be Free No 10 అన్న పాటలో అంటాడు. డిలన్‌ని, నువ్వు పాటకుడివా? కవివా? అని విలేఖకులు, విమర్శకులు, సమీక్షకులూ అడిగినప్పుడు, రకరకాల సందర్భాలలో రకరకాల సమాధానాలిచ్చాడు. అది సాహితీ విమర్శకలోకంలో కొంత కలకలం పుట్టించిన మాట నిజమే!

1963లో విడుదల చేసిన రెండవ ఆల్బమ్‌తో (The Free Wheelin’ Bob Dylan) ఇచ్చిన నోట్సులో ఇలా చెప్తాడు: Anything I can sing, I call a song. Anything I can’t sing, I call a poem. (ఏదయితే నేను పాడగలనో దానిని పాట అంటాను; ఏదయితే నేను పాడలేనో దానిని కవిత అంటాను.)

ఈ వాక్యం నాకెంతో ఇష్టం. ‘ఎందుకో చెప్పు?’ అని నన్ను అడిగితే నా దగ్గిర సరైన సమాధానం లేదు.

డిలన్ ఇచ్చిన సమాధానాలని మరొక కోణం నుంచి పరిశీలిస్తే, డిలన్ కావాలనే అటువంటి సమాధానాలు ఇచ్చి ఉండవచ్చునని నేను అనుకుంటుంటాను. కారణం: విలేఖకులన్నా విమర్శకులన్నా డిలన్‌కి వల్లమాలిన విసుగు; కోపం. 1965లో ఇంగ్లండ్‌లో ఒక విలేఖకుడు, ‘నువ్వు ఏ విషయాల గురించి పాడుతున్నావో, వాటిని గురించి ఆలోచించే పాడుతున్నావా?’ అని ఆలోచించకండా అడిన ప్రశ్నకి డిలన్ ఇలా సమాధానం ఇచ్చాడు: ‘నిజంగానే నువ్వు అతిసాహసం చేసి ఈ ప్రశ్న అడుగుతున్నావు. ఇదే ప్రశ్న నువ్వు బీటిల్స్‌ని అడుగుతావా?’

1964 లోనే The Times They Are A-Changin అన్న మకుటంతో విడుదలైన పాటలో సాహితీ భాష్యకారులని ఆహ్వానిస్తూ ఒక హెచ్చరిక నిస్తాడు డిలన్: Come writers and critics who prophesize with your pen… Don’t criticize what you can’t understand. (మీ రాతలతో సోదె చెప్పే రచయితలూ, విమర్శకులూ, రండి, రండి. మీకు అర్థం కానిదాన్ని విమర్శించకండి.)

1996లో మొదటిసారి డిలన్‌ పేరుని నోబెల్ బహుమతికి ప్రతిపాదించారు. అప్పటినుంచీ ప్రతి సంవత్సరం అతన్ని నామినేట్ చెయ్యటం, దానితోపాటు ఈ ప్రశ్న ఉద్భవించటం ఆనవాయితీ అయ్యింది. ఈ వివాదం — డిలన్ పాటకుడా, కవా? — 2004 నుంచీ మరీ ఉధృతం అయ్యింది. ఎందుకంటే, సుమారు అదే సమయంలోనే డిలన్ గురించి ఐదు పుస్తకాలు ఒకేసారి విడుదలైనాయి. ఇదంతా ఏదో కుమ్మక్కు అని విమర్శకులు భ్రమపడటానికి ఆధారం అని అనుమానించడంలో తప్పు లేదేమో!

ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ క్రిస్టఫర్ రిక్స్ (Christopher Ricks) రాసిన డిలన్స్ విజన్స్ ఆఫ్ సిన్ (Dylan’s Visions of Sin) అనే ఐదువందల పేజీల పైచిలుకు పుస్తకం, లిరిక్స్ (Lyrics: 1962-2001) అన్న పేరుతో డిలన్ పాటల పుస్తకం, క్రానికల్స్ (Chronicles) అన్న మకుటంతో డిలన్ ఆత్మకథ – మొదటి భాగం, బాబ్ డిలన్ ఎన్‌సైక్లోపీడియా (Bob Dylan Encyclopedia) అనే ఏడువందల పేజీల పైచిలుకు మరొక పుస్తకం, ఇవన్నీ విడుదలైనాయి. వాటికి తోడుగా, గిన్స్‌బర్గ్ (Allen Ginsberg), కరోల్ ఓట్స్ (Joyce Carol Oates), రిక్ మూడీ (Rick Moody), బ్యారీ హానా (Barry Hannah) డిలన్ గురించి, డిలన్ పాటల/కవితల గురించీ పొందుపరచిన వ్యాస సంకలనం! 2006 అమెజాన్ వెబ్‌సైట్‌లో సుమారు నాలుగు వందల పుస్తకాలు – డిలన్ రాసినవి, డిలన్‌పై వచ్చినవీ – ఉన్నాయి.

పాటలో కవిత్వం ఉండటానికి ఏవిధమైన అభ్యంతరమూ ఉండదు. ఉండకూడదు. ముఖ్యంగా మౌఖికసాహిత్యంతో చక్కని పరిచయం ఉన్న తెలుగు పాఠకులకి ఈ విషయం మరీ మరీ చెప్పక్కరలేదు. అయితే, కవిత అని ‘నిర్వచించబడిన’ రచనలో పాట ఉండకపోవచ్చు. అంటే కవితలన్నీ పైకి గొంతెత్తి పాడటానికి, కంఠస్థం చెయ్యడానికీ అనువుగా ఉండక పోవచ్చు నని నా అభిప్రాయం. ఏకాంతంగా కూచొని చదువుకోటానికి పద్యం, కవిత అని మనకి అచ్చుయంత్రం వచ్చిన తరువాత మరీ ప్రబలం అయ్యిందనుకుంటాను. అందుకనే కాబోలు, అచ్చులో డిలన్ పాటలు చూస్తే, ఇందులో కవిత్వం ఎక్కడ ఉన్నది? అన్న ప్రశ్న రావటానికి అవకాశం లేకపోలేదు. అందుకు ఒక కారణం: ఆధునిక లిఖిత సంస్కృతి.

ఆఖరిగా డిలన్ కవి కాదనే ఆరోపణ లేదా కవి అవునా, కాదా? అన్న చర్చ, కవిత్వానికి విశ్వవిద్యాలయాలలో విద్యావేత్తలు అంగీకరించిన లక్షణ పరిధిలో కాకుండా, డిలన్ మాధ్యమం – అంటే పాట కుండే లక్షణాలతో కవితాలక్షణాలని పొందుపరిచి, పాశ్చాత్యవిమర్శకులు పరామర్శించడం మొదలు పెట్టవలసిన అవసరం ఉన్నది. అంటే, డిలన్ రాతల గురించి రాసేటప్పుడు మూడు విషయాలు చూడాలి. మాటలు, సంగీతం, గొంతు.

2.

బాబ్ డిలన్ అసలు పేరు రాబర్ట్ జిమర్‌మన్ (Robert Allen Zimmerman). డులుత్, మినెసోటాలో మే 24, 1941న జన్మించాడు. పుట్టుకతో యూదుడు. డబ్బున్న కుటుంబం. తరువాత ద్విజుడు (born-again Christian) అయ్యాడు. డిలన్ థామస్ (Dylan Thomas, 1914- 1953) అనే వెల్ష్ కవి అంటే ఇష్టం. అందుకని అతని పేరు పెట్టుకున్నాడు.

డిలన్ మీద ఉడీ గత్రీ (Woodie Guthrie) అనే ప్రఖ్యాత జానపద పాటకుడి ప్రభావం ఉన్నదని అందరికీ తెలుసు. డిలన్ గత్రీని ప్రశంసిస్తూ రెండు పాటలు తన మొట్టమొదటి ఆల్బమ్‌లో రాశాడు (Song to Woody, Talking New York). గత్రీ రాసిన గీతం, ఈ నేల నీది (This land Is Your Land) చాలా ప్రసిద్ధికెక్కిన జానపద గీతం. అమెరికాలో అభ్యుదయవాదులు ఈ గీతాన్ని రెండవ జాతీయ గీతంగా గుర్తిస్తారు. భారతదేశంలో వందేమాతర గీతం లాగా! ఈ పాట ఒబామా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పీట్ సీగర్ (Pete Seeger), బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ (Bruce Springstein), ఇద్దరూ పాడారు. (యూట్యూబ్‌లో.)

ఛాల్స్ సీగర్, పీట్ సీగర్, జాన్ లోమాక్స్, ఆలన్ లోమాక్స్ (Charles Seeger, Pete Seeger, John Lomax, Alan Lomax) మొదలైన పాటకులు ఉగ్రవాద వామపక్షీయులు. జానపద సంగీతం సామాజిక విప్లవాన్ని పురికొల్పగలదని ధృఢంగా నమ్మిన వాళ్ళు. డిలన్ సాహిత్యంపై వీళ్ళ ప్రభావం కొన్ని నిరసన గీతాల వరకే పరిమితం. ఆ నిరసన గీతాలే ఏరి డిలన్ సంగీతాన్ని, సాహిత్యాన్ని పొగడటం, లేదా తెగడటం — ఈ రెండూ సరికాదు. డిలన్ పాటలపై నిజమైన ప్రభావం చూపింది హ్యారీ స్మిత్ (Harry Smith) ప్రచురించిన ఆంథాలజీ (Anthology of American Folk Music, 1952). డిలన్ ఇందులో పొందుపరిచిన పాటలని 1959 లోనే విన్నాడు. ఈ సంకలనంలో అమెరికన్ జానపద సంగీతం, జానపద సంగీత సాంఘిక చరిత్ర డిలన్‌ని ఎలా ప్రభావితం చేశాయో వివరంగా డిలన్ గురించి గ్రెయ్‌ల్ మార్కస్ (Greil Marcus) రాసిన పుస్తకంలో (Bob Dylan: Writings 1968 – 2010) చదవవచ్చు.

రేడియోలో ప్రసారమవుతున్న రాక్–ఎన్-రోల్ సంగీతం సామాజిక జీవనానికి ప్రతిబింబం కాదని ఎల్లా తెలుసుకున్నాడో అల్లాగే 1960 చివరిభాగంలో సైద్ధాంతిక వామపక్ష రాజకీయాలతో ముడిపడిన జానపద గీతాలు కేవలం ప్రచార సంగీతంగా తేల్చుకొని, ఆ పరిధి నుంచి బయటకి రాగలిగాడు. అయితే, సమాజగతికి నిరనురక్తుడై, అశాంతితో కలత చెంది రాసిన చాలా నిరసనగీతాలు 1960-1965లో రాసినవే!

3.

ఈ వ్యాసంలో డిలన్ పాడిన/రాసిన ‘పాటలు’ కొన్ని తీసుకొని వాటిని గురించి ముచ్చటిస్తాను. ఇందులో కొన్ని పాటలు ప్రపంచ ప్రసిద్ధికెక్కినవి. కొన్నింటికి జాతీయగీతాల స్థాయి వచ్చింది. మరికొన్ని పాటలు డిలన్ డిస్కులు రోజూ వినే వారికే గుర్తుకి రాకపోవచ్చు. ఇదేమీ వింత విషయం కాదు. డిలన్ సుమారు ఐదువందల పైచిలుకు పాటలు రాసి పెట్టాడు. వాటి నుంచి ఎంపిక తేలిక కాదని చెప్పనక్కరలేదు.

డిలన్ రాసిన మొట్టమొదటి నిరసన గీతం (Protest song) ది డెత్ ఆఫ్ ఎమెట్ టిల్ (The Death of Emmett Till). 1955 మిసిసిపీలో, ఎమెట్ టిల్ అనే పధ్నాలుగు సంవత్సరాల వయసున్న ఆఫ్రికన్ అమెరికన్ కుర్రవాడిని, తెల్ల ఆడపిల్లను చూసి ఈల వేసిన కారణంగా – కొట్టి, కాల్చి చంపారు. తరువాత రాసిన పాట జాన్ బార్చ్ సంఘం గురించి (Talkin’ John Birch Society Blues) తీవ్ర మితవాద (extreme right-wing) సంఘం వారిని వేళాకోళం చేస్తూ రాసిన పాట. 1963లో ఎడ్ సలివన్ టీ.వీ. షోలో (Ed Sullivan show) ఈ పాట పాడటానికి వీలులేదని టీ.వీ. నిర్వాహకులు అభ్యంతరం చెపితే, రిహార్సల్ నుంచి డిలన్ వెళ్ళిపోయాడు.

మరొక పాట, ఆక్స్‌ఫర్డ్ టౌన్ (Oxford Town). జేమ్స్ మెరిడిత్ (James Meredith) నల్ల విద్యార్థి. మొట్టమొదటి సారి ఒక నల్ల విద్యార్థికి మిసిసిపి విశ్వవిద్యాలయంలో చదువుకోవటానికి అనుమతి ఇచ్చిన కారణంగా జరిగిన అల్లరులపై రాసిన పాట. ఇటువంటి నిరసన గీతాలు చాలా ఉన్నాయి కాని, వాటిలో ప్రపంచ ప్రసిద్ధికెక్కిన గీతాలు రెండు: అవి వరుసగా: Only A Pawn in Their Game, The Lonesome Death of Hattie Carroll. ఈ రెండింటిలోనూ నల్లజాతి వ్యక్తిని హత్య చేసిన నేరానికి డిలన్ చూపిన కోపం, కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. మొదటిగీతం కన్నా రెండవ గీతం గొప్పదని నా ఉద్దేశం. ఎందుకంటే, ఆ గీతంలో కోపం కన్నా, నైతిక ధైర్యం, న్యాయస్థాన ధర్మంపై వ్యంగ్యం, ఆకర్షణీయంగా చిత్రించాడు.

Only A Pawn in Their game చూడండి: మెడ్గర్ ఎవర్స్‌ని (Medgar Evers) పొంచి ఉండి తుపాకీతో కాల్చిన వార్త, పాటలో విశేషం. మెడ్గర్ ఎవర్స్ హత్య అయిన ఒక నెల తరువాత, గ్రీన్‌వుడ్, మిసిసిపీలో మొదటిసారి, డిలన్ ఈ పాట పాడాడు. ఇదే పాట రెండవసారి ఆగస్ట్ 28, 1963న వాషింగ్టన్‌లో మార్టిన్ లూథర్ కింగ్ I have a Dream ఉపన్యాసానికి ముందు పాడాడు.

Only a Pawn in Their Game

A bullet from the back of a bush took Medgar Evers’ blood
A finger fired the trigger to his name
A handle hid out in the dark
A hand set the spark

Only A Pawn in Their Game

Two eyes took the aim
Behind a man’s brain
But he can’t be blamed
He’s only a pawn in their game.

A South politician preaches to the poor white man
“You got more than blacks, don’t complain
You’re better than them, you been born with white skin” they explain
And the Negro’s name
Is used it is plain
For the politician’s gain
As he rises to fame
And the poor white remains
On the caboose of the train
But it ain’t him to blame
He’s only a pawn in their game.

The deputy sheriffs, the soldiers, the governors get paid
And the marshals and cops get the same
But the poor white man’s used in the hands of them all like a tool
He’s taught in his school
From the start by the rule
That the laws are with him
To protect his white skin
To keep up his hate
So he never thinks straight
‘Bout the shape that he’s in
But it ain’t him to blame
He’s only a pawn in their game.

From the poverty shacks, he looks from the cracks to the tracks
And the hoof beats pound in his brain
And he’s taught how to walk in a pack
Shoot in the back
With his fist in a clinch
To hang and to lynch
To hide ‘neath the hood
To kill with no pain
Like a dog on a chain
He ain’t got no name
But it ain’t him to blame
He’s only a pawn in their game.
Today, Medgar Evers was buried from the bullet he caught
They lowered him down as a king
But when the shadowy sun sets on the one
That fired the gun
He’ll see by his grave
On the stone that remains
Carved next to his name
His epitaph plain:
Only a pawn in their game.

ఈ క్రింది చరణాలు చూడండి.

Two eyes took the aim
Behind a man’s brain
But he can’t be blamed
He’s only a pawn in their game

పద్యంలో మాటల పొందిక, అంత్యప్రాస చక్కగా అమరుతాయి. అంతకన్నా ముఖ్యం: రెండు కళ్ళు గురి పెట్టాయి, వెనుక ఉంది వాడి మెదడు, వాడు వాళ్ళ ఆటలో ఒక పావు మాత్రం, వాడి మీద నెపం మోపటం అనవసరం, అంటాడు. చంపిన వాడు తెల్లవాడు, చనిపోయిన వాడు నల్లవాడు; ఆ రోజు పదిలక్షల పైచిలుకు నల్లవాళ్ళు వాషింగ్టన్ లో ఈ పాట వింటున్నారు; ‘చంపినవాడిపై నెపం మోపకండి,’ అని పాడటానికి డిలన్‌కి నిజంగా కడివెడు ధైర్యం ఉన్నదని చెప్పాలి! మెడ్గర్ ఎవర్స్ పేరు పాటలో రెండుసార్లు వస్తుంది; హంతకుడి పేరు చెప్పడు; వాడు ఒక ఆటలో పావే కదా!

He’ll see by his grave
On the stone that remains
Carved next to his name
His epitaph plain:
Only a pawn in their game

వాడి సమాధి పై ఆఖరి మాటలు, వాళ్ళ ఆటలో వీడు ఒక పావు, అని!

రెండవ కవిత (పాట!) ది లోన్‌సమ్ డెత్ ఆఫ్ హ్యాటీ కరోల్ (The Lonesome death of Hattie Carroll) చూద్దాం.

The Lonesome Death Of Hattie Carroll

William Zanzinger killed poor Hattie Carroll
With a cane that he twirled around his diamond ring finger
At a Baltimore hotel society gath’rin’

The Lonesome Death of Hattie Carol

And the cops were called in and his weapon took from him
As they rode him in custody down to the station
And booked William Zanzinger for first-degree murder
But you who philosophize disgrace and criticize all fears
Take the rag away from your face
Now ain’t the time for your tears.

William Zanzinger who at twenty-four years
Owns a tobacco farm of six hundred acres
With rich wealthy parents who provide and protect him
And high office relations in the politics of Maryland
Reacted to his deed with a shrug of his shoulders
And swear words and sneering and his tongue it was snarling
In a matter of minutes on bail was out walking
But you who philosophize disgrace and criticize all fears
Take the rag away from your face
Now ain’t the time for your tears.

Hattie Carroll was a maid in the kitchen
She was fifty-one years old and gave birth to ten children
Who carried the dishes and took out the garbage
And never sat once at the head of the table
And didn’t even talk to the people at the table
Who just cleaned up all the food from the table
And emptied the ashtrays on a whole other level
Got killed by a blow, lay slain by a cane
That sailed through the air and came down through the room
Doomed and determined to destroy all the gentle
And she never done nothing to William Zanzinger
And you who philosophize disgrace and criticize all fears
Take the rag away from your face
Now ain’t the time for your tears.

In the courtroom of honor, the judge pounded his gavel
To show that all’s equal and that the courts are on the level
And that the strings in the books ain’t pulled and persuaded
And that even the nobles get properly handled
Once that the cops have chased after and caught ’em
And that ladder of law has no top and no bottom
Stared at the person who killed for no reason
Who just happened to be feelin’ that way without warnin’
And he spoke through his cloak, most deep and distinguished
And handed out strongly, for penalty and repentance
William Zanzinger with a six-month sentence.
Oh, but you who philosophize disgrace and criticize all fears
Bury the rag deep in your face
For now’s the time for your tears.

ఎక్కడా పాటలో జాన్జింగర్ ఏ జాతివాడో, హ్యాటీ కరోల్ ఏ జాతి మనిషో చెప్పడు. అయితే పైకి చెప్పక్కరలేదు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గం ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. ఏ దేశంలో నైనా జరగవచ్చు. ఏ కాలంలో నైనా జరగవచ్చు. ఇకముందు ఇటువంతి దురాగతాలు జరగవనటానికి ఆధారం లేదు. ఎందుకటే, జాన్జింగర్ కోటీశ్వరుడు. పురుషుడు. హ్యాటీ కరోల్ స్త్రీ. పేద స్త్రీ. ఈ కవితకి సార్వజనీనత ఉన్నదని చెప్పనక్కరలేదు.

మొదటి రెండు చరణాలు చూడండి :

William Zanzinger killed poor Hattie Carroll
With a cane that he twirled around his diamond ring finger

(విలియం జాన్జింగర్ పేదరాలు హ్యాటీ కరోల్‌ని చంపాడు
వాడి వజ్రపుటుంగరపు వేలు చుట్టూ గిరగిర తిరిగే చేతికర్రతో.
)

వజ్రపుటుంగరం వాడి వేలికి ఉండవచ్చు; వుండకపోవచ్చు. వజ్రపుటుంగరపు వేలు అనగానే వీడు ధనికుడని తెలుస్తుంది. అది, అతి సున్నితంగా, సూక్ష్మంగా గీతంలో కథ చెప్పటం. డిలన్ కవితలో ఎక్కడా కోపం కనిపించదు.

మొత్తం నాలుగు పద్యాలు. మూడింటిలో చివరి పాదాలు చూడండి.

… you philosophize disgrace and criticize all fears
Take the rag away from your face
Now ain’t the time for your tears.

పాటలో ఉన్న శక్తి అనువాదంలో రాదని తెలిసినా, నాకు చేతనైనంతలో తెలుగులో చెపుతాను.

అవమానం అని నీతులుచెప్పే మీరు
భయాలన్నిటినీ విమర్శించే మీరు
మీ ముఖాన్ని కప్పిన చింపిగుడ్డ తీయండి.
మీ కన్నీళ్ళకిది తరుణం కాదండి.

ముగింపు చరణంలో డిలన్ అంటాడు:

Bury the rag deep in your face
For now’s the time for your tears.

ఎందుకని?

In the courtroom of honor, the judge pounded his gavel
To show tha all’s equal and that the courts are on the level
And handed out strongly, for penalty and repentance
William Zanzinger with a six-month sentence.

జాన్జింగర్‌ని కోర్టుకి తీసికెళ్ళారు. న్యాయస్థానంలో అందరూ సమానమే కదూ! న్యాయం గుడ్డిది అని నానుడి. జడ్జి గారు జాన్జింగర్ ‘పశ్చాత్తాపానికి’ ప్రాయశ్చిత్తంగా ఆరునెలల శిక్ష వేశారు! ఆరు నెలలు! యాభైవక్క సంవత్సరాల స్త్రీ, పదిమంది పిల్లల తల్లి, ఎప్పుడూ నోరెత్తకుండా ఇల్లు మొత్తం తుడుస్తూ పనిచేసే పనిమనిషిని, నిష్కారణంగా చంపిన పొగాకు వ్యాపారి, కోటీశ్వరుడికి శిక్ష, మొక్కుబడిగా వేసిన శిక్ష ఆరునెలలు! అసలు నీతి ఏమిటి? నువ్వు కోటీశ్వరుడివైతే, పట్టపగలు హత్య చేసి తేలికగా బయటపడగలవు. కోర్టుల్లో న్యాయాన్ని, వ్యంగ్యంగా ఇంతకన్నా బాగా మరెవరూ చెప్పలేరు.

జాన్జింగర్ తెల్లవాడు; హ్యాటీ కరోల్ నల్ల మనిషి. ఈ విషయం ఎక్కడా కవితలో చెప్పడు. చెప్పకపోయినా పద్యం పూర్తిగా చదివిన తరువాత తెలుసుకోవటానికి ఎంత నైపుణ్యం కావాలి?

రాజకీయకవిత రాయటానికి, కవిత రాజకీయంగా రాయటానికీ భేదం హ్యాటీ కరోల్ పాటలో కనిపిస్తుంది. డిలన్ చాలా రాజకీయకవితలు రాశాడు; కానీ ఈ కవిత అన్ని రాజకీయ కవితలకన్నా గొప్పది. ఈ కవితలో ప్రతి విషయం రాజకీయదృష్టితో చూడవచ్చు.

రాజకీయకవితల ప్రస్తావన వచ్చింది కాబట్టి, మరొక రెండు కవితలనుంచి క్లుప్తంగా చెపుతాను.

ఇడియట్ విండ్ (Idiot Wind) అన్న కవితలో డిలన్ రాస్తాడు:

Blowing like a circle round my skull
From the Grand Coulee Dam to the Capitol

మొత్తం పద్యం చాలా పెద్దది. అయితే ఈ రెండుచరణాలలో ఉన్న అంత్యప్రాసలో శ్లేష గుర్తించతగినది. గుండ్రంగా మనిషి పుర్రె, శాసనసభా భవనంపై గుండ్రంగా బురుజు – రెండూ గుండ్లు. (అమెరికన్లు దేశ రాష్ట్ర శాసనసభా భవనాలను క్యాపిటల్ బిల్డింగ్ అని అంటారు.) రాజకీయవాదులపరంగా ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇటువంటి శ్లేష, వ్యంగ్యంతో మనకి తెలుగులో శ్రీశ్రీ ఒక్కడే రాజకీయ కవిత రాయగలడని నా అభిప్రాయం.

అలాగే, 11 Outlined Epitaphs అనే పెద్ద కవితలో (ఇందులో మొదటి భాగం మాత్రమే డిలన్ పాడాడు) వాషింగ్టన్ శాసనసభ భవనం పైన గుండ్రటి బురుజు గురించి వ్యంగ్యంగా రాస్తాడు:

how many votes will it take
for a few set of teeth
to the congress mouths?
how many hands have t’ be raised
before hair will grow back
on the white house head?

మరొక సమయంలో మరెక్కడో ‘సంజాయిషీ’ చెపుతాడు: When I speak of bald heads, I mean bald minds, అని!

4.

ఇంతకు ముందు ఈ వ్యాసంలో కొన్ని పాటలకి ‘జాతీయగీతాల’ స్థాయి వచ్చిందని చెప్పాను. ఇప్పుడు ఆ పాటల గురించి ముచ్చటించుకుందాం. బ్లోయిన్ ఇన్ ది విండ్ (Blowin’ in the Wind), ది టైమ్స్ దే ఆర్ ఎ ఛేన్జిన్ (The Times They Are A-Changin) అనే రెండు పాటలూ ఆ స్థాయి పాటలని సంగీత విమర్శకులందరూ ఒప్పుకుంటారు. వీటితోపాటు, నేను లైక్ ఎ రోలింగ్ స్టోన్ (Like A Rolling Stone) అనే పాటని కూడా చేరుస్తాను.

Blowin’ in the Wind

How many roads must a man walk down
Before you call him a man?

Blowin’ In The Wind

How many seas must a white dove sail
Before she sleeps in the sand?
Yes, and how many times must the cannon balls fly
Before they’re forever banned?
The answer, my friend, is blowin’ in the wind
The answer is blowin’ in the wind

Yes, and how many years can a mountain exist
Before it’s washed to the sea?
Yes, and how many years can some people exist
Before they’re allowed to be free?
Yes, and how many times can a man turn his head
And pretend that he just doesn’t see?
The answer, my friend, is blowin’ in the wind
The answer is blowin’ in the wind

Yes, and how many times must a man look up
Before he can see the sky?
Yes, and how many ears must one man have
Before he can hear people cry?
Yes, and how many deaths will it take ’till he knows
That too many people have died?
The answer, my friend, is blowin’ in the wind
The answer is blowin’ in the wind

ఈ పాట డిలన్ 1962 ఏప్రిల్ నెలలో రాశాడు. ఈ పాట రాగం (tune), నో మోర్ ఆక్షన్ బ్లాక్ (No More Auction Block) అన్నమకుటంతో ప్రసిద్ధికెక్కిన బానిసత్వవ్యతిరేక నీగ్రో-ఆధ్యాత్మిక గీతం. ఈ ఆధ్యాత్మిక గీతాన్ని పాల్ రోబ్సన్ (Paul Robeson) అద్భుతంగా పాడాడు. బ్లోయిన్ ఇన్ ది విండ్ వినటానికి ముందు పాల్ రోబ్సన్ గీతం వినండి.

విడుదలైన వెంటనే ఈ పాట సంగీతప్రియులందరినీ ఆకర్షించటానికి ఈ పాట రాగానికున్న శ్రావ్యత, ప్రత్యేకత కావచ్చు. లేదా ఈ పాట పల్లవికున్న నిష్కాపట్యం, సరళతా కావచ్చు.

How many roads must a man walk down
Before you call him a man?

మనిషిని మనిషిగా గుర్తించటానికి
ఆ మనిషి ఎన్ని బాటలలో నడవాలి?

The answer, my friend, is blowin’ in the wind
The answer is blowin’ in the wind

ఈ ప్రశ్నకి సమాధానం, మిత్రమా!
గాలిలో వీస్తూ ఉంది
గాలిలో వీస్తోంది ఈ ప్రశ్నకి ఉత్తరం.

సమాధానం గాలిలో వీచుతూ (నినదిస్తూ) ఉండటం అంటే ఏమిటని? అడిగితే, గాలిలో వీస్తున్న స్పర్శ తెలియకపోతే, నేను ఏమని చెప్పను? అని అన్నాడు, డిలన్.

డిలన్ రాసిన పద్యంలో మూడు చరణాలలోనూ, నిర్దిష్టత లేకపోవడంతో, ఈ పాటకి ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థం చెప్పుకోవటానికి అవకాశం వచ్చింది. ఆ రకంగా దీనికి విశ్వవ్యాపకత వచ్చింది. ఇంకా ఎన్ని ఫిరంగి గుండ్లు పేలాలి, శాశ్వతంగా నిషేధింపబడటానికి? అన్న పదం యుద్ధాల గురించి అని చెప్పక్కరలేదు. ప్రత్యేకంగా ఒక యుద్ధం గురించి వేసిన ప్రశ్న కాదు. అలాగే, కొంతమంది ఎన్ని ఏళ్ళు బ్రతకాలి, స్వేచ్ఛగా జీవించటానికి? అన్న ప్రశ్న నిజమైన పౌరహక్కుల కోసం వేసినది. ఇక్కడ బ్రతకటం అంటే హీనంగా బ్రతకటం అని.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం గాలిలో వీస్తూ ఉండటం. ఈ పాట విన్న వాళ్ళు అందరూ ఈ సమాధానం గురించి చర్చించి ఉంటారు. ఈ సమాధానం అత్యంత స్పష్టమైనదైనా కావాలి, అందరికీ అర్థం ఐపోయినదైనా కావాలి; లేదా ఎవరికీ పట్టుదొరకని దైనా అయి ఉండాలి! అర్థసందిగ్ధత ఈ పాట నచ్చటానికి ఒక కారణమై ఉండవచ్చు. బహుశా ఈ విషమప్రశ్నలన్నిటికీ సమాధానం: నింగికీ నేలకీ మధ్యనున్న ప్రతి అణువులోనూ స్పందిస్తూ ఉండి, అందరినీ స్పర్శిస్తూ ఉండవచ్చు. ఆ విషయం అందరికీ పట్టుబడి ఉండకపోవచ్చు.

మే 1963లో డిలన్ ఈ పాట విడుదల చేశాడు. విచిత్రం ఏమిటంటే, Peter, Paul and Mary అనే ప్రసిద్ధ జానపదగేయకారులు విడుదల చేసిన ఇదే గీతం దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. కోట్లకొద్దీ అమెరికన్లు ఈ పాట రేడియోలో వినటం, ఆలపించటం, ఈ రికార్డుని సభల్లో వెయ్యటం, చర్చిల్లోను, సినగాగుల్లోనూ పాడటం ఒక వార్తావిశేషం.

రెండవ పాట: ది టైమ్స్ దే ఆర్ ఎ ఛేంజిన్.

The Times They Are a-Changin’

Come gather ’round people
Wherever you roam
And admit that the waters
Around you have grown
And accept it that soon
You’ll be drenched to the bone
If your time to you
Is worth savin’

The Times They Are A-Changin’

Then you better start swimmin’
Or you’ll sink like a stone
For the times they are a-changin’.

Come writers and critics
Who prophesize with your pen
And keep your eyes wide
The chance won’t come again
And don’t speak too soon
For the wheel’s still in spin
And there’s no tellin’ who
That it’s namin’
For the loser now
Will be later to win
For the times they are a-changin’.

Come senators, congressmen
Please heed the call
Don’t stand in the doorway
Don’t block up the hall
For he that gets hurt
Will be he who has stalled
There’s a battle outside
And it is ragin’
It’ll soon shake your windows
And rattle your walls
For the times they are a-changin’.

Come mothers and fathers
Throughout the land
And don’t criticize
What you can’t understand
Your sons and your daughters
Are beyond your command
Your old road is
Rapidly agin’
Please get out of the new one
If you can’t lend your hand
For the times they are a-changin’.

The line it is drawn
The curse it is cast
The slow one now
Will later be fast
As the present now
Will later be past
The order is
Rapidly fadin’
And the first one now
Will later be last
For the times they are a-changin’.

కాలం మారుతూన్నది; కాలంతోపాటు మీరూ మారాలి. మారకపోతే, ఏమవుతుందో డిలన్ హెచ్చరిస్తున్నాడు. మీ చుట్టూ నీళ్ళు పొంగి పొరలుతున్నాయి, ఈది బయటపడకపోతే, రాయిలా ముణిగి పోతారు. బ్లోయిన్ ఇన్ ది విండ్ పాటలో లాగా ఈ పాట పల్లవి కూడా శ్రోతలని వెంటాడుతుంది.

ఎవరెవరికి ఈ హెచ్చరిక? మొదటి చరణంలో హెచ్చరిక సామాన్య ప్రజానీకానికి. రెండవ చరణంలో, సోదె చెప్పే రచయితలకి, విమర్శకులకీ హెచ్చరిక. తొందరపడి మాట్లడకండి. కాలంతో పాటు మీరూ మారండి. మూడవ చరణంలో, శాసనసభ్యులకు హెచ్చరిక. ద్వారానికి అడ్డు పడకండి. అడ్డుపడ్డ వాళ్ళు తరువాత బాధ పడతారు. నాలుగవ చరణంలో — అరవయ్యో దశాబ్దంలో తల్లి తండ్రులకి హెచ్చరిక చేస్తున్నాడు. మీ పిల్లలు మీ చెప్పుచేతల్లో, మీ స్వాధీనంలో లేరు. కారణం, మీ పాత బాటలు మారిపోతున్నాయి; క్రొత్త దోవన వాళ్ళు పోతారు. వాళ్ళకి సహకరించలేకపోతే, అడ్డు తప్పుకోండి.

The line it is drawn/The curse it is cast
The slow one now /Will later be fast

And the first one now
Will later be last.

డిలన్ ఈ పాట గురించి ఇలా రాస్తాడు: ఈ పాటకి ఒక స్పష్టమైన ప్రయోజనం ఉన్నది. నేను ఎవరికి ఏది చెబుదామనుకున్నానో, నాకు తెలుసు!

అయితే, అరవైల్లో ‘క్రొత్త’ దోవలు పట్టిన జనం ఇప్పుడు ఏమనుకుంటున్నారు? డిలన్ ఊహించినట్టుగా కాలం మారలేదు. సరిగదా, కాలం మారటం బహుశా మానుకొన్నట్టు కనపడుతున్నది. ఈ విషయం అప్పటి జనానికి ఇప్పుడు తెలిసే ఉండాలి. ఏది ఏమయినప్పటికీ, ఈ పాట ప్రజల మనసుల్లో హత్తుకొని పోయింది. కాలం మంచి కోసం మారాలని కోరటం ఎప్పుడూ, ఎవ్వరూ కాదనరు కదా! అది సహజం. అందుకని, ఈ పాట, ఇప్పటికీ గొప్ప పాటే!

ఇప్పుడు మూడవ పాట చూద్దాం.

Like A Rolling Stone

Once upon a time you dressed so fine
You threw the bums a dime in your prime, didn’t you?
People’d call, say “Beware doll, you’re bound to fall”
You thought they were all kiddin’ you
You used to laugh about

Like A Rolling Stone

Everybody that was hangin’ out
Now you don’t talk so loud
Now you don’t seem so proud
About having to be scrounging for your next meal
How does it feel
How does it feel
To be without a home
Like a complete unknown
Like a rolling stone?

You’ve gone to the finest school all right, Miss Lonely
But you know you only used to get juiced in it
And nobody has ever taught you how to live on the street
And now you find out you’re gonna have to get used to it
You said you’d never compromise
With the mystery tramp, but now you realize
He’s not selling any alibis
As you stare into the vacuum of his eyes
And ask him do you want to make a deal?
How does it feel
How does it feel
To be on your own
With no direction home
Like a complete unknown
Like a rolling stone

You never turned around to see the frowns on the jugglers and the clowns
When they all come down and did tricks for you
You never understood that it ain’t no good
You shouldn’t let other people get your kicks for you
You used to ride on the chrome horse with your diplomat
Who carried on his shoulder a Siamese cat
Ain’t it hard when you discover that
He really wasn’t where it’s at
After he took from you everything he could steal
How does it feel
How does it feel
To be on your own
With no direction home
Like a complete unknown
Like a rolling stone?

Princess on the steeple and all the pretty people
They’re drinkin’, thinkin’ that they got it made
Exchanging all kinds of precious gifts and things
But you’d better lift your diamond ring, you’d better pawn it babe
You used to be so amused
At Napoleon in rags and the language that he used
Go to him now, he calls you, you can’t refuse
When you got nothing, you got nothing to lose
You’re invisible now, you got no secrets to conceal
How does it feel
How does it feel
To be on your own
With no direction home
Like a complete unknown
Like a rolling stone?

ఈ పాట జానపద కథలా మొదలవుతుంది. Once upon a time…, అనగనగా ఒక సారి, అంటూ! ఈ పాట రాక్ రేడియో సంగీత చరిత్రలో ఒక మైలు రాయి. ఈ పాట నిడివి ఆరు నిమిషాలు. రేడియోలో పాటలు ఏవీ రెండు, మహా అయితే మూడు నిమిషాలు మాత్రమే వినిపించే రోజులవి. ఇది 1965 ప్రాంతాలలో మాట. ఇంకొక విశేషం. 2005లో ఈ పాట మీద గ్రెయ్‌ల్ మార్కస్ 200 పేజీలపుస్తకం రాశాడు. ఒక్క పాట మీద 200 పేజీల పుస్తకం!

పాటలో మిస్ లోన్లీ మంచి పేరున్న బడులకి వెళ్ళింది. బహుశా డిగ్రీలు సంపాదించి వుండవచ్చు. ఒకప్పుడు ధనికురాలే! ఇప్పుడు రేపటి కూడు ఎక్కడనుంచి వస్తుందో తెలియని దైన్య స్థితికి వచ్చింది. బ్రతకటం ఎల్లాగో నేర్పని బడులకి వెళ్ళిందని విసురు ఉన్నది.

How does it feel
How does it feel
To be without a home
Like a complete unknown
Like a rolling stone?

అదే వరసలో, కొద్దిమార్పుతో పాట ముగుస్తుంది.

How does it feel
How does it feel
To be on your own
With no direction home
Like a complete unknown
Like a rolling stone?

పాట కోపంగా ఆవేశంతో మొదలవుతుంది. ఈ మిస్ లోన్లీ ఎవరు? ఒకప్పుడు తన ప్రేయసి జోన్ బాయెజ్ (Joan Baez) అని అనుకుంటే, డిలన్ స్త్రీ ద్వేషి అవుతాడు! అది తప్పు; పాట వింటున్న శ్రోతలు అని అనుకుంటే, డిలన్ మానవద్వేషి అవుతాడు. ‘నాచు అంటని గులకరాయి బ్రతుకు’ అని ఆక్షేపణ. ఇది ఒక అభిప్రాయం. ఈ పాటలో ‘దురుద్దేశం’ అనేది ఏమన్నా ఉంటే, దాని స్వభావచిత్రణకి గురుతు ఈర్ష్య కాదు; హార్దత అని రాసిన విమర్సకులు కూడా ఉన్నారు. నెపోలియన్ అంతవాడికి పతనం తప్పలేదు. డిలన్ కొన్ని కాల్పనిక ఆధారాలని కాలదన్ని, నీ గురించి నువ్వు తెలుసుకో – అని అంతిమ సత్యం చెపుతున్నాడు. ఇది మరి కొందరి ధోరణి. ఏది ఏమయినా, ఈ ద్వంద్వత ఆకర్షణీయమైనదే!

5.

డిలన్ నిరసన గీతాల పాటకుడిగా ప్రసిద్ధికెక్కాడు. ‘నేను ప్రొటెస్ట్ బాలడీర్‌ని కాను; ప్రేమగీతాలు రాసే కవిని,’ అని చెప్పాడు. అయితే, ఒకసారి ఒక లేబుల్ పడితే, దానిని కాదనటం కష్టం. 1960 ప్రాంతంలో, జానపదసంగీతం పేరుతో వస్తున్న పాటలు విని ఆశాభంగం చెందాడు. అవి కేవలం నినాదాలని ఉద్ఘోషిస్తూ, వామపక్షసైద్ధాంతిక చిత్రణ చేసే ప్రచార సాధనాలుగా పరిణమిస్తున్నాయని, తన సన్నిహితులతో, ‘మీరింకా ఎందుకు ఇల్లాంటి పాటలు రాస్తున్నారు? మానండి,’ అని చెప్పాడు. బహుశా అప్పుడే, ఆ ధోరణికి స్వస్తి చెప్పి, డెసొలేషన్ రో (Desolation Row), బాలడ్ ఆఫ్ ఎ థిన్ మాన్ (Ballad of A Thin Man), విజన్స్ ఆఫ్ జోహానా (Visions of Johanna) లాంటి పాటలు రాశాడు. డెసొలేషన్ రో నాకు చాలా నచ్చిన పద్యం. దాన్ని గురించి మరెప్పుడైనా రాస్తాను.

డిలన్ క్రిస్టియన్ మత ధోరణులు విరివిగా కనిపించే పాటలు కూడా రాశాడు. ఉదాహరణకి, హైవే సిక్స్‌టీవన్ రీవిజిటెడ్ (Highway 61 Revisited), ప్రెషస్ ఏంజెల్ (Precious Angel), సేవింగ్ గ్రేస్ (Saving Grace), ఫరెవర్ యంగ్ (Forever Young), వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? (What Can I Do for You?) మొదలైనవి.

డిలన్ రాజకీయాలు కూడా వింతగా కనిపిస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్‌తో ఒకే స్టేజ్ మీద నిబడి, ఓన్లీ ఎ పాన్ ఇన్ దెయ్‌ర్ గేమ్ పాడిన వ్యక్తి, వియెత్నాం యుద్ధంపై తను ఎటువైపో చెప్పలేదు. అల్లాగే 2005 వరకూ ఇరాక్ యుద్ధంపై తను ఎటు ఉన్నాడో చెప్పలేదు. అంతేకాదు; బ్యారీ గోల్డ్‌వాటర్‌ని (Barry Goldwater) సమర్థించకపోయినా, వ్యతిరేకించలేదని తానే రాసుకున్నాడు. ఎన్ని వైరుధ్యాలున్నా, డిలన్ గొప్ప పాటకుడు; మంచి కవి అని ఒప్పుకోక తప్పదు. మహాకవులకి ఈ వైరుధ్యాలు ఉండటం వింత కాదు.

2015లో ఒక ఉపన్యాసంలో డిలన్ తన పాటలు, అమెరికన్ సాహిత్యంలో వాటి స్థానం గురించి ఇలా అన్నాడు:

Don’t be fooled. I just opened up a different door in a different kind of way… I didn’t think I was doing anything different. I thought I was just extending the line.


ఈ వ్యాసం రాయటానికి నేను సంప్రదించిన పుస్తకాలు, వ్యాసాలు:

  1. బాబ్ డిలన్ వెబ్‌సైట్.
  2. Dylan’s Visions of Sin by Christopher Ricks. Ecco Publ., 2001.
  3. This is a book by a British Professor of Poetry. He has written/ edited books on Milton, Tennyson, Housman, T.S. Eliot and so on. He belongs to the school of Formalism. As such, he goes into textual analysis very intensely. He looks at the text and syntax of the songs over their context. With this approach he finds hidden intricacies and significant connections between Dylan and great poets, especially the Symbolists and the Romantics. I found this book for me as a very hard reading. But, I have been benefited by giving several readings. I borrowed a few quotations, citations and paraphrased some analyses from this book in my article.

  4. Like a Rolling Stone: Bob Dylan at the Crossroads by Greil Marcus. Public Affairs Publ., 2006.
  5. Chronicles, Volume 1 by Bob Dylan. Simon and Schuster Publ., 2004.
  6. Articles by David Remnick, Sean Wilentz and Alex Ross, etc. in The New Yorker magazine Archives from 1964 – 2015.
  7. Bob Dylan in America by Sean Wilentz. Doubleday Publ., 2010.
  8. (I read only some reviews of the book. He traces the history, background and influences on almost all (500+) of Dylan’s songs.

  9. On February 9, 2015, accepting an award from MusiCares, Bob Dylan made a long – about 30 minutes long – speech. It is very rare for him. A complete text of the speech is reprinted in the Rolling Stones Magazine. It is a great read.)