చిత్రానికి బలం ఆంబోతు, పీడిత గుర్రం, దిష్టిబొమ్మల్లా మనుషులు–ఇవన్నీ క్రూరమైన వక్రీకరణల నుండి ఉద్భవించాయి. ఈ రూపాల్లో పికాసో ప్రజా అరాచకాలకీ , దురాక్రమణకీ ఆత్మాశ్రయసమానత చూపించాడు. గ్వెర్నికా అత్యంత విషాదార్థాలకి, సామూహిక అవివేకతకి ప్రత్యేక ప్రతీక. మరో రకంగా చెప్పాలంటే, ఇది దాదాపు ఒక సైకాటిక్ డ్రాయింగ్.

‘చావు వెధవా!’ అని ఇందాక నోరెత్తిన పాపానికి నన్ను నేను లోపలే తిట్టుకుంటూ, బారు వెనక రాజ్యమేలుతున్న చంద్రముఖి కేసి దీనదృక్కొకటి ప్రసరించాను. ఆ కరుణామయి నన్ను కనికరించి, మరో డబుల్ జానీని ప్రసాదించింది. భక్తితో సేవించి, ‘దూధ్‌నాథ్’ నాఁబరగిన పాల తాగుబోతు తివారీ వాచాలత భరించే శక్తి పొందాను. బండి కూత పెట్టి స్టేషను వెడలింది. జానీగాడు నెత్తిన నడయాడుతున్నాడులా ఉంది, తల దిమ్ముగా అనిపిస్తోంది.

తన బలిపీఠం నవల మలిప్రచురణకు ముందుమాట రాస్తూ, ఆ నవలలోని అనంగీకార భావాలనూ భాగాలనూ ఉతికి, ఆరవేస్తూ రంగనాయకమ్మ ‘ఇపుడు ఈ నవలకు ప్రభుత్వం ఎందుకు అకాడమీ అవార్డు ఇచ్చిందో నాకు స్పష్టంగా, శాస్త్రీయంగా తెలుసు’ అంటారు. శప్తభూమి నవలను మరోసారి మరోసారి చదివితే ఆ మాట నాకు పదేపదే గుర్తొస్తోంది.

బండ్రాజు పుట్టినప్పుడు అతని జాతకం చూసిన సత్రంలోని సాధువులూ సన్నాసులూ ‘సిరి నీకు చిడుమూ గజ్జీ పట్టినట్టు పట్టేస్తుందని, బండోడికి అదృష్టం, దరిద్రం తగులుకున్నట్టు తగులుకొంటుందని’ ఒకటే ఊదరగొట్టారు. బండ్రాజు పదహారేళ్ళ ప్రాయంవాడైనా ఇప్పటికీ వాళ్ళా బాకా ఊదడం మానలేదు. అది నిజమని నమ్మిన నరసరాజు ఇంటి తలుపులు వేసేస్తే లక్ష్మీదేవి ఎక్కడ రావడం మానేస్తుందోనన్న అనుమానంతో వాటిని బార్లా తెరిచే వుంచడం మొదలెట్టాడు.

మాకు రేషను సంవత్సరానికి తలా ముప్ఫై కిలోలివ్వాలని ఫార్మ్ అధికార్లు నిర్ణయించేరు. ఆ తర్వాత సంవత్సరం అది పాతిక్కిలోలయ్యింది. ఎండాకాలం తర్వాత అది 22 కిలోలయ్యింది. ఆ తర్వాత అది ఇరవయ్యొక్క కిలోలూ, పంతొమ్మిదీ, పదహారూ అయ్యి పన్నెండు దగ్గిరకొచ్చింది. కరువు ఆఖరి సంవత్సరం–పంతొమ్మిది వందల అరవయ్యొకటి–వసంతకాలం నాటికి అది పది కిలోలయ్యింది.

అంగలతో వాడెవడో
నింగి కత్తిరిస్తుంటే
అంతులేని వర్షమొకటి
అవని నంత ముంచుతోంది

తలలు లేక జనమంతా
తలోదిక్కు పోతుంటే
కనిపించని వాసుకికై
సురాసురులు ఒకటైరి

వంటింట్లోంచి గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. తన భార్య తన ముందు తెలివి ప్రదర్శిస్తోంది. కొడుకు ముందు కూడా తనను అధఃపాతాళానికి దిగజార్చేసింది. నేరుగా తనే అడిగితే బాధే ఉండేది. ఇప్పుడు అహం కూడా దెబ్బతింది. గట్టి ఉలి దెబ్బ. తన భార్య తనకంటే తెలివిగలది. మొదటి దెబ్బ. తనిప్పుడు కుటుంబానికి ఓ పూట తిండి పెట్టలేని నిస్సహాయుడు. రెండో దెబ్బ. ఈ రెండు అంతకు ముందే తగిలినవి.

బిస్మిల్లాఖాన్‌నో
ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మినో
కిశోర్ కుమార్‌నో
నువ్వు ఆస్వాదించే వేళ

బుజ్జిగాడి హోమ్‌వర్క్‌తోనో
మాసిన బట్టలతోనో
నేను కుస్తీ పడుతుంటాను

అయితే ఇలాంటి టాలెంట్ కంపెనీని విడిచిపెట్టినందుకు అజీజ్ ఎంతో సంతోషించాడు. తను ఒక్కడే ఉన్నప్పుడు అర్ధరాత్రిళ్ళు జిన్ తాగుతూ ‘దండగ మనుషులు’ అని అనుకునేవాడు వాళ్ళ గురించి. అతనికి సంబంధించినంతవరకూ ఏజన్సీ బెస్ట్ కాపీరైటర్, ఆపరేషన్స్ మాన్, ఆర్ట్ డైరక్టర్ అన్నీ తనే! ఫిల్టర్ కనుక అతనికి ఇష్టమయి ఉంటే, బహుశా ఓ ఉత్తమమైన కాఫీ బోయ్ అయ్యుండేవాడు.

క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేస్తాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొస్తారు.

శ్రీహర్షుడు కేవలం కవి మాత్రమే కాదు. గొప్ప శాస్త్రపండితుడు కూడా. అది నైషధంలో అడుగడుగునా కనబడుతుంది. అతని కావ్యంలో ధ్వని, శ్లేషాదుల్ని గ్రహించాలంటే పాఠకుడు కేవలం సాహిత్యంలోను, భాషలోను నిష్ణాతుడైతే చాలదు. అతని గ్రంథగ్రంథుల్ని విప్పాలంటే చాలా శాస్త్రవిషయాల్ని కూడా తెలిసినవాడై ఉండాలి. వాటిని మథించి సాధించే ప్రతిభగలవాడై ఉండాలి. ఒక్కొక్కసారి, శ్లోకాల సాధారణమైన అర్థం తెలుసుకోడానికే ఇతరశాస్త్రాల ప్రవేశం కావాలి.

1841 సంవత్సరం ఏప్రియలు 14వ తేదీన మదరాసు కాలేజి హాలులో మదరాసు యూనివర్‌సిటి ప్రారంభోత్సవము ఎల్‌ఫిన్‌స్టన్‌ప్రభువు అధ్యక్షతక్రింద జరిగెను. ఆసభకు 1500మంది పౌరులు వచ్చిరి. అంతమంది నేటివు ప్రజలు అదివరకెన్నడును ఏ సందర్భమునను చెన్నపట్టణమున సమావేశమై యుండలేదు. ఈ విద్యావిధానమును గూర్చి ప్రజలలో అంత యుత్సాహముండెనని కనపడెను.

ఏమీ తోచక
నా తల చుట్టూ చమ్కీరేకులు చుట్టుకుని
వంటి నిండా తళుకులు పూసుకుని
కాసేపు గంతులు వేస్తాను
వీళ్ళు దాన్ని నాట్యం అని చప్పట్లు కొడతారు
అర్ధరాత్రులు ఒంటరి క్రేంకారం విని ఉలిక్కిపడి నువ్వు నిద్రలేస్తావు

పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు
నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి.
గాజు తలుపులు, మెరుపు వెలుగులు
నిన్ను పరివేష్టించి ఉంటాయి.
ఇక్కడ ఆకలిదప్పులే కాదు,
నిద్ర కూడా నిన్ను పలకరించదు.
నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక
నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు.

ఆత్మనొక దివ్వెగా యే సౌందర్యం పాదాల చెంత ఉంచాలో వెదుక్కుంటూ వెళ్ళిన అన్వేషకుడి కథ, మూలా సుబ్రహ్మణ్యం నవల ఆత్మనొక దివ్వెగా; తెలుగు మాండలీకాల అందానికి అద్దం పట్టే కథలు ఎండపల్లి భారతి ఎదారి బ్రతుకులు; అమెరికా మ్యూజియంలలో ఏం చూడాలో తెలీనివారికి, కరదీపిక రొంపిచెర్ల భార్గవిగారి ఒక భార్గవి-రెండు ప్రయాణాలు.

మనకి రోజువారీ నలుపు తెలుపుల్లో కనిపించే విషయాలు అతనికి మాత్రం పంచరంగుల్లో కనపడి ఊరిస్తాయి. ఝల్లుమని ఒళ్ళంతా తడిపే వాన తనని లవ్వించమంటుంది, కర్రా-బిళ్ళా ఆటలో పైకెగిసిన కర్రముక్క రెక్కలు విప్పుకున్న రంగురంగుల పిట్టలా మారి రా రమ్మని పిలుస్తుంటుంది. కుదిరిన బొమ్మలే కాదు, కుదరని బొమ్మలు కూడా తమ వెనకున్న వ్యథల కథలు చెబుతాయి.

సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్ళకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.