తిల్లాన

రాగం: లలిత
తాళం: ఆది

స్వర కల్పన, రచన: ఎ.ఎస్. పంచాపకేశ అయ్యర్
తమిళ్ మూలం: తిరుక్కురళ్ (తిరువళ్ళువార్)
గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
తెలుగు: కనకప్రసాద్

ఆరోహణ:    స రి1 గ3 మ1 ద2 ని3 స
అవరోహణ: స ని3 ద2 మ1 గ3 రి1 స

తమిళ మూలం:
అకార ముదల| ఎఝుత్తెల్లాం (ఆ…)||
ఆది భగవన్ ముదట్రె ఉలగు
పిరవిప్ పెరుంకదల్| నీందువర్ నీందర్||
ఇరై వనడి సేరాదార్

సాహిత్యం

పల్లవి:
ధీం, ధీం తనన ధిరన ధీంత ధిరనా|
తన ధిరనా ధిరనా తిల్లాన||
తదర తాని తాకు ఝేకు థకజణు తోం|
థఝణు తోం, ఝణు తోం, తఝణు||          |ధీం…|
అనుపల్లవి:
తదృమి థకిట ద ని ద మా గదృమికిట|
థాం …||
తదృమి థకిట ద ని ద మా గదృమికిట|
థాం ధీం …||
తదృమి థకిట ద ని ద మా గదృమికిట|
థాం ధీం తోం ని స రి గ మ ద ని||
నాదృథ ధీం మ గ రి స ని తోందృథ ధీం|
థదింగిణ తోం తిల్లానా థదింగిణ తోం థదింగిణ తోం||         |ధీం|
చరణం:
అకారము మొదలు అక్షర మాలకు
ఆది ఆకసము మొదలు అఖిల జగతికిని
పెనవి పెను కడలి నీదను వశమా
ఈతని పదములను
శరణనుకొనక ఇరవున?