సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు…

గణిత ప్రపంచంలో మూడు శతాబ్దాలకి పైబడి పరిష్కారం లేకుండా ఉండిపోయిన అతి జటిలమైన సమస్య ఏదయ్యా అంటే అది ఫెర్మా కదాచిత్తుగా ప్రవచించిన ఒక అభిప్రాయం. ఎవరీ ఫెర్మా? ఏమిటా శిష్టాభిప్రాయం? ఈ సమస్య పరిష్కారం లేకుండా మూడు వందల ఏళ్ళు పైబడి ఎందుకు ఉండిపోయింది? చివరికి పరిష్కారం ఎలా దొరికింది?

ప్రియుని ప్రవాసవార్తను విన్నంతనే ఆమె తనువు కృశించినది. కన్నీరు నిరంతరముగా కారిపోయినది. ఆ వెళ్ళబోవుప్రియునితో అతనికి మిత్రములైనట్లుగా ఇవన్నియు బయలుదేరినవి. ఒక్క ప్రాణము మాత్రమే ఆమెలో మిగిలియున్నది. ఓప్రాణమా! నీవును నీకు మిత్రసమానులైన వారితో బోవక ఎందుకున్నావు? అని యామె ప్రశ్నించుచున్నది.

శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.

మల్లెపూలు కోసుకొచ్చి, ఒడిలో పోసుకొని, తల్లి దగ్గర కూర్చొని ఉంది కొత్త పెళ్ళికూతురు. ఒకో పువ్వుని తల్లికి అందిస్తూ ఉంటే ఆమె కూతురికి చక్కని వాలుజడ అల్లుతోంది. ఈ లోపున ఈయన వచ్చారు. ఇంకా కొత్త కదా, సిగ్గూ బిడియం పోలేదు. ఆయన్ని అలా చూసేసరికల్లా ఆ నవోఢకు ఏం చేయడానికీ పాలుపోలేదు. దగ్గరకి వెళ్ళాలా, అలాగే ఉండాలా, సిగ్గుతో పారిపోవాలా – ఏమీ తెలియక, ఏదో చేయాలన్న తొందరలో, దిగ్గునలేచి మునిగాళ్ళపై నిలుచుండిపోయింది.