రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఎలిపోమను

రచన: కనకప్రసాద్
జులై 2010

తొలీత గురుస్వామి మొకము చూచిన్నాడు
వెతికింది దొరికిందిర దద్దా అనుక్కున్నాను.
పెరడు తవ్వినోడికి లంకెబిందెల్లాగ –
ఎదురుచూడ్డాలంటె ఇలాగే గావాల.
మలీత సద్గురుడు కబురు పెట్టిన్నాడు
ఎందుకొచ్చిన గొల్లని ఎనక్కొచ్చీసేను.
దొంగ ఠానా ముందు దడుసుకున్నట్టుగ –
మోజూరితనమంటే ఇలాగే గావాల.
ఈసుట్టు ఆయనే ఎదురొచ్చినప్పుడు
‘ఏఁటి సోదరా? కులాసా?’ అని పలకరిస్తున్నాను.
గుడిమీద పావురాలు కూకుడున్నట్టుగ –
మనం మనం బరంపురం ఇలాగే గావాల.

తొన్నాడు గురువరుని బోధనలు వినుకోని
ఆచరించవలెనని ఆత్రపడిపోయేను.
లంఖణాల రోగికి వడ్డించినట్టుగ –
ఆశ లావు పీక సన్నం ఇలాగే గావాల.
మీదటికి వచనములు వల్లించి వల్లించి
నమ్ముదునా మానుదునా రవ్వ పడిపోయేను.
సంధిలో జడుపొచ్చి సణుక్కున్నట్టుగ –
పెరటి చెట్టు మందంటె ఇలాగే గావాల.
ఈపాలి తత్వములు చదవొచ్చినప్పుడు
ఒళ్ళు కంపరమెత్తి లెగిసెళ్ళిపోతాను.
ఒద్దన్న సీడేదొ వెంట తరుముతునట్టు –
ఇంక చాలు సోదరా అంటె ఇలాగే గావాల.

ఒక్కడివె ఒక్కాడ నిలువుమని గురుడంటె
ఒళ్ళు మరిచిపోయి ఒచ్చి కూకున్నాను.
తిరిగి తిరిగి ఇంట్లోకే తిరిగొచ్చినట్టుగ –
స్వాగతం క్రిష్ణా అంటె ఇలాగే గావాల.
రాన్రాను ఒక్కణ్ణి ఒసిలి కూకోనుండి
ఉండబట్టలేక ఉలుకులికి పడ్డాను.
వొగిసిందాయి వీధిలోకి వొచ్చెల్లినట్టుగ –
వగలాడితనమంటె ఇలాగే గావాల.
ఈనడుమ ఒక్కణ్ణి ఇమ్ముకోనుంటేను
ఇంకేటికావాలని ఇచ్చగించుకుంటాను.
ముసిలి బేపి చూరు కింద మిడుకుతున్నట్టుగ –
సచ్చిన కుక్కలాగంటె ఇలాగే గావాల.

కార్తీక దీక్షలకి తావళము రప్పించి
తెల్లారి తెములుకుని కోవిల్లకెళ్ళేను.
బాలెంతరాలు పిల్లి ఏడిళ్ళు తిరిగినట్టు –
కొత్త పూజారంటె ఇలాగే గావాల.
మీదటికి స్నానాలకెల్దాము రమ్మంటె
మాటా పలుకూ లేక టక్కు పెట్టీసేను.
ఊరుగాని ఊర్లోన ఉష్టపడ్డట్టుగ –
మల్లగుల్లాలంటె ఇలాగే గావాల.
ఈయేడు కార్తీక నెత్తాళ్ళకంటేను
తల తిరిగినట్టయ్యి తప్పుకోనెల్తాను.
అప్పులోడ్ని కనిపెట్టి తప్పించుకున్నట్టు –
నామాన్నేనంటె ఇలాగే గావాల.

1 2 3అంతా ఒకే పేజీలో

ఈ రచయిత నుంచే...

  • పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో సంభాషణ
  • ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా
  • అక్కర లేని సంగతుల
  • మూడు లాంతర్లు
  • ఇసక-1

ఇటువంటివే…

  1. ఎల్లండెల్లండి
  2. పసిఁడిపల్లకి
  3. నువ్వు
  4. నేను పులిని
  5. శ్రీకృష్ణదేవరాయలు

జులై 2010 సంచికలో ...

  • పసిఁడిపల్లకి
  • అ, న్యాయం
  • ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి
  • ఈమాట జులై 2010 విజయనగర రాయని విశేష సంచికకు స్వాగతం!
  • ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం
  • ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ
  • ఎలిపోమను
  • కృష్ణదేవరాయలు
  • తలుపుల రసీదు
  • నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో ఒక ఉదయం
  • నిలువనీడ
  • నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం
  • నువ్వు
  • నేను పులిని
  • రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం
  • విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం
  • శ్రీకృష్ణదేవరాయలు
  • శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము
  • సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు
  • సిరికాకొలను చినదానికి ఆశీస్సు
  • సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నిలువనీడ
తలుపుల రసీదు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.