గుర్తు పెట్టుకుంటావని
మొట్టికాయలు మొట్టేను
అంతకంటే ఏం లేదు!
రచయిత వివరాలు
పూర్తిపేరు: కనకప్రసాద్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
కనకప్రసాద్ రచనలు
హృదయ కమలములను ముకుళించి రహించిన పూజ
మీ పద సరోజములను నయన పంకజము లలర్చి రమణ యతి రాజ
గాలి సావిట్లోకొస్తే
ఎవరు చూడొచ్చేరు?
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.
శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.
పరుల తప్పులెంచును నటించును
బిగిసి అయ్యవారై చరించును
విసిగి వెసనకాడై కృశించును
వెదకి చితికితే ఒదవా ఏమి?
ఇద్దరు లేరని చూపి
ఇరులొరలను దయపడు బట్టికాడు
అరుణగిరి శుకము వీడు
అరుణగిరి శుకము వీడు
నిదుర విడిన మొదలు
చిదురులు పది వేలు
నిలుకడ మూగ వలె
నిలచిన మన్నారు
ఎక్కడెక్కడ తిరిగేవు నాయినా బిడ్డా సిపాయి చిన్న
ఎండనపడి వొచ్చేవు నాయినా నా కన్న?
కోనాడ అడివుల్లంట యేటకెల్లేనులేయే మాయమ్మ
పేనాలు పోతన్నాయి పక్కన్న పరిసిత్తు రమ్మీ!
ప్రపంచంలోని నూటా తొంభయ్యారు దేశాల్లోన ఒక్క పాతిక దేశాలే బాగా డబ్బున్న దేశాలు. గొప్ప దేశాల్లోన గొప్ప సంస్థలు, వ్యవస్థలూ ఉంటాయి. తమ తమ ఇష్టాలు, ఆశలు, కష్టం సుఖం ప్రకారం వాటిలో చేరి జనం తమ బుర్రల్ని, బతుకుల్ని ఓదార్చుకుంటారు; తమ సంఘాల్నీ, దేశాల్నీ బావు చేసుకుంటారు. ఇలాంటి వ్యవస్థలు లేనివి, ఉన్నా ఖరాబు చేసుకుని ధ్వంసం చేసుకున్నవీ బీద దేశాలుగా మిగిలిపోతాయి.
అనీ వినీ అలసితే అనా హతం
శివం శివం శివం
పదే పదే వెదికి ఆగితే
అహర్దివం శివం శివం
స్వరార్చనం కల
రాగ సుధా రసార్ణవం
చెన్నారెడు చెవి తేనియలై కీర్తనలూ
అనశ్వరం
అకారము మొదలు అక్షర మాలకు
ఆది ఆకసము మొదలు అఖిల జగతికిని
పెనవి పెను కడలి నీదను వశమా
ఒళ్ళూ పయి తెలీకుండా
నెల్ల పిల్లడి లాగగాలాడని సాయంకాలం
గంగసాగరం లాగఎర్రటి కన్ను ఆర్పకుండా
దివ్వసోడి లాగ
పొద్దుట లేచిన మొదలుకొని
నిద్దుర వరకూ నెగులుకొని
అద్దువ చూపుకు ఒద్దిక చూపే
అణకువనైతే కానవుగా?!
ఆరున్నరైపోవొచ్చింది
స్నానాల దగ్గిరా జట్టీలు?
నాన్న విన్నారంటే తంతారు!
కాఫీ టిఫినూ ఏవండీ ఇవుగోటి
ఫేంటూ లాల్చీ మంచమ్మీద పెట్టేను
కేరేజీ చురుకుతుంది జాగర్త!
అమ్మా కనకమ్మా
అది ఏమని అనకమ్మా
దిన దినము ఒక తెరుపమ్మా
అమ్మా కనకమ్మా
సంగీతం, గానం: నచికేత యక్కుండి
స్ఫూర్తి: రవీంద్ర సంగీతం నుండి అగునేర్ పొరోష్మొని అనే గీతం.
రాగం: శుభపంతు వరాళి
తాళం: మిశ్ర చాపు
సంగీతం, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
ఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంట
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుంచి ‘అలబేలా సజన్ ఆయో రీ’ అనే గీతం ఆధారంగా. ఈ గీతాన్ని సృజించినది మొగల్ చక్రవర్తి రోషన్ అఖ్తర్ (మొహమ్మద్ షా) ఆస్థానంలో భూపత్‌ఖాన్ అనే విద్వాంసుడని, ఆయన కలం పేరు ‘మనరంగ్’ అనీ చరిత్ర.
త్రిపుర ఏనాడూ పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇలాక్కాదు అలాగ! ఆని నొక్కి చెప్పడం చూళ్ళేదు నేను. అవేళ మాత్రం మాకిద్దరికీ ఒక టకాఫోర్ వచ్చింది. మాటల్లోన బాలగోపాల్ గారి ప్రసక్తి వచ్చింది. నేను ఆయన “సాహిత్యం జీవితంలో ఖాళీల్ని పూరించాలి” అని అన్నారని అభ్యంతరం చెపుతున్నాను.
దిగులు దిగులుగా ఆ డప్పులేమిటి దేవీ దిగువ లోవలదరా చప్పుళ్ళు చప్పుళ్ళు? దేవిడీ సిపాయిల దండేను ప్రభూ దినామూ ఉన్నదే కవాతు జిగ్గుజిగ్గుమనే ఆ […]
అట్నుంచి హోరు
ఇట్నుంచి జల్లు
ఉరుముతున్నాది
ఎడ తెగని వాన.
అడుగులో అడుగు
తడిసిపోకుండా.
ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం – లేదూ ఏది దొరికితే అదీ తింటాము.
మాటైన మాటాడు
పలుకైన పలుకవే
చిలుక ముద్దుల కొలికిరో చెల్లెలా
కవితలో, మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని చాల శ్రద్ధతో, సృజనలోని దృశ్య, పద చిత్రాలు, మాటల ఎంపిక, వాటి కూర్పు, స్థానాల్ని గురించీ వివేకంతో వందలాదిగా నిర్ణయాలను తీసుకొని చేసేది. అందుకే ‘కవి పగలల్లా కూర్చుని ఒక కామా ఎక్కడ ఉంచాలో స్థిరంగా ఒక నిశ్చయానికొచ్చేడు,’ లాంటి పరాచికాలున్నాయి.
గానం – పేరి పద్మావతి; రాగమాలిక – మాయామాళవ గౌళ, పీలూ, నాద నామక్రియ, మధువంతి, కళ్యాణ వసంతం, శుభ పంతువరాళి, మాయామాళవ గౌళ.
గానం: చిదంబరం కవస్సెరి. రాగమాలిక – మాయామాళవ గౌళ, సింధు భైరవి, చక్రవాకం, శుభ పంతువరాళి, మాయా మాళవగౌళ.
నా తోవంట నాకు
ఎటూ తోచని తనాలు
ఎవరైనా మనుషులో, సమాజాలో కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళలోని ‘లోపాల్ని’ తప్పనిసరై ఎత్తి చూపించవలసినప్పుడు కూడా ఆ పనిలో సానుభూతి, కరుణ కనిపిస్తాయి. సృజనాత్మకమైన పని – అంటే కళ నిర్వహణ, అభివ్యక్తి ఎంత కష్టతరమో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోగలిగితే అది ఒకరకమైన వందనానికి, కరుణకు దారితీస్తుంది.
రోజాలకు నిజంగా పెరగాలనే ఉందేమో,
కన్ను కలకాలం కనిపిద్దామనే అనుకుందేమో,
ఏమో ఋతువులు చావని దేశం ఒకటి ఉందేమో,
మన పద్ధతిలోన తర్క మీమాంసకి న్యాయ, వైశేషికాలని పేరు. మన తార్కికులు వితండము, జల్పము, వాదకధ అని తర్క వాదనని మూడు రకాలుగా ప్రతిపాదించేరు. వితండమంటే ప్రతివాదిని ఏదో ఒకలాగ, వెక్కిరింత, తిట్లతో సహా ఎలాంటి పద్ధతుల్నైనా వాడుకొని ఓడించి, నోరు మూయించే పద్ధతి.
ఆగమ ఘోషమా ఆగమాగమా?
పాముపై పడకా గారఁడీని కఱుదా
సోమరికి సొమ్ములిడి స్వామియని బిఱుదా?
స్పష్టమైన తర్కం, పద్ధతీ ఏర్పడి ఉన్న లౌక్యపు వ్యవహారాలకు నాయకత్వం వహించటమే ఇంత కష్టమైతే, శిధిలావస్థలో ఉన్న కాల్పనిక సృజన ఆవిష్కరణను నిర్వహించటం, అంటే సాంస్కృతిక నాయకత్వం వహించటం ఇంకెంత కష్టతరమైన పని అయిఉంటుంది?
మానలేని అలవాటో మానినీ కల్లోలినీ
కానలేవు లోఁకంట విలోలినీ
ఆనవాలు కనలేవు విలోలినీ
కానలేవు లోకన్ను…
అటునొక చూపూ ఇటునొక చూపూ
అడఁగారదు ఈ తగులాట
అదియొక తీరూ ఇదియొక తీరూ
ముదిగారము నీ తలపోత
సృజన అనుభవంలో, అభిరుచిలో కేవలం ఇతరుల మెప్పు మీదే ఆధారపడని ఏ తోవ తమదో స్థిరంగా అనుభవం లోకి రాక, కవిలోనూ పాఠకునిలోనూ కూడా అపరిపక్వమైన అభిరుచే మంకుతనం, మేకపోతు గాంభీర్యంగా, లేదంటే పరస్పరం పెట్టుడు సామరస్యం, సుహృద్భావంగా వ్యక్తమౌతాయి.
కవి, రచయిత త్రిపుర పుట్టిన రోజు సెప్టెంబర్ రెండుట. మన కనకప్రసాదు మిన్నకుంటాడేటి! ఒక కవితా రాసీడు, ఒక చిన్న స్కెచ్చీ గీసీడు, త్రిపుర పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెప్పడానికి…
గుంట్నాకొల్లందరు అవి తినీసి రొబోలకెల్తామనుకుంట్నారు గావాలని, ఐస్క్రీములన్ని కారు బైటే తిని, చేతులు మూతులు కాయితాల్తోటి తుడుసుకున్నాక సెప్పీనాది సావుకబురు చల్లగాన. ‘టిక్కట్లైపోయ్యంటఱ్ఱా పిల్లలూ! ఇంకెప్పుడైనా చూడొచ్చులే రోబో, సరేనా?’ అనీసి.
చెదరి పడే ముంగురులలరిచి పోరా
చేతుల గోరింట తడియారదూ
చెదరి పడే ముంగురులలరిచి పోరా.
తన దృష్టికి వచ్చిన ప్రతి రచననూ, రచయితనూ ఇది మంచిది, అది మంచిది కాదు, ఈ సృజనకి నావి ఇన్ని మార్కులు! అని నిర్ణయించి తీరాలన్న నమ్మకం. చర్చకు వచ్చిన అన్ని విషయాల మీదా, తనకూ చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా ఇదమిద్ధం అని స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తీరాలన్న ఊహ.
నేను, నాకు నచ్చినవే నచ్చుకునే కవులు కొందరం తరచు కలుసుకొంటూ, మేం రాసినవి ఒకళ్ళవొకళ్ళం మెచ్చుకుంటూ, మాకు నచ్చనివాళ్ళని, వాళ్ళ సృజనల్నీ వేళాకోళం చెయ్యటం – సాయంత్రాలు ఇలా గడిపేవాళ్ళం. ఈ గుంపులోనే మళ్ళీ అక్కడ ఎదుట లేనివాళ్ళని చాటుగా వేళాకోళం చేసుకోవటమూ ఉండేది.
ఆధునిక సమాజాల్లోన ప్రాధమిక అవసరాలు దాదాపుగా అందరికీ తీరుతున్నాయి. కాని, సాంఘిక అసమానతలు ఇదివరకటిలాగే ఉన్నాయి. వివక్షకు, పీడనకు గురయ్యే వర్గాల్లోన సృజనశీలురైన వాళ్ళందరికీ ఈ స్పృహ, వేదన ఉండితీరుతాయి. ఆ కష్టం ఏమిటో అనుభవించనివాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ.
చేపిన పొదుగే లేగకు చక్కెర తీపైనట్లు
ఓపిన యమ్మకు నెమ్మది తేట నీరు దిగినట్లు
అలల కొలని జలలు అట్టె తళ తళ లాపినయట్లు
కళ, సారస్వతం వంటి వెసులుబాటు లేని రంగాల్లోన ఎవరైనా అంత ఓపిగ్గా పరిశ్రమ ఎందుకు చేస్తారు? వాళ్ళ మనస్తత్వానికి అది తప్పనిసరి అయితేనే కదా! కేవలం తెలివితేటలూ, స్వయంప్రతిభ తోటే గొప్ప ఫలితాల్ని సాధిస్తామనుకొనే వాళ్ళ విశ్వాసాలు, న్యూనతల్ని గురించి ‘రామానుజన్ సిండ్రోం’ అని ఒక కధ ఉన్నాది. ఆ కధ విని నాకు ఎక్కడో ‘చురుక్కు’మని గుచ్చుకుంది. ఇలాగని బిపిన్‌తో అంటే నవ్వీసి ఊరుకున్నాడు.
సృజనశీలి యంత్రం కాదు. కాని అతని అంతరంగంలో ఒక కంప్యూటరు వంటి మెదడు, ఆ పైన ఒక ఆదిమ వానరం అనదగిన జాంతవ ప్రకృతి, ఆ పైన నాగరికుడు, మర్యాదస్తుడు, సంస్కారి అనదగిన ఒక మనిషి – వీళ్ళు ముగ్గురూ ఉన్నారు.
ఇల్లు విడిచి పోతావా రమణా?
అన్ని తెలిసి ఇన్ని కలిగి
ఇల్లిల్లు తిరిగి ఉంఛమెత్తి
గుళ్ళవెంట పోతావా తగునా?
నేలబారు గద్ద
నిడుపు సూపు నేను
నేలమీద లేను
ధూళి రేగుతాను.
హృద్యోతిత దీపా
విద్యాగమ విదురా
మాధ్యమికా చతురా
మనం ఏదైనా కాల్పనిక సాహిత్యాన్ని, అంటే కధ, కవిత వంటిదాన్ని చదివేటప్పుడు, ఎలా చదువుతున్నాము, ఎలా స్ఫురణకు తెచ్చుకుంటున్నాము, అర్ధం చేసుకుని ఆస్వాదిస్తున్నాము?
నీ తొలి తలపుల జాడలలో
మాయని వలపుల చాయలివి
ఏ నడలో ఏ ఎడలో!
తీయని ఆ కధలేవి ప్రియా?
చలచ్చంచల వాంఛా పరికలిత డోలా ప్రహేల
ఆశా విశల మోహా విరళ దాహాతివేల
పరితాప శీల దీప ఖేల
వొయసులో జేబీల డబ్బులాడిన్నాడు
పద్దు లెక్కించుకుని పదిలముగ వున్నాను.
దసరాకి కుర్రోలు దండుకున్నట్టుగ –
నడమంత్రం కురుపంటె ఇలాగే కావాల.
నీళ్ళేవు నిప్పుల్లేవు ఎల్లండెల్లండి!
ఎర్రటెండల్లంట
మీకెవుల్రమ్మన్నారు?
దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!
సృజన ఎక్కడ్నుంచి పుట్టిందనేది ఎలాగయితే ఒక అంతుచిక్కని విషయమో, సృజించేది ఎవరు అనేది కూడా అంతే నిగూఢమైన సంగతి. రాస్తున్నది ఎవరు?
ఈ మాటనే నేను బలంగా నమ్ముతున్నాను. మేధస్సు కాల్పనిక సాహిత్యానికి అడ్డు అని, అనవసరంగా సృజనలో తలదూర్చి పానకంలో పుడకలాగ బాధిస్తుందనీ నాకు అనిపిస్తుంది.
అంతెందుకు గాలీ వానా వొస్తే
ఉంటుందని హామీ ఏమీ లేదు –
కాని ఇది నీ ఇల్లు.
గులక రాళ్ళని తట్టి ఏనాటి ఊసులో తలబోసి
దిగులుపడి వెనుదిరిగిపోతోంది నది
నీటిగాలికి పులకించిపోతోంది నియమగిరి
రెప రెపల రేయింక అలసి నిల్చుంది.
అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.
చూరింట్లో నీరెండ
వాకట్లో నెలవంక.
సూర్యుడు మా అన్నయ్య
జాబిలి మా చెల్లి.
హంసానంది నవ్వులాట కాదు. హంసానంది నదులకు ఎవరూ ‘గోదావరి’ అని పేరైనా పెట్టక మునుపంత పురాతనమైన దు:ఖం. స్వఛ్ఛమైన పశ్చాత్తాపపు నొప్పి. నొప్పి బహుశ: అందరికీ ఉంటుందేమో. పశ్చాత్తాపం తనకి ఉంది. కాని గడ్డకట్టుకుని. రాజాలి సమక్షంలో కాదు, పద్మ గారు చాపమీద మఠం వేసుకుని కూర్చుని శ్రుతి పెట్టె సవరించుకొంటూ ‘ఏదీ అది మళ్ళీ ఒక్కసారి ఆదిత్యాసో…?’అని హెచ్చరించినా రాదు. దొంతరలు దొంతరల కింద సంవత్సరాల కింద అది ఎక్కడో ఘనీభవించి ఉంది. గొంతు దాకా వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. హంసానందిని అందుకోగలిగినంత పశ్చాత్తాపం తనలో? నాగరికత ఏదో అడ్డు. గోదావరిని చూడటానికి అని ‘ప్లెజర్ ట్రిప్’ కాదు కొత్తపేట. హంస కోసం.
జింకల కళ్ళూ వాగుల నీళ్ళూ ఊళ్ళో అమ్మించి
రాళ్ళకి పువ్వుల రంగులు వేయించి
పైకం గుళ్ళో పంచుకు తిన్నాము.
ఒచ్చిన కొత్తల్లో తను కూడా అలాగే అనుకొనేది. అన్నం వేష్ట్ చెయ్యకూడదు, కూర వేష్ట్ చెయ్యకూడదు అని. ఇప్పుడు అదంతా సిల్లీగా ఉంటుంది. చెత్త కుండీల దగ్గర ఇంకా రంగైనా పోని సోఫాలు, మంచి టీవీలూ టేబిళ్ళూ పడీసుంటాయి. బట్టలు చెప్పులు తనకెన్నున్నాయో తనకే గుర్తుండదు. పిల్లలూ ఒక నాలుగు సార్లు తొడుక్కుని చెప్పులూ బట్టలూ ‘Yuk!’ అని పడెస్తారు.
“దిస్సీజ్ మై వొయిఫ్ …. అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!” అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి “నమస్తే ఆంటీ!” అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా “బాబు పేరేంటంకుల్ ?” అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ “మేక్ పీస్ ” అనే అన్నాడు మళ్ళీ.
బరువుగా తిరగళ్ళ చప్పుడు
ఆ గాలి పాడితే ఈ గజల్
That infamous Thelugoo Cockroach Castle?!”
“Yes! Its a dead place now”
సిమెంట్ రంగుల హొరైజన్ లోంచి సిమెంటు వంతెనల్ని సిమెంటు మబ్బుల్నీ చీల్చుకుంటూ సిమెంట్ రంగు రైలే చడీ చప్పుడూ లేకుండా వచ్చి ఆగింది. ఆగి రైలు మాట్లాడుతుంది. “Easley North! Doors Opening! Easley North!! Doors Opening!!” అని తనకి ఇష్టమైన తియ్యని స్వరంతో.
భాస్కర కుమార్ ఆ చెయ్యి పట్టు విడిపించి ‘రండింకెల్దాం రండి’ అంటే అందరూ పదండి పదండి అని మెట్లు దిగిపోయేరు. దొడ్డ చివరిసారిగా చిన్నమ్మలుతో […]
“ఉండండి ఆ మిగిల్నవి చూడ్ణియ్యండీ….అయ్యో ఈ సందులో పడీసేరేటండీ?” అని భాస్కర కుమార్ ఆత్రంగా ఆ పెయింటింగ్ చుట్టలు విప్పి చూడబోతే “అవెందుకండీ ఇప్పుడు ముందీ కార్డు సంగత్తేల్చండీ?” అని గద్దిస్తున్నాడు ఆతీ ప్రకాష్.
ఆదివారం చీకట్నే దొడ్డ గొప్ప సమరోత్సాహం తోటి గట్టిగా హనుమాన్ చాలీసా వల్లించుకుంటూ ఇడ్లీల పొయ్యి పెట్టింది. భాస్కర కుమార్ ఇట్నించొచ్చి ఒకటీ అట్నుంచొచ్చి […]
” పొద్దుట లెగ్గానే…మొట్టమొదాట ఒకాలోచనొస్తుంది కదా! అదేంటి..? అది … It is an assumption! …..ఎసంప్షన్ … ” అని ఎడం చేత్తో […]
ఆశబోతు జనాలు (అవుతాయవుతాయని గావాల) అమ్ముతారు కొంటారు అందుకే! అని పోతారు కట్ట మీద గుడిగంట ఎందుకు అంటున్నా బెదురుగొడ్డు జనాలు (పదండిపదండని గావాల) […]
ఓలమ్మీ! గాజులు పిన్నీసులు జడ కుచ్చులు లోలాకులు చాదుబొట్టు కొనుకుంతావా?! ఓలి పిల్లా! పొగడరు ముచ్చిబొట్లు సక్కబొట్లు రంగుబొట్లు స్నోముద్దలు సవరాములు చెంపపిన్లు కొనుకుంతావా?! […]
టకరగాయికె కొండ దారిని ఇంకా ఎవరూ లేవకుండా ఒక బుద్ధుని గుడి ఉందనుకుని ఈ మెట్లన్నీ ఎక్కేక రెండు మూగ శిఖరాల మధ్యన ఇక్కడ […]
క్రాలేటి వారి వీధి బురదలో
ఒక్కో గడియా కొట్టి నిలబడి
నెత్తిమీద రుమాలు వేసుకుని తడుస్తున్నావు
ఎక్కడా ఎవరూ లేరు
నాగలింగం చెట్టు కొమ్మల మీద
పాట గాలి పాడుతోంది
ఇవి ఇలా ఉండవు. చెప్పుడు మాటల్లాగ పెట్టుడు సొమ్ముల్లాగా తేలిపోతాయి రాలిపోతాయి. ఇవి అలాగా ఉండవు గాజుకాయల్లాగ పచ్చి కుండల్లాగా పగిలి పోతాయి పుసికి […]
బారకాస్ లో సర్కస్ పెట్టేరు.” నాంగారండీ నాంగారండీ…సర్కస్సు నాండీ… నాండీ…సర్కస్సండీ?!…నాండీ…?! “అంటే ” ఏఁవిట్రా? వెధవ నస!…ఏఁవిటే?! వెధవ నస!! “అని దులపరించుకుని తిలకం […]
ఆదర్శనగర్ దగ్గర బస్సు చెడిపోయింది. కూచోండి రిపేరుకి పంపించేము అన్నారు. కొబ్బరి బొండాలు కొట్టే చోట బస్సు దిగి కొత్త షూస్ బిగించుకుని చెమటలు […]
“ఇప్పుడేం చెప్పమన్నావు. ఏభయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు లాహోర్ లో ఉన్నాను కదా Tribune కి సబెడిటర్ గిరీ. నాకు బాగా జ్ఞాపకఁవేను. మా […]
నిరాద్ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్ బాబు 1999లో, తన నూట […]
ఇది “తమాషా దేఖో” ధారావాహికలో ప్రస్తుతానికి ఆఖరి భాగం. కథ పూర్తిగా పూర్తి కాకపోయినా ఒక నడిమి మజిలీ చేరింది. కనకప్రసాద్ ముందుముందు మళ్ళీ ఇక్కడినుంచి మొదలుపెట్టి నిజమైన ముగింపుకి చేరుస్తారని ఆశిస్తాం.
తెలుగు సాహిత్యంలో ఇలాటి ప్రయోగాలు చాలా అరుదు. పాత్రల్ని, స్థలాల్ని, వర్తమానసమాజాన్ని ప్రతిబింబించటంలో ఈ ధారావాహిక గురజాడ వారి “కన్యాశుల్కం” వారసత్వం తీసుకున్నదని మా విశ్వాసం. ఇలాటి రచనను “ఈమాట”లో ప్రచురించటానికి అవకాశం కలిగించిన శ్రీ కనకప్రసాద్‌కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
(నలుగురూ కూర్చుని సుబ్రమణ్యం కోసం చూస్తుంటారు. బయట ఉండుండి పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. కర్టెన్ వెనకనుండి ఒక మూడేళ్ళ బాబు తొంగి తొంగి చూస్తుంటాడు.) […]
(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్, వినిపిస్తయ్. […]
(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్, వినిపిస్తయ్. […]
(జరిగిన కథ వర్ధమాన హోంబిల్డర్ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న […]
(క్రితం భాగం కథ వర్ధమాన హోంబిల్డర్ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం […]
(వర్ధమాన హోంబిల్డర్ కోటీశ్వర్రావ్, అతని బావమరిది కృష్ణ సాగిస్తున్న కస్టమర్ల వేట క్రితం భాగం తరవాయి ఇప్పుడు చదవండి) (లోపల్నుండి రమణా రావ్ గోపాల్ […]
(కనకప్రసాద్ గారు నాటికతో దగ్గరి సంబంధం ఉన్న ఈ కవితను కూడ దాన్తో కలిపి ప్రచురించమని కోరేరు. అలాగే చేస్తున్నాం.) మహా కరుణ అనుభవాలమీది […]
పావు తక్కువ పదకొండు. క్వాలిటీ ఐస్ క్రీం, శ్రీ వెంకటేశ్వర, హోటల్ న్యూ వెంకటేశ్వర, క్రంచీస్ ఎన్ మంచీస్ అన్నీ మూసీసేరు. పేవ్ మెంట్ […]
దమయంతమ్మ గారు వాళ్ళ బన్నీ, ఆపగాడు, ఎలుమంతి శంకర్రావు, చంటి, రవణ మేష్టారి కాశీపతి, బూతుల కిష్టప్ప, గాజుల మామ్మ గారింటికి సునాబేడ నుండి […]
వెలుగు నగరాలు కాదు ఈ మృదుల తల్పాలు కాదు కర్ర కోటలలో ఇన్నివర్ణ చిత్రాలు కాదు ఈ లోహ పుష్పాలు కాదు పండుగల గోడలకి […]
మూలం : Ernest Hemingway ‘Cat in the rain’. Boston నుంచి ఇద్దరు దిగేరు. కిళ్ళీలు నములుకుంటూ ఒక జంట వరండాలో నిలబడి […]