గీతాంజలి “నీవు” అనేది నాటి జ్ఞాపకం, “నేను” అనేది నేటి వర్తమానం నాటి జ్ఞాపకాల్లో నీతో నేటి వర్తమానాన్ని ఊహించా కాని నేటి వర్తమానంలో […]
జులై 2001
ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి.
1. తానా కథాసాహితి 2001 కథానికల పోటీలో విజేతలైన మూడు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.
ఈమధ్య “కథల పోటీలు, వాటి ప్రయోజనాలు” గురించి కొంత చర్చ జరుగుతోంది. ఈచర్చలో ముఖ్యంగా తానా, ఆటాలాటి సంస్థల పాత్ర గురించిన అంశం ప్రవాసాంధ్రులందరికీ సంబంధించినది.ఈ విషయం మీద పాఠకుల అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ బహుమతి విజేతల గుణావగుణాల గురించిన చర్చని ఆహ్వానిస్తున్నాం.
ఈకథల ప్రచురణకు కారకులైన శ్రీ జంపాల చౌదరి గారికి మా కృతజ్ఞతలు.
ఈపనిలో సాయం చేసిన శ్రీ శంకగిరి నారాయణస్వామి (నాశీ) గారికి మా థేంక్స్.
2. శ్రీ కనకప్రసాద్ ఏడాదిపైగా ధారావాహికగా రాస్తున్న “తమాషా దేఖో” ఈ సంచికతో ఆగిపోతోంది. పాత్రలు, ప్రదేశాలు, వర్తమాన సామాజిక స్థితుల్ని ప్రతిబింబించడంలో ఇది గురజాడ “కన్యాశుల్కం” వారసత్వం పుణికిపుచ్చుకున్నదని మా విశ్వాసం. ఇలాటి విశిష్టమైన రచనని “ఈమాట” కు అందించిన కనకప్రసాద్‌కి మా కృతజ్ఞతలు.
3. శ్రీ కలశపూడి శ్రీనివాసరావు ప్రవాసాంధ్రుల సాంస్కృతిక పరిరక్షణా కలాపాల గురించి సాధికారంగా, సంయమనంతో, నిర్దిష్టంగా రాసిన ఒక వ్యాసపరంపరని ఆంధ్రభూమి దినపత్రికలో ఈమధ్యనే ప్రకటించారు. ఒకపత్రికలో ప్రచురించబడ్డ రచనల్ని మళ్ళీ ప్రచురించకపోవడం “ఈమాట” నిర్దేశిక సూత్రాల్లో ఒకటి. ఐనా, ఈ వ్యాసాలు ముఖ్యంగా ఉత్తరమెరికా ప్రవాసాంధ్రులకే సంబంధించినవి కనుకా, వీటిలో స్పృశించిన, చర్చించిన విషయాల ప్రాముఖ్యత వల్లా, ఆ సూత్రానికి exception ఇచ్చి ఆవ్యాసాల్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం. ప్రవాసాంధ్రులందరూ వీటిని తప్పక చదువుతారని మా ఆశ. చదివి వారి అభిప్రాయాల్ని అందరితో పంచుకుంటే బాగుంటుంది.
4.వచ్చే నెలలో వినాయకచవితి రాబోతోంది. అది ఈసంచికాకాలంలో ఔతుంది గనక ముందుగానే రెండు వినాయకచవితి రచనలు ఇస్తున్నాం.
5. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ఇప్పటివరకు ఉత్తరమెరికాలో వచ్చిన తెలుగు సాహిత్యం మీద సమగ్రమైన పరిశీలనా గ్రంథాన్ని ప్రచురించాలని ఒక పథకం చేపట్టారు. ఇక్కడి రచయిత్రు(త)లందరినీ వారివారి రచనల్ని ఫౌండేషన్‌కి పంపవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. దీని తాలూకు అన్ని వివరాలున్న ప్రకటనను ఈ సంచికలో చూడొచ్చు.
6. “విశ్వకవిత” అనే ఓ కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం. దీన్లో, ప్రపంచ భాషల్లో ఉన్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కవితలకు తెలుగు అనువాదాల్ని ప్రచురిస్తాం.ఇదివరకు శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి కొన్ని అనువాదాలు ప్రచురించాం. ఇప్పుడు ఈ “విశ్వకవిత” శీర్షికని ప్రతిభావంతుడైన యువకవి తమ్మినేని యదుకుల భూషణ్ నిర్వహించబోతున్నారు. ఐతే ఈశీర్షిక అతని అనువాదాలకే పరిమితం కాదు. ఉత్సాహం వున్న మరెవరైనా కూడా అనువాదాలు చేస్తే మూలాన్ని,అనువాదాన్ని మాకు పంపండి.
7. “ఈమాట” పత్రికను తెలుగులిపిలో ప్రచురించగలగడానికి “లేఖ” సర్వర్ ఆధారం. దాన్ని ఇంతకాలం నడిపిన శ్రీ జువ్వాడి రమణ గారికి మా కృతజ్ఞతలు.
ఇది “తమాషా దేఖో” ధారావాహికలో ప్రస్తుతానికి ఆఖరి భాగం. కథ పూర్తిగా పూర్తి కాకపోయినా ఒక నడిమి మజిలీ చేరింది. కనకప్రసాద్ ముందుముందు మళ్ళీ ఇక్కడినుంచి మొదలుపెట్టి నిజమైన ముగింపుకి చేరుస్తారని ఆశిస్తాం.
తెలుగు సాహిత్యంలో ఇలాటి ప్రయోగాలు చాలా అరుదు. పాత్రల్ని, స్థలాల్ని, వర్తమానసమాజాన్ని ప్రతిబింబించటంలో ఈ ధారావాహిక గురజాడ వారి “కన్యాశుల్కం” వారసత్వం తీసుకున్నదని మా విశ్వాసం. ఇలాటి రచనను “ఈమాట”లో ప్రచురించటానికి అవకాశం కలిగించిన శ్రీ కనకప్రసాద్‌కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
1. శ్రీ గణనాథుని చరితము వాగర్థములందగింప వ్రాయగ నెంచీ నాగోపవీతధారుని యోగధ్యానంబుసల్పి యోచింతు మదిన్. 2. భక్తుల కోర్కెలు దీర్చగ శక్తికి మించిన వరములొసంగే […]
చిక్కబడిన చీకటిలాంటి నిశ్శబ్దం. గోడ పక్కన ఎండిపోయిన నాలుగైదు అరటి తొక్కలు. మూలగా చెత్తకుప్ప లోంచి బయలుదేరిన చీమలబారు వంటింటి గుమ్మం మీదెక్కి, మలుపుతిరిగి, […]
ప్రసిద్ధ ప్రపంచకవితల పరిచయం ఇటీవలి కాలంలో ఇతర భాషల్లో వచ్చిన గొప్పకవిత్వాన్ని పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశం. అలజడి,సంఘర్షణా,జీవితాన్ని అతలాకుతలం చేసే అనుభవాలు,అన్నీ […]
కొడుకలా అంటాడని కలలో కూడా అనుకోలేదు రామిరెడ్డి. ఆ మాటలు విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదతనికి. తన నెవరో పాతాళానికి తొక్కుతున్నట్లు, గుండెను […]
రాత్రంతా అవిశ్రాంతంగా రాట్నం వడికిందేమో
చంద్రునిలో అవ్వ,
దూదిపింజలుగా రాలే మంచుతో తోటంతా
మెత్తని పట్టుపరుపులా వత్తిగిల్లుతుంది.
తన ముందున్న గుంపును రెండు చేతుల్తోనూ పక్కకు తొలగించుకుంటూ కంపార్టుమెంటు గేటు ముందుకెళ్ళి “సంజీవీ! .. సంజీవీ!” అంటూ మరోసారి అరిచాడు జానీ. “జానీ […]
ఒక్కోసారి, ఒక చిన్న ప్రశ్న చాలు ఎండావానలకు చలించని బండరాళ్ళను తలపించే మన మనుగడకు అర్థం మనమే వెతుక్కోవడానికి… చప్పుడు చేయని చెరువులో చలనం […]
2001 జూన్ 29, 30, జులై 1వ తేదీలలో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( Telugu Association of […]
(ఈ వ్యాసం తయారుచేసింది మొదట “తానా 2001 నూవనీర్” కోసం . కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్నాం. ) తెలుగువాడి జీవనాడి […]
(ఫిలడెల్ఫియాలో జూన్ 30, జూలై 1 న తానా సభలలో ఒక భాగంగా జరిగిన సాహిత్య కార్యక్రమాల వివరాలు కొన్ని “ఈమాట” పాఠకుల కోసం […]
(ఈ వ్యాసాలు శ్రీ కలశపూడి శ్రీనివాస రావు గారు ఇటీవలే ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించారు. ఐతే వీటిలోని విషయం ఎక్కువభాగం ప్రవాసాంధ్రులు ముఖ్యంగా ఉత్తర […]
క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజు గారింట్లో చెప్పంగానే, నా కుడిచెయ్యి కొట్టేసినట్టనిపించింది. కుడి చేతిలో స్కాచ్ గ్లాసు జారిపోతుందేమోనని భయపడి, గట్టిగా […]
“గజగామిని” సినిమా చూసొచ్చిన నా మిత్రుడొకడు “తన్వీ శ్యామా..” శ్లోకం చదివబడ్డ తీరుకి ముగ్ధుడై దాని అర్ధం ఏమిటని అడిగాడు. చెప్పగానే, “ఆ సీన్‌లో […]
గరాజ్ లో పూజ జరుగుతోంది సంప్రదాయ బద్దంగా. అక్కడవున్న వాళ్ళు, లంకంత ఇల్లు ఎలా వుంటుందో అప్పటిదాకా చూడకపోయినా ప్రసాద్ కొన్న కొత్త ఇల్లు […]
“కవీనాం సమయః కవిసమయః” అని కవిసమయ సమాసానికి విగ్రహవాక్యం. కవుల ఆచరణే కవిసమయం అని అర్థం. శిష్టసాహిత్యమైన కావ్యాలు, ప్రబంధాలలో కవిసమయాలను ప్రయోగించడముంది. కాని […]
అప్పుడే బోటస్కుర్రు బస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే టైము పన్నెండైపోయింది. అన్న బాపేశ్వర శర్మ గారిని పర్మిషనడిగేసి గేటుదెగ్గర నాకోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఈ […]
సాధారణంగా కవులూ, సాహితీ వేత్తలూ అయిన వారు తెలుగు సినిమాలలో మాటల, పాటల రచయితలుగా స్థిరపడడం, వారి రచనలు బహుళ జనాదరణ పొందడం అనాదిగా […]
“పెళ్ళి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ?” అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో. వాళ్ళ రెండో అమ్మాయికి ఇటీవలే పెళ్ళి చేసి బాధ్యత తీరిందన్న […]
రచయిత జి. కళ్యాణ రావు “జ్ఞాపకం గతం కాదు” అని కవర్ పేజీలోనే హెచ్చరికగా మొదలైన అంటరాని వసంతం నవల ఒక పురాణం అని […]
పూవుల రంగులన్నీ లాగేసుకొని పారిపోతాడు సూర్యుడు నల్లని రాత్రి! పొద్దెక్కి లేచాను చెల్లాచెదురుగా ఎండ అడక్కుండా ప్రవేశించేది ఇదొక్కటే చీకట్లో నల్లపిల్లి మ్యావంది తను […]
వంగూరి ఫౌండేషన్ వారు 2000 సంవత్సరానికి వెలువరించిన ఈ ఆరవ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నాయి. గత ఐదు సంకలనాలలో ఆయా సంవత్సరపు ఉగాది […]
అన్నీ వదులుకోక తప్పదని చిన్నపాటి చెట్టుక్కూడా తెలుసు విలవిలలాడిపోతారు మీరు గలాభా చేయడం మాని పగటి ఎండను, రాత్రి వెన్నెలను నిగర్వంగా ఆహ్వానించి చతికిలపడిపోకుండా […]
సిగరెట్టును తగలేస్తారు పొగరంతా తగ్గి పొగయిపోగానే పీకను నలిపేస్తారు నాకుమాత్రం బ్రతకాలని ఉండదా? సుతారంగా, కొంత సున్నితం పాటించి నన్నిలా వదిలేయండి!
ముందుగా మౌనం కావాలి నిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలు ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి. గత వర్తమానాల మధ్య లయాత్మకంగా ఊగేందుకు మనసొక తూగుటుయ్యాల కావాలి. […]