పొద్దున్నే ఎనిమిదయ్యింది. బల్లుల్లా రకరకాల సైజుల కారులు, పెద్దవీ, చిన్నవీ, బుల్లిబుల్లివీ! గోడమీద బల్లులు పురుగు కనిపించంగానే దబుక్కున దూకినట్టు ముందుకారు వెనకాతల కాస్త […]
నవంబర్ 2002
“ఈమాట” కు ఇప్పుే నాలుగేళ్ళు నీంయి.
ఈ ఆనందకరమైన సన్నివేశానికి ప్రధాన కారకులుగా తమ రచనల్ని అందిస్తూ వస్తోన్న సాహితీకారుల్ని, వారినీ మమ్మల్నీ ఇతోధికంగా ప్రోత్సహిస్తోన్న పాఠకలోకాన్నీ, పేర్కొనాలి. ఇదివరకటిలానే ముందుముందు కూ మీ సలహాలతో, అభిప్రాయాలతో “ఈమాట” ఇంకా అభివృద్ధి సాధించటానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం.
ఇకనుంచి మీ అభిప్రాయాలు తెలుగులో చదవటానికి అవకాశం కల్పిస్తున్నారు శ్రీ నందుల మురళి గారు. వారికి మా కృతజ్ఞతలు. తెలుగువాక్యాలు రాసేవారు RTSలో టైప్ చేస్తే అది తెలుగులో కనిపిస్తుంది.
మీరు ఇది గ్రహించి వుంక పోవచ్చు కాని ఈ మధ్య “ఈమాట” వెబ్ సైట్ ఓ కొత్త హోస్టింగ్ సర్వీస్ కు మారింది. దీనివల్ల ఇంతకుముందు కన్న చాల ఎక్కువ మెమొరీ స్పేస్ అందుబాటు లోకి వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవటానికి, తెలుగు సాహిత్యాన్ని ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావటానికి శ్రవ్యరచనల్ని ప్రోత్సహించదలుచుకున్నాం. మీ మీ రచనల్ని ముఖ్యంగా కవితల్ని, శ్రవ్యరూపంలో కూ పంపమని కోరుతున్నాం. అలాగే, మన సంప్రదాయ సాహిత్యం నుంచి ప్రసిద్ధమైన ఘట్టాల్ని గాని, లేక సమకాలీన సాహిత్యంలోని గుర్తుంచుకోదగిన భాగాల్ని కాని భావయుక్తంగా చదివి (పాగలిగితే పాి) పంపితే, వాటిని పరిశీలించి ఉచితమైన వాటిని ప్రచురిస్తాం. మీరందరూ ఉత్సాహంగా ఈ పథకంలో పాల్గొనాలని మా ఆకాంక్ష. ఇప్పుున్న సాంకేతిక పరికరాల వల్ల ఇది చాలా తేలిక విషయం. ఆసనథధబసఱ , ఎపlబక్ష వషలనసధపష ఇథషబధ 9 అనే ప్రోగ్రామ్స్ ని ౌన్ ల్ో చేసుకుని (ఇవి రెూం ఫ్రీగానే దొరుకుతున్నాయి), ఒక మైక్రోఫోన్ కొనుక్కుంటే చాలు ఎవరైనా శ్రవ్యరచనల్ని చెయ్యొచ్చు. ఇలా పంపదల్చుకున్న వారు ఎపlబక్ష ఖషలనసధపష ను ఉపయోగించి .షర ఫైల్స్ ని తయారుచేసి పంపిం. .ళథహ ఫైల్స్ ని అంగీకరించలేం. .రవ3 ఫైల్స్ చేసిపంపినా సరే. ఈ రెంటిలో ఏదైనా ఒక్కో ఫైలు 5 ఔఇ కి మించకుాం ఉంాలి.
జన్మదిన ప్రత్యేకసంచికను మీ అంచనాలకు అనుగుణంగా తీసుకురాగలిగామని ఆశిస్తున్నాం. కనకప్రసాద్, ఆరి సీతారామయ్య, వేలూరి, వేమూరి వంటి మనకు పరిచితులైన వారితో పాటు కొందరు కొత్త కథకులు కూ ఇక్క కనిపిస్తారు. కవితల విషయంలో కూ అఫ్సర్, రవిశంకర్, యదుకులభూషణ్ , ఉదయభాస్కర్ లాటి ప్రసిద్ధుల తో పాటు కొందరు వర్ధమానకవుల్ని కూ వినవచ్చు. వ్యాసపరంపరలో మాచిరాజు సావిత్రి, జంపాల చౌదరి ప్రముఖుల విశ్లేషణలు ఆలోచనాత్మకాలు. ప్రత్యేకించి జయప్రభ కవిత్వాన్ని సమూలంగా, దీర్ఘంగా, లోతుగా విశ్లేషిస్తూ యదుకులభూషణ్ రాసిన వ్యాసం తెలుగు కవిత్వవిమర్శలో ఒక చెప్పుకోదగ్గ రచనగా నిలబుతుందని మా విశ్వాసం.
కె. వి. ఎస్. రామారావు
సమకాలీనత పాఠకుడిలో ఉత్సుకత రేపుతుంది. రచయిత దృక్పథం, శైలి, సమర్థత సమకాలీన వస్తువుని మంచికథగా మలచవచ్చు. ఆ కథలు గొప్ప కథలు కావాలన్నా, నాలుగు కాలాలు నిలవాలన్నా ఆ కథల్లో సార్వజనీనత, సార్వకాలికత కూడా ఉండాల్సిందే.
తెలుగు పద్యాలలో కనిపించే వివిధ శిల్ప విశేషాలను, ఆయా నిర్మాణ వైఖరుల సార్ధక్యాన్ని రసభావ పోషణ కనుకూలంగా సమన్వయించి చెప్పిన ఒక సమగ్రమైన శాస్త్రం గానీ సిద్ధాంత గ్రంథంకానీ యింతవరకూ తెలుగులో రాలేదు. ఈ దిశగా ఔత్సాహికుల దృష్టిని మళ్ళించడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఈ వ్యాసం.
శబ్ద కవిత్వమంతా అకవిత్వమా ? ఖచ్చితంగా కాదనే సమాధానం దాన్ని మించిన కవిత్వానికి కళ్ళు తెరిపించే ఒక ప్రయత్నమే ఇదంతా !
రెండేళ్ళ క్రిందట, చికాగోలో రెండవ అమెరికా తెలుగు సదస్సు నాందిగా, “మనం డయాస్పోరా రచయితలం. ఈ సదస్సు ముఖ్యోద్దేశం, తెలుగు డయాస్పోరా రచయితలని ఒకచోట […]
ప్రసిద్ధమైన లేదా ప్రతిభావంతమైన ఏ రచనకీ ఇది ప్రాచీనం, ఇది ఆధునికం అన్న విలువ లేదు! కవిత్వం అన్నది గోదావరి నది లాంటిది. ఎక్కడో […]