సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు

1. నీ పేరు – Your Name (తుమొ నాఁ)

నీ పేరు నేను ఎప్పుడు విన్నా
అవే! ఆ మూడే అక్షరాలు
మనసు నొప్పిస్తుంది అసూయతో.
మూడే మూడు సూటి పూల బాణాలు
ఆ బాణాల గాయాలు నా మనో ఘాతాలు
నా మది చిన్నా భిన్నం
క్రింద భువిపై పడింది రక్తం
పడిన రక్తం మొత్తం
పూలై వికసించింది.
ఆ పూలరేకుల తళతళలో
తిరిగి చూస్తాను నీ పేరు
నా మనః ప్రాంగణంలో
మండిపోయే యాగాగ్ని!

Whenever I hear your name
Always those three characters,
Three sharp flower-arrows only
My mind grieves with envy.
My heart writhes with pain
The wounds mangle my mind
It’s all blood on the land
And then flowers blossom.
On a few shiny blue petals
Inscribed I see again
Your name.
At my mind’s threshold again
Flames of Sacrificial Fire burning!

2. కళ్ళు – Eyes (ఆఖీ)

నాట్యం చేస్తూ ఒళ్ళు తెలియని
తన్మయత్వంతో చేతులూపుతూ
మైదానంలో చాకుండా చెట్లలా
ఆమె కళ్ళు, చపలంగా గాలిలో.

చిన్న చిన్న ఆకుల అరచేతుల్లో
చందమామ ఇండియన్ బాల్సమ్ బొమ్మ
పిట్టలన్నీ శూన్యంలో మిలమిలా
మెరుస్తూ చక్కర్లు కొడుతున్నాయి గిర గిరా
మెత్తటి పాటలు కుంచెడు కుంచెడు
అల్లి ఇస్తున్నాయి తియ్యతియ్యగా.

అలా ఉండగా, దూరంగా ఈ వరండాలో నేను,
దీనంగా తెల్లటి గోడ చేసే ఆర్తనాదం.
నా ఆకాశంలో నక్షత్రాలనుంచి
ఒక్క కన్నీటి చుక్కైనా జారి పడలేదు.
రెండు చిన్న పడవల్లా
ఆ కళ్ళు కాలం అలలో ఎగిరి రాగలిగితే
నా దిగంత దృష్టితో స్పృశిస్తాను
ఆరిపోయిన అన్ని దీపాలూ
వెతికి వెలిగించి కూచుంటాను.
నిస్త్రాణుడనై,
ఈ ఎర్రటి రాగిరంగు నేల వేడి,వాసనలతో,
దుమ్ము పట్టిన నా గుండె వణుకుతూ.

Tall pines in the plains
sway in the wind,
like the arms of rapt danseuse
her fickle eyes waver.

In the palms of tiny raw leaves
moon’s image reflects hues of Indian
balsam. And, these tiny birds twinkling
go round and round in vacuum
weaving bunches and bunches
of sweet tender tunes.

And, here I am far away perched on front
porch, pitiful white wall weeping.
And, stars above in my sky didn’t shed
a single tear.
Like two little dories, if those lilting eyes
come flying on waves of time
I caress them with my sight on the horizon.
Light up all the lamps
and, wait.
Helpless, as the heat, the smell
from this red bronze earth
make my dusty chest trembling.

3. అవ్యయ – Eternal (అవ్యయ)

నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి
బయలుదేరావో ఏడణాలిచ్చి రిక్షా ఎక్కి
అకస్మాత్తుగా సముద్రపు వడ్డుకు,
నీకు తెలిసిందా నేను హఠాత్తుగా
చనిపోతానని నేను ఇక ఇక్కడ ఉండనని,
నాతో పాటు నువ్వు రొట్టె తినటానికి.

మనం ఇద్దరం మౌనంగా కూచున్నాం
ఏతా వాతా కబుర్లు చెప్పుకుంటున్నాము
ప్రక్కనే అలలు నిర్విరామంగా గంటలు
కొడుతున్నాయి. వెలిసిపోతున్న వెన్నెలలో
నేను చూశాను నా రక్తమాంసాలు
పాముకుబుసంలా జారి
ఇసుకలోనో, సముద్రం నీళ్ళలోనో పడటం.

నువ్వు తరువాత వంటరిగా వెళ్ళిపోయావు
తలుపు తాళం తీశావు స్విచ్‌ వేసి చూశావు
కుర్చీలోకూచొనివున్నది నా ప్రేతాత్మ
నిన్ను ప్రక్కకు పిలిచి చెప్పింది
“మూసెయ్యి ఆ దర్వాజా నాది,” అని.
చూడు నా ఎముకలలో బాధ;
చూడు నా మండే పుర్రె.

నేను ఎన్నిసార్లు రాశానో నా పేరు
సముద్రపొడ్డున ఇసుకలో
నేను చెప్పాను, నామనసు పాటలమయం
నీలిరంగు సరివి తోట.
ఆఫీస్‌ కుర్చీలో కూచొని లెక్కపెట్టాను
నా జీతపు రాళ్ళు
మృత్యువుకి, స్వర్గలోక జన్మకీ
నేను కారణాలు వెతికాను.

ఉదయం హఠాత్తుగా చూశావు నువ్వు
పళ్ళు తోముకుంటున్న నన్ను
న్యూస్‌ పేపర్‌ లో చదువుతున్నాను
నా చావు కబురు. నేను అంటున్నాను,
“నువ్వు ఎంత అందంగా ఉన్నావు?
ఇవాళ ఆదివారం,కదూ!” అని!
నా జేబులో మిగిలి ఉన్నాయి గుప్పెడు గవ్వలు
దూరంగా మిగిలిన నీలి సముద్రజలస్మృతులు.

Spent a little change for the rickshaw ride
suddenly came to the sea side
spend time with me in pleasure walk.
Did you know,
that I would suddenly die,
wouldn’t be alive to break bread with you?

We silently sat and, had a chat.
Nearby, unending waves ringing bells.
In the fading moon light
I saw my flesh and blood slip away
into waters and sands
like a snake shedding its skin.

You went away all alone to my home,
unlocked the door, turned on the switch
found my dead soul lounge in the chair.
Called you aside, and told,
“Close that door, It’s mine.”
Look at the pain in my bones.
Ouch! Look at the burning cranium.

How many times my name I wrote
on the sands at the sea shore.
My heart fills songs galore
In the blue pine garden, I told.
Sat in the office chair, counted
my paltry wages,
Sought for all the reasons for death,
and for birth in the heavens.

At daybreak, suddenly you saw
me brushing my teeth,
me reading my obituary in the newspapers, today.
I said, “You look so beautiful, today
and, today, you know, it’s Sunday.”
Searched my trouser pockets.
Found fistful of shells gathered
from the sea,
distant deep memories of the blue sea.

(డా. సౌభాగ్య కుమార మిశ్ర అగ్రగణ్యులైన ఒరియా కవులలో ఒకరు, పదికి పైగా కవితాసంకలనాలను వెలువరించారు. మధ్యపదలోపి, నైపహర్న, అంధా మహుమాచ్చీ, బజరంజన్, ద్వా సుపర్ణ, మణికర్ణిక, అన్యత్ర, చర్చర అందులో కొన్ని. ఒరియా సాహిత్య అకాడెమీ అవార్డ్ (1978), కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ (1986) వీరు అందుకున్న పురస్కారాలలో ముఖ్యమైనవి. ప్రస్తుత నివాసం భుబనేశ్వర్. పైన ప్రచురించిన తెలుగు-ఇంగ్లీషు అనుసృజనలకు ఒరియా మూలాలు మిశ్ర ప్రథమ సంకలనం ఆత్మనేపదీ (1965) నుండి తీసుకోబడ్డాయి. పై కవితలు త్వరలో ప్రచురింపబడబోతున్న సౌభాగ్య కుమార మిశ్ర కవితల ద్విభాషా (తెలుగు-ఒరియా) అనువాద సంకలనంలోనివి.)