చెదరి పడే ముంగురులలరిచి పోరా
రాగం: బిహాగ్
తాళం: ఏక తాళం
సంగీతం, గానం: పేరి పద్మావతి
రచన: కనక ప్రసాద్
(హిందుస్తాని గీతం లట్ యులఝీ సులఝా జా బాలమ్ ఆధారంగా)
సాహిత్యం
చెదరి పడే ముంగురులలరిచి పోరా
చేతుల గోరింట తడియారదూ
చెదరి పడే ముంగురులలరిచి పోరా.
పాపిటి చేరిటు పడునీ శయ్యను
తమిఁ నీచే సరిచేయను రారా
చేతుల గోరింట తడియారదూ
చెదరి పడే ముంగురులలరిచి పోరా.
కైతవ బాహు విశాలా…
కౌస్థుభ మణిహారా…
మౌక్తిక కేయూరా
గోపాలా
చెదరి పడే ముంగురులలరిచి పోరా.
హిందుస్థానీ మూలం
రాగ్: బిహాగ్
లట్ యులఝీ సులఝా జా బాలమ్
హాఁథోన్ మె మెహెందీ లగీ మొరే బాలమా
లట్ యులఝీ సులఝా జా భాలమ్
మాథ కి బిందియా గిర్ గయి సేజ్ పె
అప్‌నీ హాఁథ్ సజా జా మొరె బాలం
హాఁథోన్ మె మెహెందీ లగీ మొరే … బాలమా
లట్ యులఝీ సులఝా జా భాలమ్
‘For Mrs. Chandana Dixit’