దారి కాదు

మిట్ట మధ్యానం
కొట్టు తీయించేరు
బావికొండకి తోవిలాగేనా? అంటారు.
దాహానికి ఛల్హటివి నీళ్ళు తెమ్మంతారు!
నిద్దర చెడగొట్టీసేరు,
ఇక్కడెవులున్నారు?
నీళ్ళేవు నిప్పుల్లేవు ఎల్లండెల్లండి!
ఎర్రటెండల్లంట
మీకెవుల్రమ్మన్నారు?

గండిగుండం కాసెల్లి
ఎనక్కొచ్చీసేరు.
ఈ అగ్గికత్తెర్లంట
ఏటెతుకుతున్నారు?
అవతలేటున్నాది,
అటూరూ లేదు కాడూ లేదు.
ఆ దిబ్బూసు మీకేల? ఆ దుక్కెల్లకండి!
రాళ్ళు బండల మీద
రాతలేటి చదివెస్తారు?!

గట్లు తవ్వెస్తారు
లెక్క రాసెస్తారు –
కరణాలు మునసబులు నర మానవుల్లేరు!
గుడి కూలిపోయింది
అందలెవులున్నారు?!
చెప్తుంటె మీక్కాదు? పల్లకుండండీ!
బావి కొండకి
తోవ లేదు!