పంతంగా పరుగు అంతం లేని అవధి వైపు,కాల యంత్రం వెనుక తరుముతూ.. ఆగితే కబళిస్తుంది! నిన్న ఉన్నానా? రేపు ఉంటానా? అన్నీ ప్రశ్నలే! ఆకలి […]
జనవరి 2003
ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
క్రితం సంచికలో వివరించినట్లు “ఈమాట”కు శ్రవ్యవిభాగాన్ని కూడ కలుపుతున్నాం. ఎవరూ వారి రచనల్ని శ్రవ్యరూపంలో పంపలేదు కాని ముందుముందు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం, రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఐతే ఆంధ్రులకు అతి ప్రియతమమైన సినీసంగీతం కొంత ఈ సంచికలో అందిస్తున్నాం. ఇప్పటి పాటలు దొరికే స్థలాలు ఇంటర్నెట్ మీద చాలానే ఉన్నాయి కనుక మేము చాలా పాత పాటలతో ప్రారంభిస్తున్నాం. చిత్తూరు నాగయ్య , శాంతకుమారి , బాలసరస్వతీదేవి లాటి వారి గాత్రమాధుర్యాన్ని, అప్పటి సంగీతధోరణుల్ని ఆనందించగలిగే వారికి, కనీసం అవెలా వుంటాయో అన్న కుతూహలం వున్నవారికి ఇవి ఆమోదయోగ్యాలవుతాయని భావిస్తున్నాం. ఈసంచికలోనే శ్రీశ్రీతో ఆకాశవాణి చేసిన బాతాఖానీని వినిపిస్తున్నాం . రాబోయే సంచికల్లో అరవైలు, డెబ్భైలు, ఎనభైల మొదల్లో వచ్చిన పాటలు, కొన్ని శ్రవ్య కావ్యాలు, మీ ముందుంచటానికి సిద్ధం చేస్తున్నాం.
ఇక రచనల విషయంలో ఈ సంచికలోనూ “ఈమాట” నుంచి మీరు ఆశించే స్థాయి కథలు, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాం. కనకప్రసాద్ కవిత “శ్రోతలు కోరని పాట” తెలుగు కవిత్వంలో ఒక కొత్త మార్గం. ఆస్వాదించి ఆనందిస్తారని ఆశిస్తాం. భాస్కర్ నాటిక “బిగ్ బక్స్ ” వినోదాత్మకమే కాకుండా ఇక్కడ ప్రదర్శించటానికి సరైన నాటికలు దొరకని లోటును కొంతవరకు తీరుస్తుందని భావిస్తున్నాం.
రాత్రంతా నిద్రపోలేదు సత్యానంద్. సినిమా విడుదల అంటే మాటలా? ఎన్ని పన్లు! ఎంతమందితో ఫోన్లు!! ఎందరికి పురమాయింపులు! ఎందరికి బుకాయింపులు!! ఇంకెందరికి బుజ్జగింపులు!!! పెళ్ళివారిల్లులా […]
సుజాత అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడే కొద్ది షాపింగుతో, చుట్టాలను చూడ్డానికి తిరగడంతో గడిచి పోతూనే వుంది. సుజాత క్లాస్మేటు రాధిక మాత్రం, […]
బంగారు బొమ్మ రావేమే … పందిట్లొ పెళ్ళి జరిగేనే …సన్నాయి మేళగాళ్ళు అద్బుతంగా వాయిస్తున్నారు అమ్మాయి దోసిట్లో కొబ్బరి బోండాం తో తలవొంచుకుని మెల్లగా […]
క్రాలేటి వారి వీధి బురదలో
ఒక్కో గడియా కొట్టి నిలబడి
నెత్తిమీద రుమాలు వేసుకుని తడుస్తున్నావు
ఎక్కడా ఎవరూ లేరు
నాగలింగం చెట్టు కొమ్మల మీద
పాట గాలి పాడుతోంది
సగం నిద్రలో గడచిన సగంజీవితం సగంనిద్రలో కలుక్కుమని గుచ్చుకున్న సగంచదివి విడిచిన పుస్తకం. సగమే ముందు సగం గతం ఆశపడటం అప్పుడప్పుడు అసంగతం. నడినెత్తికిచేరిన […]
1 మెలకువలో మత్తు మెలికతోవ తప్పి నిలుస్తాను నీడలా ఖయ్యాం!నాపని ఖాళీ 2 మంచురెల్లు పూలు కంచుచేతుల తడిమినా ఇంచుక లేదు తడి ఖయ్యాం!నాపని […]
చీకటిగుహ నుండి బయట పడుతున్నప్పటి వెలుగు ఉదయం పగలంతా ఒక విచ్చలవిడి తనం ఎవరేమనుకున్నా సరే! సాయంత్రానికి తెలుసు తాను దేనికి దగ్గరౌతోందో! ఎప్పుడో […]
ఒక గొప్ప ప్రారంభం కోసం అన్వేషణ పేలవమైన ముగింపుగా కొట్టుమిట్టాడుతుంది వేయి తుపాకుల ముందుకూడా తలవంచని ధైర్యం తోవ తెలియని తనంతో నీరు కారిపోతుంది […]
ఇవి ఇలా ఉండవు. చెప్పుడు మాటల్లాగ పెట్టుడు సొమ్ముల్లాగా తేలిపోతాయి రాలిపోతాయి. ఇవి అలాగా ఉండవు గాజుకాయల్లాగ పచ్చి కుండల్లాగా పగిలి పోతాయి పుసికి […]
పాల్ సెలాన్(Paul Celan) జర్మన్యూదు.కష్టాలు పడ్డాడు.నాజీలు కడతేర్చారు కన్నవాళ్ళని. కాన్సంట్రేషన్కాంపుల్లో మగ్గి ఫ్రాన్స్చేరుకొన్నాడు.అక్కడ ఒక విదుషీమణిని పెళ్ళిచేసుకొన్నాడు.ఆమె కడదాకా,అంటే తను నీట మునిగి చనిపోయేదాకా […]
(నాటిక) (తెర తెరవగానే బాక్ గ్రౌన్డ్లో మాటలు మొదలవుతాయి రాజా కూర్చుని ఉంటాడు.) ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తి రాజా. 4 నెలలక్రితం పింక్ […]
ఈ రోజుల్లో తమ పిల్లలకు సంగీతం నేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరివద్ద నేర్చుకోవాలనేది ఒక సమస్య అయితే ఎటువంటి […]
కారులు, విమానాలు, మెషీను గన్నులు … మధ్య లో కూర్చుని నవ్వుతూ ఆడుకుంటున్న ఒక రెండు మూడేళ్ళ పిల్లవాడు. వాడు ఆడుకునే ఆ కాస్త […]