తాను కలుసుకున్న ప్రముఖులతో సంభాషించేటప్పుడతను ఎంతో నేర్పుగా వారిని ఉబ్బవేశాడు. అతను గవర్నరుగారితో మాట్లాడేటప్పుడు, మాటల సందర్బాన అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయాణిస్తుంటే స్వర్గంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నదనీ, ఎక్కడ చూసినా రోడ్లు పట్టుపరిచినట్టుగా ఉన్నాయని, సమర్థులైన పాలకులను నియోగించిన ప్రభుత్వం ప్రశంసనీయమైనదనీ అన్నాడు.
ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు “లెటర్స్ టు ఎయంగ్ పోయెట్” అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య చరిత్రకి ఎక్కించాయి.
జింకల కళ్ళూ వాగుల నీళ్ళూ ఊళ్ళో అమ్మించి
రాళ్ళకి పువ్వుల రంగులు వేయించి
పైకం గుళ్ళో పంచుకు తిన్నాము.
గుమ్మం ముందు
ఉదయించిన వార్తలూ –
వరండాలో కాఫీ చప్పరిస్తున్న
వార్తాపత్రికలూ –
ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?
“హహ్హహ్హ, నైస్ జోక్, వెరీ నైస్” అన్నాను నేనూ నవ్వు కలుపుతూ, రాధిక కేసి కన్ను గీటుతూ. దాంతో ఆమె కూడ నాతో నవ్వు కలిపింది. ముగ్గురం అలా కాసేపు పగలబడి నవ్వుకున్నాం. ఫేమిలీ వేల్యూస్ అంటే మా ఫేమిలీ అంతా పడిచస్తాం మరి!
నాన్నగారూ! మీకెప్పటి నించో చెబుదామనుకుంటున్నాను. చాలా కాలం నించీ నాకు దేముడి విషయాల మీద నమ్మకం పోయింది. ఆ కార్యక్రమాలు నేను ఇక చెయ్యలేను.
అట్లా స్వచ్చమైన నీళ్ళలోకి ఫిషింగ్ లైను బెయిట్తో వేసి ఇక ప్రపంచంతో పనిలేనట్టు ఇంకా బయటకు రాని సూర్యునికోసం ఎదురుచూడ్డమంటే మా ఇద్దరికీ మరీ ఇష్టం.
“కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?” అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం.
ఆడ వాళ్ళు కొన్ని చదవకూడదు, కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? గుడి లో ఇంత వరకే వెళ్ళచ్చు దాటి లోపలకి వెళ్ళకూడదు. ఎందుకు? పూజారి అవటానికి అర్హులు కారు… ఎందుకు? అని అడిగితే ఇచ్చే జవాబుల్లో మొదటిలో కాని, చివరిలో కాని, మొత్తానికి ఒకే విషయం వచ్చేది: “ముట్టు.”
దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలుస్తుందికాని ఈమని శంకరశాస్త్రి అంటే తెలియకపోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే.
ఇలా ఏ దృక్కోణంలో చూసినా జీవశాస్త్రం ఇరవయ్యొకటవ శతాబ్దాన్ని ఏలెస్తుందనడంలో సందేహం లేదు.
ఈ సన్నివేశం చిత్రించాలంటే, ఒక్కసారిగా కథనం భరతుడి నుంచి రాముడి వద్దకు మారాలి. ఈ మార్పు పాదూఖండంలోని కథాప్రవాహాన్ని(flow ని) భగ్నం చేస్తుంది. ఈ సమస్యని విశ్వనాథ ఎలా పరిష్కరిస్తాడా …
ఆమె దురదృష్టమో ఏమో కాని, స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ చదవరు. చదివించరు. వ్యాసభారతంలో ఒకే ఒక్క శ్లోకం మినహా ఇంకేవీ ఎక్కడా ఉదహరించరు.
సాహిత్యానువాదాల నాణ్యతని తూచడానికి సరైన పడికట్టు రాళ్ళు లేవు. దీనికి కారణం సాహిత్యానువాదాన్ని గురించిన సిద్ధాంతం లేకపోవడమే.
పైపై పూతను కాను
పసరు పూపను కాను.
“రాలిపోయే కండకు మల్టీనేషనల్ అత్తరు సోకులు జేసే ఓ గ్లోబల్ రాబందూ,
ఎముకను ప్రేమించే నేను, నేనే నేనైన నేను, నేనిక స్నానం చేయను”
“టూ వీలర్ కాలుష్యంతో బిరుసెక్కిన నా కళ్ళతో
నీ రక్తమాన్దిరాక్స్ తాగడానికే నేను రక్తనేత్రుడనైనాను”
అని కవి ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలు సమాజాన్ని పీడిస్తున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దుష్టశక్తులపైకి దూసుకొస్తున్న కవితా సునామీలు!
తెలుగు భాష వేదాల కన్నా పాతదని, మనిషి పుట్టుకకు పూర్వమే పుట్టిందని వికారమైన వాదాలు మొదలయ్యాయి. “శ్రీకృష్ణుడు తెలుగువాడే,” అన్నవాదం నుంచి “అస్సిరియా నుండి ఆస్ట్రేలియా దాకా తెలుగే మాట్లాడేవారట” అనేటంత వెర్రి వాదాలు కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి.
కవిత్వం గురించి చెబుతూ ఎజ్రా పౌండ్ “భావ ప్రకటనకి పనికిరాని ఒక్క పదాన్నైనా సహించకూడదన్నారు.”. ఆ లక్షణాన్ని పవన్ బహు చక్కగా పుణికిపుచ్చుకున్నారు.