రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

బాలగోపాల్‌కొక నూలుపోగు

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
నవంబర్ 2009


కే. బాలగోపాల్
20జూన్ 1952 – 08అక్టోబర్ 2009

బాలగోపాల్‌నీ పౌరహక్కుల పరిరక్షణా ఉద్యమాన్నీ వేరు చేసి మాట్లాడటం అసంభవం, అసాధ్యం. తెలుగునాట గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాస్వామిక హక్కులకోసం, ముఖ్యంగా, ఆర్థికంగా సమాజంలో అణగదొక్కబడిన, అణగదొక్కబడుతున్న ప్రజల హక్కుల కోసం నిద్రాహారాలు మాని నిరంతరం పోరాడిన ఏకైక వ్యక్తి బాలగోపాల్.

ఆయన ఆకస్మిక మరణం ఆయన చేపట్టిన ఉద్యమానికి తీరని లోటు. మేధావిగా మధ్యతరగతి విద్యాధికులని తన వ్యాస పరంపర ద్వారా మేలు కొలపటానికి ప్రయత్నించాడు. ఉద్యమ నిర్మాతగా సర్వదా ఒంటరిగా నిలబడ్డాడు. తను నమ్మిన ఉద్యమానికి స్వచ్ఛంద కార్యకర్తగా, రేయింబవళ్ళు కృషి చేసాడు. తన ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా ఆఖరి క్షణం వరకూ పౌరహక్కుల కోసం పోరాడాడు.

మేధావులు రెండు రకాలు. ఒక తరహా మేధావులు వారి ఆశయాలనీ, ఆలోచనలనీ కాగితంపై పెడతారు; మనందరికోసం. మరొక తరహా మేధావులు మాత్రం వారి ఆశయాలనీ, ఆలోచనలనీ కాగితంపై పెట్టడమే కాకండా ఆచరణలో కూడా పెడతారు. బాలగోపాల్ ఈ రెండవ తరహా మేధావి. బాలగోపాల్‌కి ఆశయం, ఆచరణా పేకా, పడుగులా జమిలిగా నడిచాయి. అదీ, అతని ప్రత్యేకత, అతని గొప్పతనం. సరిగ్గా అటువంటి వాడే మనం ఎప్పుడో మరిచిపోయిన మేధావి, మోహనదాస్‌ కరంచంద్ గాంధీ. గాంధీకి కూడా ఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం లేదు.

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు. ఆయన సరళమైన తెలుగులో రాసిన “ప్రాచీన భారతదేశచరిత్ర” (దామోదర్‌ ధర్మానంద్‌ కొసాంబి పరిచయం) ఇప్పటికీ తెలుగు చదవడం వచ్చిన ఎవరికైనా తేలికగా అర్థమయ్యే పుస్తకం. ఇది ప్రతి తెలుగుమనిషీ తప్పక చదవాల్సిన పుస్తకం. బాలగోపాల్ రాసిన ప్రతి తెలుగు రచనలోనూ, సరళత, పుష్టి,  తెలుగుదనం కనబడతాయి.

కొసాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని 1976లో మొట్టమొదటిసారిగా చదివి మార్క్సిస్ట్ నయ్యానని బాలగోపాల్ రాసాడు. తరువాత, కాలక్రమేణా ఆ మార్కిస్ట్ సిద్ధాంతాలని అధిగమించి, సామాజిక పరివర్తనకి అనువైన సైద్ధాంతిక ప్రయోగాత్మక సాధనాల పరంగా బాలగోపాల్ ఆర్జించిన పరిణతి (పరివర్తన కాదు!) గురించి వేరుగా నిష్పక్షపాతంగా పరిశోధించి రాయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

బాలగోపాల్ రాసిన “కల్లోల కథా చిత్రాలు” (1997) అన్న పుస్తకానికి నేపథ్యం రాస్తూ చలసాని ప్రసాద్ మేధావుల గురించి కొడవటిగంటి కుటుంబరావుగారు అన్న మాటలు ఉదహరించి, ఆ మాటలు అక్షరాలా బాలగోపాల్‌కి వర్తిస్తాయని అన్నాడు: “తల్లికీ, తండ్రికీ, గురువుకీ, దేశానికీ ప్రతి మనిషీ రుణపడి ఉంటాడు. మేధావికి మరో రుణం కూడా ఉన్నది. తన తలను పొలంగా మార్చి, దున్ని, ఎరువు వేసి, పంటలు ప్రజలకు పంచటం. ఇది తీర్చవలసిన బాకీ – తలబీడు పడిపోయే దాకా. ఆ తర్వాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది.” ఇది సత్యం.

బాలగోపాల్ కొసాంబి లాగానే గణిత శాస్త్రవేత్త. బాలగోపాల్‌లో తార్కికతకి అతని గణితశాస్త్ర ప్రావీణ్యత సహకరించి ఉండాలి. అతని తాత్వికతకి అది బలం చేకూర్చి ఉండాలి.

యద్యదాచరతి శ్రేష్ట స్తత్తదే వేతరోజనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

– భగవద్గీత, కర్మయోగం – 21

శ్రేష్టులైనవారు (గొప్పవారు) ఏ పనులు చేస్తారో, మామూలు మనుషులు కూడా ఆ పనులే చేస్తారు. వాళ్ళు ఏ విధమైన ప్రమాణాలు నిర్దేశిస్తారో, ఆప్రమాణాలని అందరూ అనుసరించుతారు, అని అర్థం. నిజం చెప్పాలంటే, శ్రేష్టులు ఏ పనులు చేస్తారో,అందరూ ఆ పనులే చెయ్యాలి. ఏ ప్రమాణాలను నిర్దేశిస్తారో, అందరూ ఆ ప్రమాణాలనే అనుసరించాలి  – అని గీతావాక్యం తిరగరాసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    jayaprabha November 1, 2009 2:20 pm

    బాలగోపాల్ మీద నాకు కోపం!!…జనాన్ని..జనం హక్కుల్నీ పట్టించుకునే తొందరలో తననితాను ఎంతో నిర్లక్ష్యం చేసుకున్నందుకు. బాలగోపాల్ ని ఇష్టపడే చాలామందిమీద నాకు కోపం[నాతోసహా..]..బాలగోపాల్ ని ప్రాణంతోనిలుపుకోవటం మనందరి..మరెందరి బతుకులకో..మరెన్నేళ్ళో ఎంతో అవసరమని గ్రహించలేనందుకు!. బాలగోపాల్ మీద నాకు కోపం!! తాను ప్రేమించే పౌరహక్కుల కోసం తాను మరెంతో అవసరమని నిజంగా అతను అనుకోలేకపోయినందుకు!!

    ఈ అణచివేత దారులకందరికీ మరింత ధైర్యాన్నిస్తూ…ఇంత తొందరగా…ఇంత నిర్లక్ష్యంగా..నీ జీవితాన్ని అప్పుడే ఎందుకు దాటేసావని అడిగే అవకాశం కూడా మనకెవ్వరికీ అతను ఇవ్వలేదనే..నాకు ఇప్పుడు బాలగోపాల్ అంటే చాలాకోపం!! చాలా కోపం! చాలా చాలా దు:ఖం!

    వెళ్ళిరావయ్యా బాలగోపాలా! ఏదో ఓ రూపంలో మళ్ళీ రావయ్యా!! ఇంత తొందరగా నిన్ను పోగొట్టుకోగల శక్తి లేని బలహీనులెందరో..నువ్వులేక ఈ దారుణ హింసాయుత లోకంలో బిక్కుబిక్కు మంటున్నారని .. నీతో ఎప్పటికీ ఇంక చెప్పలేమనే..ఎందరమో ఇలా… మౌనంగా మిగిలాం.. నిస్సహాయంగా మిగిలాం… కన్నీళ్ళతో…..

    జయప్రభ.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అనాథ ప్రేత సంస్కారాత్‌…
  • రచయితలు – ఎడిటర్లు
  • పాడిందే పాట అను ఒక పునశ్చరణ
  • మహరాజవ్వాలంటే…
  • నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?)

ఇటువంటివే…

  1. ఛందస్సు కొక కొండ కొక్కొండ

నవంబర్ 2009 సంచికలో ...

  • “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ
  • “మనలో మనం” సదస్సుకు ఆహ్వానం
  • 2009 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  • అమ్మ ఉత్తరం
  • ఈమాట నవంబర్ 2009 కొ.కు ప్రత్యేక సంచికకు స్వాగతం
  • ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం
  • ఎవరి బిడ్డ ఇది?
  • ఐశ్వర్యం – ఓ పరిచయం
  • కొ.కు ఉత్తరాలు – 1
  • కొ.కు ఉత్తరాలు – 2
  • కొ.కు ఉత్తరాలు – 3
  • కొ.కు. స్వగతం – బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం విమర్శన
  • కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం
  • కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా?
  • డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష
  • తన రచనల గురించి …
  • నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని మధుకేళి వర్ణన
  • నాయినమ్మ యిల్లు
  • నింగి-నేల
  • పత్త్రపతనకాలము
  • ప్రశ్న
  • ప్రాణాధికం
  • బాలగోపాల్‌కొక నూలుపోగు
  • బుర్రా విమర్శకు కొ.కు. సమాధానం
  • భావుకుల రచయిత కొ.కు.
  • రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది
  • రెండు అమెరికన్ రుతాలు
  • విశ్వాంతరాళం: పుస్తక పరిచయం
  • సమాజంలో స్త్రీ స్థానం
  • సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం
ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.