రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అక్కమహాదేవి వచనాలు – 6

రచన: సురేశ్ కొలిచాల
మూలం: అక్కమహాదేవి
జూన్ 2025

తరువుండి ఫలమేమి?

తరువుండి ఫలమేమి నీడనీయకనున్న?
ధనముండి ఫలమేమి దయజూపకున్న?
పశువుండి ఫలమేమి పాడినీయకున్న?
చెలువుండి ఫలమేమి గుణములేకున్న?
తబుకుండి ఫలమేమి తిండి లేకున్న?
నేనుండి ఫలమేమి చెన్నమల్లికార్జున
నీవున్న జ్ఞానమే నాకు లేకున్న?

కన్నడ మూలం:
మరవిద్దు ఫలవేను నెళలిల్లదన్నక్క?
ధనవిద్దు ఫలవేను దయవిల్లదన్నక్క?
హసువిద్దు ఫలవేను హయనిల్లదన్నక్క?
రూపిద్దు ఫలవేను గుణవిల్లదన్నక్క?
అగలిద్దు ఫలవేను బానవిల్లదన్నక్క?
నానిద్దు ఫలవేను నిమ్మ జ్ఞానవిల్లదన్నక్క
చెన్నమల్లికార్జునా.
(325)

కంటికి సింగారము

కంటికి సింగారము గురు జంగముల జూచుటే
చెవులకు సింగారము సంకీర్తనలు వినుటే
పలుకులకు సింగారము సత్యమును పలుకుటే
సంభాషణకు గారము సద్భక్తుల నుడువులే
చేతులకు సింగారము సత్పాత్రదానమే
జీవికి సింగారము గణయోగజీవనమే
ఇవి లేని జీవికి బ్రతుకేమి బ్రతుకయ్య
చెన్నమల్లికార్జునయ్య?

కన్నడ మూలం:
కణ్గె శృంగార గురుహిరియర నోడువుదు.
కర్ణక్కె శృంగార పురాతనర సుగీతంగళ కేళువుదు.
వచనక్కె శృంగార సత్యవ నుడివుదు.
సంభాషణెగె శృంగార సద్భక్తర నుడిగడణ.
కరక్కె శృంగార సత్పాత్రక్కీవుదు.
జీవిసువ జీవనక్కె శృంగార గణమేళాప
ఇవిల్లద జీవియ బాళువె
ఏతక్కె బాతెయయ్యా చెన్నమల్లికార్జునా.(138)

లింగమున ఉదయించి …

లింగమున ఉదయించి అంగదేహముదాల్చు
జంగముల ఇంగితము ఏమందునయ్యా?
వారి నడతలే ఆగమము నుడువులే వేదములు
సామాన్య మానవులు కారు కానేకారు వారయ్యా!
‘వృక్షాద్భవంతి బీజాని హి తద్‍వృక్షే లీయతే పునః
రుద్రలోకం పరిత్యక్త్వా శివలోకే భవిష్యతి’
బీజమే వృక్షమై పెరిగి పెరిగీ మరల
ఆ వృక్షమై చిన్ని బీజమైనట్టుగా
లింగమందుదయించి లింగమందైక్యమై
పురాతనులుగ వెలుగు జంగముల సంగమును చూడరయ్యా!
అట్టి పురాతనులను బట్టి వారి శరణునే చేపట్టి
పుట్టుకనే గిట్టింతునయ్యా, చెన్నమల్లికార్జునయ్యా!

కన్నడ మూలం:
లింగదిందుదయిసి అంగవిడిదిప్ప పురాతనర
ఇంగితవనేనెందు బెసగొంబిరయ్యా?
అవర నడెయే ఆగమ, అవర నుడియే వేద;
అవర లోకదమానవరెందెన్నబహుదె అయ్యా?*
అదెంతెందడె, సాక్షి:
వృక్షద్భవతి బీజాని హి తద్‍వృక్షే లీయతే పునః।
రుద్రలోకం పరిత్యక్త్వా శివలోకే భవిష్యతి॥
ఎందుదాగి,
అంకోలెయ బీజదిందాయిత్తు వృక్షవు
ఆ వృక్ష మరళి ఆ బీజదొళడగిత్తు.
ఆ ప్రకారదల్లి లింగదొళగింద పురాతనరుద్భవిసి,
మరళి ఆ పురాతనరు ఆ లింగదొళగె
బెరసిదరు నోడిరయ్యా.
ఇంతప్ప పురాతనరిగె
నాను శరణెందు హుట్టుగెట్టెనయ్యా
చెన్నమల్లికార్జునా.
(349)

ఒక్కసారి చూపించుమా?

తనువు శుద్ధమై మనసు శుద్ధమై
భావశుద్ధులైన వారు నీదు శరణులు
వారినొక్కసారి నాకు చూపించుమా?
నడకలన్ని సదాచారమై
నుడువులన్ని శివాగమములై
నిత్యశుద్ధులైన వారు నీదు శరణులు
వారినొక్కసారి నాకు చూపించుమా?
కారుచీకటిని మెట్టి తళతళగా మెరిసి
వెలికి లోనికొక్కటై వెలయు నీదు శరణులను
చూపించవయ్యా చెన్నమల్లికార్జునయ్యా!

కన్నడ మూలం:
తనుశుద్ధ మనశుద్ధ భావశుద్ధ-
వాదవరనెనగొమ్మె తోరా?
నడెయెల్ల సదాచార; నుడియెల్ల శివాగమ;
నిత్యశుద్ధరాదవరనెనగొమ్మె తోరా?
కత్తలెయ మెట్తి తళవెళగాగి
హొరగొళగొందాగి నింద
నిమ్మ శరణరనెనగొమ్మె తోరా
చెన్నమల్లికార్జునా.
(222)

నీ శరణుల రాకకై …

అయ్యా, నీ శరణుల రాకకై
గుడి తోరణములనే కట్టెదనయ్యా!
అయ్యా, నీ శరణల రాకకై
భుజమున పల్లకినే మోసెదనయ్యా!
చూడవయ్య చెన్నమల్లికార్జునా!
మాయింటికి నీ శరణుల రావించి
వారి శ్రీపాదములనే
నాదు హృదయమందు అదుముకొందునయ్యా!

కన్నడ మూలం:
అయ్యా నిమ్మ శరణర బరవింగె
గుడి తోరణవ కట్టువె.
అయ్యా నిమ్మ శరణర బరవింగె
ముడుహినల్లి పట్టవ కట్టువె.
అయ్యా నిమ్మ శరణరెన్న మనెగె బందడె,
అవర శ్రీపాదవనెన్న హృదయదల్లి బగెదిట్టుకొంబె,
కాణా చెన్నమల్లికార్జునా.
(29)
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • సీతాంజనేయ సంభాషణం – II
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1
  • అక్కమహాదేవి వచనాలు – 6
  • అక్కమహాదేవి వచనాలు – 3
  • పలుకుబడి: దిక్కులు, పక్కలు

ఇటువంటివే…

  1. అక్కమహాదేవి వచనాలు – 2
  2. అక్కమహాదేవి వచనాలు – 4
  3. అక్కమహాదేవి వచనాలు – 3
  4. అక్కమహాదేవి వచనాలు – 5
  5. అక్కమహాదేవి వచనాలు – 1

జూన్ 2025 సంచికలో ...

  • Colonial Park
  • అక్కమహాదేవి వచనాలు – 6
  • అనువాద ప్రస్థానం
  • ఊరట
  • ఎండ్‌లెస్
  • కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు
  • కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్
  • చలం గురించి…
  • చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ
  • చలం సాహిత్యం-విముక్తి
  • జూన్ 2025
  • దర్శనము
  • దేశీయ భాషల భావిగతి
  • నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము
  • పంచేంద్రియాలు: 4 రుచి
  • పదప్రవాళం
  • పునః
  • పున్నమ
  • పుస్తక సమీక్ష: గ్రామీణజీవితపు బాల్యజ్ఞాపకాల చిత్రణ
  • పుస్తక సమీక్ష: బంగారు తండ్రి
  • ప్రవాసంలో టిబెట్ ప్రతిఘటన
  • మౌనంబంతట మాటలాడె… (3వ భాగం)
  • యూట్యూబ్‍లో ఈమాట: మే 2025
  • లీల … కేదార్‌నాథ్ డైరీ
  • షాంగ్రి-లా – 2
  • హిందూ మతం అంటే ఏమిటి?
  • ౙాబిలి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

దేశీయ భాషల భావిగతి
పున్నమ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.