ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు
కాయకష్టం కానీ అన్నాడు కలిగినంతలో తిన్నాడు
ఎండా ముసురు గాలీ వాన చలికాలం
ఎవడి కష్టం వాడిది ఎవడు చూడొచ్చేడుపది గడపల వాసమ్మా గడప నాలుగిళ్ళు
ఇందమ్మంటే అందమ్మంటే ఇంటిల్లిపాదీ ఓ జట్టు
ఎవడి మాను వాడు నాన్నా ఎవడు ఎవడిక్కావాలి
ఫెళఫెళ్ళాడి ఎండా గాలీ వలవల్లాడి వానఏదీకాన్దాన్ని చూసి నవ్వేరు ఎవడిమీదనమ్మా దీని రోకు
పసిపిల్ల బాలాదీ పడివాట్లు పచ్చి దోసపాదు దీన్నట్టిల్లు
ఊరూపేరూలేన్దానికేనుటేనే అమ్మా ఎవడూకానివాడి ఆను
ఊరికే ఏం వెర్రోనమ్మా వాడి గాలీ వానా దాని ఎండఎవడి చింతకి దాని గాలి ఎవడి ఎండకే దాని గొడుగు
ఏ ఏడుపే అదేడిచింది విన్నావా ఏ నవ్వుకే దాని నవుతాలు
ఏదీకాన్దాని కన్నీళ్ళు ఎవడో ఒహడమ్మా వాడి వేణ్ణీళ్ళు
చలికాలం పెందరాళే మబ్బూ వణ్ణం చారూ గాలీ నొవ్వా ముసురుఎవరో ఒకళ్ళని చేసీసుకుని ఎక్కడో ఓక్కడ వాళ్ళవాళ్ళు
అక్కడివాళ్ళకిందే లెఖ్ఖటమ్మా ఇక్కడిదిక్కడే ఏదీ ఎవడూ
ఇరుగూ పొరుగూ ఇటుతెన్న అటుతెన్న గొడుగూ చిరగా వడగళ్ళు
ఒచ్చేం ఒచ్చేం అమ్మా నాన్నా చూసేం వెళ్ళేం వెళ్ళేంఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంటకాగా పోగా ఎవడు వాడిమానాన్న వెఱ్ఱినవ్వుల నిద్దట్లో పోయేడు
ఏమీకాన్దాని చెయ్యి ఎవడి చేతిలోనే ఎవడివేపోనమ్మా దాని చూపు
అయిపోయిందమ్మా ఇద్దర్నీ దింపి నీళ్ళు ఎవళ మానూ రాళ్ళు వాళ్ళు మన్నాడు
ఆ ఊరికీ ఊరు కర్రా నిప్పూ ఎంతోనమ్మా ఈ ఊరికీ వానా మన్నూ ఆ ఊరుదోనె పక్కన దొప్పమ్మా వత్తిని తడిపితే వత్తి
ఏట్లో దీపం వెలగా ఆరా వెర్రి నిద్దట్లో భ్రాంతి
ఏమీకాన్దీ ఎవడోవాడూ ఎండలో వానా ఏమిట్ల పెళ్ళి
కనీ కనపణ్ణట్టు మెరుపమ్మా కొసాకి వినీ వినపణ్ణట్టు గాలి.ఫది గడపల చింతాడ పసిపిల్ల బాలాది
గడప నాలుగిళ్ళమ్మా మానిందే ఊరు
ఎంత చెట్టుకా గొడుగు ఏ ఎండకా గాలి
ఏదీ ఎవడూ కాని పొగ మంచు చెదిరిపోతే ఆ యింతా మరిపింత.
[ఆంగ్ల మూలం: Anyone lived in a pretty how town – e. e. Cummings]