ఇల్లు విడిచి పోతావా రమణా?
(రమణ మహర్షి ఇల్లు వదలి వెళ్ళినప్పుడు అమ్మ అలఘమ్మ పాడినట్లు పాట).
రాగం: చారుకేశి
తాళం: రూపక తాళం
స్వర రచన, గానం: పేరి పద్మావతి
స్వరరచన: వేంకటరామన్ సత్యనారాయణ
స్వర కల్పన, రచన: కనకప్రసాద్
సాహిత్యం
పల్లవి:
ఇల్లు విడిచి పోతావా రమణా?
అన్ని తెలిసి ఇన్ని కలిగి
ఇల్లిల్లు తిరిగి ఉంఛమెత్తి
గుళ్ళవెంట పోతావా తగునా?
అన్ని తెలిసి ఇన్ని కలిగి
ఇల్లిల్లు తిరిగి ఉంఛమెత్తి
గుళ్ళవెంట పోతావా తగునా?
చరణం:
అన్నుకొంటివనుకొని ఇం
కెన్నినాళ్ళు వేతునురా
అన్నెకాడ అమ్మను, మీ
అమ్మవారు పొమ్మనదా?
నిన్ను వెదికి చిన్నబోయి
నీళ్ళు వదలుకుంటానని
నన్ను మరచి పోతావా రమణా? |ఇల్లు విడిచి|
కెన్నినాళ్ళు వేతునురా
అన్నెకాడ అమ్మను, మీ
అమ్మవారు పొమ్మనదా?
నిన్ను వెదికి చిన్నబోయి
నీళ్ళు వదలుకుంటానని
నన్ను మరచి పోతావా రమణా? |ఇల్లు విడిచి|
చరణం:
విల్లు విరిచి తన్ను తెలిసి
తల్లిఁ వెఱచి యున్నపుడా
నల్లని స్వామికి లేదే
ఎన్నడైన విన్నామా?
కన్ను తెరచి మూసినంత
చిన్నదిరా ఈ మన్నిక
కల్లఁజేసి పోతావా నిజమా? |ఇల్లు విడిచి|
తల్లిఁ వెఱచి యున్నపుడా
నల్లని స్వామికి లేదే
ఎన్నడైన విన్నామా?
కన్ను తెరచి మూసినంత
చిన్నదిరా ఈ మన్నిక
కల్లఁజేసి పోతావా నిజమా? |ఇల్లు విడిచి|
చరణం:
వెల్ల కడలి ఒళ్ళు మరచి
ఆ తల్లి నేలుకుంటాడే
ఎల్ల జగములకు రాజు ఆ
పన్నగ సాయికి లేదీ
యొల్లబాటు త్రుళ్ళిపాటు
గొల్లున నవ్వుచు పోరా?
తల్లినొదిలి కడతేరను వశమా? |ఇల్లు విడిచి|
ఆ తల్లి నేలుకుంటాడే
ఎల్ల జగములకు రాజు ఆ
పన్నగ సాయికి లేదీ
యొల్లబాటు త్రుళ్ళిపాటు
గొల్లున నవ్వుచు పోరా?
తల్లినొదిలి కడతేరను వశమా? |ఇల్లు విడిచి|
స్వర రచన
[స్వరం పై గీత తారా స్థాయికి, క్రింద గీత మంద్ర స్థాయికి గుర్తు. స్వరాల్ని కలుపుతూ క్రింద చుక్కల గీత తాళ గతికి సూచనలు. డౌన్లోడ్ చేస్కోటానికి వీలుగా స్వరాలని పీ.డీ.ఎఫ్ రూపంలో కూడా ఇస్తున్నాము.]
పల్లవి: పా ; ని ద పా పా ప మ | గ ప మ గ సా ; రి గా మా | ; పా ; ద పా ; ద మా పా ;| ఇ .ల్లు . వి డి చి పో | . . . తా . . . వా . | . . ర . మ ణా . . . . ? ; పా ద నీ సా సా | ; గా గా రీ మా మా గా రీ సా | . అ న్ని తె లి సి | . ఇ న్ని . క . లి . గి . సా సా రీ సా సా సా | సా ; నీ దా పా దా | ; ప ని ద పా పా ప మ | ఇ ల్లి ల్లు తి రి గి | ఉం. ఛ మె . త్తి | . గు .ళ్ళ వెం . ట . గ ప మ గ సా రి గా మా | ; పా ద పా ద మా పా ;| పో . . . తా . వా . | . త . గు . నా . . ? చరణం: ; సా స రి గా ; గా | గా గా మా గా ; గ రి | గ మ పా పా పా ; ప మ | . అ న్ను. కొం. టి | వ ను కొ ని . ఇం. | కె . న్ని నా . . ళ్ళు . గ మ పా పా ద పా ద మా పా | ; పా ద నీ ; నీ | సా ; సా రీ సా ; | వే . . తు . ను . రా . | . అ న్నె కా. డా | అ . మ్మ ను మీ . సా ; నీ దా పా ప మ | గా మా ప ని ద ద పా ; | అ .మ్మ వా . రు . | పొ . మ్మ . న . దా . ? ; ద ప ద నీ సా సా | ; గా గా రీ మా మా గా రీ సా | . ని . న్ను వె ది కి | . చి . న్న . బో . . యి ; ని ద పా ద నీ సా సా | గా ; గా రీ మా మా గా రీ సా | . ని . . న్ను వె ది కి | చి . న్న . బో . . . యి ; సా సా సా సా సా | నీ ; దా పా దా దా | ; ప ని ద పా పా ప మ | . నీ ళ్ళు వ ద లు |కుం. టా . న . | . ని న . న్ను మ ర చి గ ప మ గ సా రి గా మా | ; పా ద పా ద మా పా ;| పో . . . తా . వా . | . ర . మ . ణా . . ? |ఇల్లు విడిచి| చరణం: ; పా ద నీ సా సా | ; గా రీ మా మా గా రీ సా | . వి ల్లు వి రి చి | . త న్ను తె . లి . సి ని స రీ సా సా సా సా | నీ ; దా పా దా ; | ; ప దా ని సా సా ; | త .ల్లిఁ వె ఱ చి యు| న్న . పు డా . . | . న . ల్ల ని స్వా . సా సా ని ద నీ ద ప ద మా | ; గా మ పా ; పా | పా ప మ పా ని దా ని పా ; | మి కి . లే . . దే . . | . ఎ న్న డై . న | వి . . న్నా . . . మా . ? ; పా ద నీ సా సా | గా ; గా రీ మా మా గా రీ సా | ; సా సా సా ని ద ని పా | . క న్నుతె ర చి | మూ . సి . నం . . . త | . . చి న్న ది . రా . గా మా పా ; దా పా | ; ప ని ద పా ; ప మ | గ ప మ గ సా రి గా మా | ఈ . మ . న్ని క | . . క . ల్లఁ జే . సి | పో . . . తా . . వా ; పా ద పా ద మ పా ; | . ని . జ . మా . . ? |ఇల్లు విడిచి| చరణం: ; మా గా రీ సా దా | ; పా ద నీ సా సా | . వె ల్ల క డ లి | . ఒ ళ్ళుమ ర చి గా గా గా రీ మా మా గా రీ | సా ని సా గా రీ సా దా | ; ప ని ద పా పా పా | ఆ త ల్లి . నే . . . | లుకొం . టా . డే . | . ఎ . ల్ల జ గ ము పా పా ప ద నీ స సా సా | ; సా సా సా సా ; | సా సా ని ద నీ ద ప ద మా | ల కు రా . . . జు ఆ | . ప న్న గ సా . | యి కి . లే . . దీ . . ; గా మ పా ; పా | ; ప ని ద పా ; పా | ; ప ని దా పా పా ; | . యొ ల్ల బా. టు | . .త్రు . ళ్ళి . పా | . టుగొ ల్లు న న . పా మా పా ని దా ని పా ; | ; ప ని ద పా పా ప మ | వ్వు చు పో . . . రా . | త . ల్లి నొ ది లి . . గా గా మ మ గ రి స రి గ మ | ; పా ద పా ద మా పా | క డ తే . . . ర . ను . | . వ . శ . మా . ? |ఇల్లు విడిచి|
‘For Francis.’