టకరగాయికె కొండ దారిని
ఇంకా ఎవరూ లేవకుండా
ఒక బుద్ధుని గుడి ఉందనుకుని ఈ మెట్లన్నీ ఎక్కేక
రెండు మూగ శిఖరాల మధ్యన
ఇక్కడ ఏమీ లేదు.
నిటారుగా మచ్చల చెట్టు, ఎర్ర కంకర
ఒక పాత జాపనీస్ జండా
ఒకరికొకరు తెలియనట్లు ఈ టకరగాయికె శిఖరాలు
ఇంక ఏమీ ఒద్దు.
పేరు తెలియని చెరువు ఒడ్డున
ఒచ్చిన తోవ తప్పిపోయి
గొగ్గిపళ్ళ రోషి తో
ఖాళీ పడవలో ఎక్కి కూర్చుని
టకరగాయికె ప్రిన్స్ హోటల్
రూం నెంబర్ 613
ఆ ఒడ్డుకి.