అనువాదంతోనే ఆంధ్ర సాహిత్యానికి అంకురార్పణ జరిగింది.మన ప్రాచీన కవుల్లో చాలామంది అనువాదంలో నిష్ణాతులు.నీ డు ము వు లు నీవు తీసుకొని మా సంస్కృతాన్ని […]
మార్చి 2003
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం !
మీరు చూపుతోన్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.
రచయిత్రు(త)లు చాలామంది “ఈమాట” పాఠకుల నుంచి వారి రచనల మీద అభిప్రాయాలు, విమర్శలు ఇంకా ఎక్కువగా వస్తే అది అందరికీ ఉపయోగకరంగా వుంటుందని సూచిస్తున్నారు. ఇది సహేతుకమైన విషయమే! ఎన్నో వేలమంది పాఠకులు చదువుతున్నా వారిలో కొద్దిమంది మాత్రమే వారి అభిప్రాయాల్ని పంచుకోవటానికి ముందుకొస్తున్నారు. ఇది ఆంధ్రుల సహజప్రవృత్తే ఐనా అప్పుడప్పుడైనా కొంత అసహజంగా ప్రవర్తించటంలో తప్పు లేదు.
విదేశాంధ్రుల జీవితానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం కలిగించటం ఈ పత్రిక ప్రధానోద్దేశ్యం అని పదేపదే వివరించనక్కర లేదు. లక్షల సంఖ్యల్లో అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో వుంటూ కేవలం కొద్దిమందే వారి అనుభవాల్ని పంచుకోవాలనుకోవటం ఆంధ్రులకున్న హ్రస్వదృష్టిని సూచిస్తుంది.
మనకు మన భాష ఏమైపోయినా పట్టింపులేదు. సాహిత్యం మట్టిగొట్టుకుపోయినా చీమకుట్టినట్టు వుండదు. త్వరలో ఈ పరిస్థితి మారకపోతే తెలుగుభాష నశించటానికి అవకాశాలు చాలా ఎక్కువ. “ఇంతకాలం వున్న భాష ఈ తరం వాళ్ళు పట్టించుకోనంత మాత్రాన పోతుందా?” అనో, లేకపోతే “భాషని బతికించటం ప్రభుత్వం పని, నాది కాదు” అనో మనల్ని మనం మభ్యపెట్టుకోవటం తేలిక. ఐతే జీవితంలో చాలా వాటి లాగే మాతృభాష విలువ కూడ అది మృగ్యమై పోయేవరకు లెక్కపెట్టకుండా వుంటే ఇంక అప్పుడు తెలుసుకునీ ఉపయోగం వుండదు.
స్వీడన్లో ఉన్న జనాభా చాలా తక్కువైనా వాళ్ళ భాషను వాళ్ళు ఎలా వృద్ధి చేసుకుంటున్నారో సోదాహరణంగా చూపిస్తున్నారు వేమూరి వేంకటేశ్వర రావు గారు, వారి వ్యాసంలో. కనకప్రసాద్ కవితలు, మీకు వినోదం కలిగిస్తాయని మేము భావించే కథలు, లోతైన వ్యాసాలతో ఈ సంచికను మీ ముందుంచుతున్నాం.
సంప్రదాయ సాహిత్యాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా మీకు అందుబాటులో వుంచటానికి మనుచరిత్రలోని తొలి రెండు ఆశ్వాసాల్ని ఇస్తున్నాం. అలాగే సుప్రసిద్ధ సంస్కృతకవి మయూరుడి సూర్యశతకం కూడ ఇక్కడ ఇస్తున్నాం.
ఇంటర్నెట్ వల్ల కలిగిన ఒక గొప్ప పరిణామం ఒక సారి అక్కడ వుంచిన వాటికి శాశ్వతత్వం కలిగించటం. పుస్తకాలు వస్తాయి, పోతాయి. ఇంటర్నెట్ మీద వుంచినవి ఎక్కడో ఒకచోట ఎప్పటికీ నిలిచి వుంటాయి. ఈ సత్యం గుర్తించిన ఎన్నో భాషల వారు ఇంటర్నెట్ ను వాళ్ళ భాషల అభివృద్ధికి ఎంతగానో వాడుకుంటున్నారు. మనం కూడ త్వరలోనే మన జడత్వానికి తాత్కాలికంగా నైనా కొంచెం విశ్రాంతి యిచ్చి ఆ దారిలో నడవగలమని ఆశిద్దాం.
“కొందరు పబ్లిసిటీ కోసం సాధన చేసి దాన్ని సంపాదించుకుంటారు. నా వంటివాళ్ళు సంగీతాన్ని సాధించే ప్రయత్నంలోనే మునిగితేలుతూంటారు. నాకు పబ్లిసిటీ అంతగా రాకపోవడంలో ఆశ్చర్యం […]
(ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీనికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆముక్తమాల్యద శృంగారప్రబంధం కాదు […]
చూడవలసిన పేషెంట్లంతా అయిపోయారు. ఇన్పేషెంట్లలో మళ్ళీ చూడవలసినవారెవరూ లేరు. తీసుకోవలసిన జాగ్రత్తలేవో తెలుసుకుని కాంపౌండరూ, నర్సూ గదులవైపు వెళ్ళిపోయారు. మరుసటిరోజు చేయవలసిన పనుల గురించి […]
“నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం వయొలెన్స్ జరక్కూడదు. ఎట్టి పరిస్థితుల్లోను మూడు నిముషాల కన్న ఎక్కువ పట్టకూడదు. మూడు నిమిషాల […]
వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచి గాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసగుసలాడతా […]
గడ్డి యంత్రాలు గీమని రొద పెడుతున్నాయి..అదే చప్పుడు..చెవులు దిబ్బెళ్ళు పడేలా ! తృళ్ళిపడి లేచాడు శ్రీధర్.బాటిల్లో నాలుగు గుటకల నీరు మిగిలివుంది. ఖాళీచేశాడు.తనను వెంబడించిన […]
“అక్కడ చాలా తమాషాగా వుంటుందని మాటిమాటికీ వూరించకపోతే అదేమిటో యిప్పుడే చెప్పెయ్యరాదూ?” అన్నాడు కిరణ్ విసుగ్గా. అరగంట నుంచి ప్రసాద్ “అదిగో, యిదిగో” నంటూ […]
ఓలమ్మీ! గాజులు పిన్నీసులు జడ కుచ్చులు లోలాకులు చాదుబొట్టు కొనుకుంతావా?! ఓలి పిల్లా! పొగడరు ముచ్చిబొట్లు సక్కబొట్లు రంగుబొట్లు స్నోముద్దలు సవరాములు చెంపపిన్లు కొనుకుంతావా?! […]
పాపను పడుకోబెట్టినపుడు తనపై పరుచుకున్న నిద్రని దుప్పటిలా తొలగించివచ్చి ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది. కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని కాసిని చన్నీళ్ళతో […]
గది కిటికీ నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది శూన్యంలోకి చూపుల వలలు విసిరి తెలియని దేనికోసమో వేట ప్రారంభిస్తుంది హృదయకవాటాలను తోసుకుంటూ జ్ఞాపకాల గాలివాన వస్తుంది గుండెగోడకు […]
ఎప్పుడో కరగి పోయిందనుకున్న కల మళ్ళా ఇప్పుడు తిరిగి వచ్చింది, వస్తూ వస్తూ అప్పటి అద్దాన్ని కూడా తెచ్చింది, తెస్తూ గుండె గోడలకి అతికించింది, […]
ఎప్పుడో తన రోజుల్లో వొక వెలుగు వెలిగిందే అప్పుడప్పుడూ తన మెరిసే జిలుగుల్ని ప్రదర్సించిందే పాముకుబుసం కాక పోయినా, పట్టు వస్త్రం కాక పోయినా […]
చిలుం పట్టిన కడ్డీ నైరాశ్యం ఆకుపచ్చని పాచిరాళ్ళ వైరాగ్యం గాల్లో కొట్టుకొచ్చే సోరుప్పు ఎండి చారలు కట్టిన చెక్కిళ్ళు రోజుకో గజం లోతు తగ్గే […]
టకరగాయికె కొండ దారిని ఇంకా ఎవరూ లేవకుండా ఒక బుద్ధుని గుడి ఉందనుకుని ఈ మెట్లన్నీ ఎక్కేక రెండు మూగ శిఖరాల మధ్యన ఇక్కడ […]
నేను ఈమధ్య స్వీడన్ వెళ్ళి అక్కడ కొద్ది వారాలపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు […]