ఎవరు చూడొచ్చేరు?

గాలి సావిట్లోకొస్తే
ఎవరు చూడొచ్చేరు?
నువ్వూ చూళ్ళేదూ నేనూ చూళ్ళేదు:
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.

గాడుపు ఈడ్చి కొడుతుంటే
ఎవళ్ళకి కనిపిస్తుంది?
నీకూ అవుపడదూ నాకూ అవుపడదు:
చెట్లు జుట్లు విరబోసుకుని
తలలొగ్గి ఊగుతుంటే
అయ్యొ గాలిరా నానా!!
అనుకోడం తప్పించి.


[Inspiration: Who Has Seen the Wind? Christina Rossetti.]


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ \\\’ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా\\\’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, \\\’బర్సాత్‌ మే బిల్లి\\\’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...