ఈ సంచిక నుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని: ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా […]
పసిడి పన్నుల పఠాభి కన్నుమూత
” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత […]
ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.
ఇన్ని అనువాదాలకు నోచుకున్న మూలాలు నాకయితే ఎక్కువగా తెలియవు. ఆ దృష్టితో చూస్తే రవీంద్రుల మూలగీతపు రవికిరణాలు ఇంద్రధనుస్సులోని కొన్ని కొన్ని వర్ణాల కలయికలలా ఆయా అనువాదాల్లో వ్యక్తమయ్యాయి.
ఏదో చెప్పేసి ప్రపంచాన్ని ఉద్ధరించేయాలన్న విపరీతమైన తపనలో, అలా చేయడం ద్వారా ఏదో మహత్తర సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్న ఆత్మ సంతృప్తితో స్మగ్వినయంగా కథలు రాసేస్తూ వారూ, ఏమిటంటున్నారో ఎందుకంటున్నారో అర్థం కాక తల పగిలిపోతూ కూడా, మనకర్ధంగానిదేదో ఉండే వుండాలనుకుని సమర్ధించుకుంటూ మన అటెండన్సూ మామూలే.
అంతా ఒక పూలవాన, పూల బాట, పూల స్పర్శ ఈ అమ్మాయి ఎంత సున్నితమో అనిపిస్తుంది ఏ కవిత చదివినా.
ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానం అందించారు. అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న భావాల్ని ఇంకొంచెం పరిశీలించాలనిపించింది.
నిరంతరం నిన్నే చూస్తుంటా
వృక్షాల కొమ్మల్లోంచి–
కళ్ళు చికిలించే సూర్యునిలా
రాజ్యాధికారంకన్నా సుందరి సౌందర్య సామ్రాజ్యంలో బానిసత్వమే అతనికి అతి మక్కువ.
పచ్చని వసంతం నిష్క్రమిస్తుంది
పాడిన కోకిల ఎగిరిపోతుంది
మాధుర్యాలు మాత్రం …
చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. అదెంతనిజమో తెలియదు గానీ, చిన భూషయ్య పుట్టగానే, ‘ధరణి కంపించింది. కులపర్వతాలు వణికిపోయాయి. సముద్రంలో పెనుతుఫానులొచ్చాయి. ఆకాశంలో తోకచుక్కలు పొడిచాయి. ఫెళఫెళమని పిడుగులు పుడమిన పడ్డాయి.’
మడిమలొత్తుకపోతున్న అరిగిన చెప్పుల నడుక
గుండెలు అవిసిపోతున్న అలసిన తప్పుల నడక
ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు.
పేరడీ అద్భుతమైన ప్రక్రియ. జనానికి, ఆనందం కలిగించే ప్రక్రియ. గొప్ప పద్యానికి పేరడి రాస్తే, ఆ పేరడి కూడా శాశ్వతంగా పడి ఉంటుంది.
మళ్ళీ పాత ముఖంతోనే వచ్చావా వ్యయా!
అంటూ ఎక్స్రే కళ్ళతో సెక్స్ వర్కర్లని
నిరసించినట్టుగా నిస్త్రాణగా గొణుగుతున్నాయి పంచాంగాలు
‘ఈ పొడి మాటలు తప్ప తామిద్దరూ పెద్దగా మాట్లాడుకునేదేం ఉండదా ఇప్పట్లో ‘, అనుకుంది. ఇక తమకు పిల్లలు పుడితే సైగలు తప్ప మాటలు రావేమో వాళ్ళకు అనే ఆలోచన వచ్చి నవ్వొచ్చింది. అతనూ నవ్వాడు ఆమె ఎందుకు నవ్వుతుందో తెలియకపోయినా.
బాలన్స్ లేని సామాజిక సమస్యల కథలు, కథగానూ చెడతాయీ, ఆ సమస్య పట్ల సానుభూతీ, ఆలో చనా రగిలించటం అటుంచి, ఆ సమస్యని పెద్ద జోక్ లా తయారు చేస్తాయి.
సోదర సోదరీ మణులొద్దు.
స్వామీ, వద్దు, వద్దు
పెళ్ళొద్దు, పెటాకులొద్దు