పున్నమ

ధారగా కురుస్తోన్న వెన్నెల వర్షంలో
చెవొగ్గి విన్నాను.
యే శబ్దమూ వినిపించలేదు.
నీలగిరి వృక్షాలన్నీ వెండితో చెక్కబడి
నగరమంతా రజతకాంతిలో ఉపశమించి…

చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.

మూలం: Full Moon by Santa Barbara


ప్రమోద్ వడ్లకొండ

రచయిత ప్రమోద్ వడ్లకొండ గురించి:

క్లుప్తమైన పదాలతో ప్రేమ కవిత్వాన్ని, తాత్వికతను, ప్రకృతిని కొత్త వెలుగులో చూపిస్తున్న కవి.

 ...