తమాషా దేఖో 5

(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్‌ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్‌,
వినిపిస్తయ్‌. మనకున్న రచయితల్లో మొదటి వరసలో నిలబడే కనకప్రసాద్‌ ప్రత్యేక శైలికి, రచనాకౌశలానికి ఈ ధారావాహిక ఓ గొప్ప వాహిక.)

ఇంత క్రితం వచ్చిన భాగాల్ని చదవాలంటే ఇక్కడ నొక్కండి మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం, నాలుగో భాగం

(జరిగిన కథ వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న నాగేశ్వరిి, ఆమె భర్త గోపాలరావు, వాళ్ళ బావగారు రవణరావు గారింట్లో ఉంటారు.గోపాలరావు కి ఆంధ్రాలో “అసలైన మనుషుల” జీవితాన్ని కళ్ళారా గమనించాలని కోరిక. అలా కృష్ణతో డంగలా దగ్గరకి వెళ్తారు గోపాలరావు, అతనికి పరిచితుడైన రాఘవరావు. రాఘవరావు కవి కూడా. అక్కడ ఆంజనేయవిగ్రహం దగ్గర సిందూరం బొట్టు పెట్టుకోవాలంటాడు కృష్ణ. రాఘవరావుకి అది నచ్చదు.

వాళ్ళు డంగలాలో ఆదిబాబుని, జానీ ఎడ్విన్‌ ని, వాళ్ళ గురువు వస్తాదు అప్పలనారాయణనీ, కాకా హోటల్లో రుద్రమూర్తినీ కలుస్తారు. తరవాత క్రిష్ణతో బర్మాకోలనీలో సైటు మీదకి వెళ్తే అక్కడ ఎల్లమ్మ ఒక పాట పాడుతుంది. అక్కడ సన్యాసి రావుని కలిసేక శివాలయంలో ఆదివారం సాయంత్రాలు జరిగే మీటింగ్‌ గురించి తెలుస్తుంది. ఇక చదవండి.)

(మంగవేణి నడివయస్సు మనిషి. చెమటలు చీర చెంగుతో తుడుచుకొంటూ వచ్చి విమల పక్కగా కూర్చుంటుంది. సిష్టర్‌ అసింతా ఒక క్రిష్టియన్‌ నన్‌ . మళయాళం యాసతో తడబాటుగా తెలుగు మాట్లాడుతుంది. రుద్రమూర్తి వెళ్ళి గుడి మంటపం మెట్ల మీద కూర్చుంటాడు. గోపాల్‌, రాఘవ రుద్రమూర్తిని గుర్తు పట్టి ఆశ్చర్యంగా చూస్తారు.)

అసింతా కోడికి కాలుస్తన్నాయి అనుకున్నాం విమల. కోడలికి కాల్చెస్తాయి అనుకోలేదు! మేము ఎల్లే సరికి బాడీ అంతా ఇదంతా కాలిపోయిందీ (సౌంజ్ఞ చేసి చూపిస్తుంది)………

నర స్టేట్మెంటిచ్చిందా లేదా?

మంగ (తల అడ్డంగా తిప్పి) ప్చ్‌! ఎంత బతిమాలినా స్టేట్‌ మెంటివ్వలేదు. థర్డ్‌ డిగ్రీ బర్న్స్‌…..బాగా భయపడిపోయింది. యూజువల్‌ గా అంతేలే! నోరిప్పరు. ఏడుస్తారు……నోరిప్పకుండా……(వెంకటేశ్వర్లుని చూసి) రేపు మీరెళ్తారా మేంగూడ రావాలా?

వెంక మంచిదానివే నువ్వు రాకుండా ఎలాగ? గట్టిగా మాటాడ్డానికి నువ్వూ విమలా రావల్సిందే. రాతలకే నేనూ నరిసిమ్మూర్తీ! కూతలకి పనికిరాఁవు.

జానీ ఈల నోటికి దడిసేనా మెజిస్ట్రేట్‌ దెబ్బకొప్పుకుంటాడు…….

విమ అన్రా అను! నీది ధనియాల జాతి. మర్యాదగా చెప్తే నువ్వు వింటావా….?

జానీ తల్లీ! (దండం పెట్టినట్లు ఏక్షన్‌ చేస్తాడు.)

వెంక మళ్ళీ తెల్లార్తూనే లేచి వెళ్ళాలి…నెక్స్ట్‌ వీక్‌ హియరింగులున్నాయి…….

రాఘ ఎక్కడికండి రేపు…?

వెంక ఒక్కాడికి కాదండి. ఇదుగో…..నా ‘టు డూ’ల బుక్కు (జేబులోంచి డైరీలాంటి పుస్తకం తీసి చూపిస్తాడు) ఈ లిష్ట్‌ లో విలేజిలన్నిట్లో పబ్లిక్‌ హియరింగ్సున్నాయి. లెడ్‌ స్మెల్టర్నుండి పికిల్‌ లిక్కర్‌ వేస్టు డైరెక్టుగా వాళ్ళ నూతుల్లోకి చెరువులోకీ ఒదుల్తున్నారు. కలక్టర్‌ టెక్నికల్‌ ఎసెస్మెంటు కోసం మమ్మల్ని రమ్మన్నాడు.

రాఘ (గోపాల్‌ తో) బైటికొచ్చి వాటర్‌ తాగాలంటే భయం. బాటిల్డ్‌ వాటర్‌ బెష్టు.

చెట్ల బోటిల్‌ పన్నెండ్రూపాయిలండీ! ఈ విలేజిలన్నిట్లో బోటిల్డ్‌ వాటరు కొనుక్కునీ శక్తిలేని జనాలందరికీ కళ్ళజబ్బో ఎముకల వంకరో మిస్‌ కేరేజిలో ఏదో ఓ రోగం….పన్లకి పోలేరు. పన్లకెళ్తే గాని తిండికి టికాణా లేదు! రెండేళ్ళబట్టి పిటిషన్లు పెట్టీ పెట్టీ ధర్నాలు చేసీ చేసీ మొత్తుకుంటే చివరికి ఇప్పటికి ఆల్‌ పార్టీ పబ్లిక్‌ హియరింగ్‌ కి ఒప్పుకున్నారు.

జానీ అదంతా బైటికి సెట్టింగు. ఎన్ని ఆందోళన్లు చేస్తే మాత్రం లెడ్‌ స్మెల్టర్‌ అక్కణ్ణించి ఎత్తెస్తారా?

వెంక స్మెల్టర్‌ ఎత్తీమనలేదు. ఇంక ఫర్దర్‌ పొల్యూషన్‌ లేకుండా చెయ్యండి నష్ట పరిహారాలివ్వండి అని మొత్తుకుంటున్నారు. వాళ్ళందరూ ఉద్యోగాలకీ పన్లకీ పోవాలి. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా రిటారైపోయి నేనున్నాను కదూ. అందుకే ఈ హియరింగులన్నీ నా పీక్కే……

గోపా మీకు స్టాఫ్‌ ఎవరూ లేరా?

వెంక టెక్నికల్‌ స్టాఫ్‌ నేనొక్కడ్నేనండీ. మా అసిస్టెంటు పెళ్ళై బహరెయిన్‌ వెళిపోయింది. ఈ కేసు గెలవకపోతే వాళ్ళింక ఊళ్ళు ఖాళీ చేసి పోవాలి తప్ప మరే గత్యంతరం లేదు. గెలవాలంటే పాపం ఆ లాయరు ఎంత ఫ్రీగా వాదించినా టెక్నికల్‌ ఇన్‌ ఫర్మేషనంతా నేనూ విమలా మంగవేణీ మేఁవే నోట్స్‌ రాసి ఇవ్వాలి…మధ్యలో ఏవో ఒక ఇంటరెప్షన్స్‌….కిందటి నెల్లో సబ్మిట్‌ చెయ్య వల్సిన ఈఐయే ఇది…మరి కిందటి నెలంతా పెట్రోలు కంపెనీ తగలబడిపోయిన గొడవలు…

గోపా ఏఁవైందీ?

రవి అయ్యో మీకు తెలీదా? పెట్రోలు కంపెనీ టేంకులు పేలిపోయి చాలా పెద్దేక్సిడెంట్‌ అయిపోయింది…..జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎక్కడికి పోవాలో తెలీక ఒచ్చి మేషారింటిమీద పడ్డారు….

రాఘ పేపర్లలో చదివేఁవండీ…

వెంక ఎటు పోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలీక ఒచ్చి మా ఇంటి మీద పడ్డారండి…..అప్పటికే టేంకుల దగ్గిర మంటల్లో పోయిన వాళ్ళు పోయేరు…..విష వాయువులు పీల్చి ఇంకా మంది చచ్చిపోతారని కోలనీలక్కోలనీలే ఖాళీ చేయించేరు…..ఊళ్ళో ఉంటే చచ్చిపోతారు పారిపోమని మైకుల్లో అరిపించి చేతులు దులుపుకున్నారు….

చెట్ల ఇలాగవుతుందని వాళ్ళు మాత్రం కల గన్నారా….

వెంక అలాక్కాదు! ఏ ప్రమాదం రానంత కాలం మనం ఎంత మొత్తుకు చచ్చినా ఎవడికీ పట్టదు!

రాఘ ఇలాంటి అబ్జర్వేషన్స్‌ అన్నీ ఆర్టికిల్స్‌ రాయించి ఒక వాల్యూమ్‌ గా తీసుకొస్తే బావుంటుందన్నారు మా మాఁవ గారు……..Another Disaster – Another Bhopal? అని….

గోపా చెయ్యొచ్చనుకో! అసలు ముందు like-minded people అంతా ఒక చోటికొచ్చి ఈ విషయాల మీద సీరియస్‌ గా డిస్కస్‌ చెయ్యాలి.

రాఘ I completely agree! There has to be a serious discussion of the issues and their socio-political ramifications in a sustained and methodical fashion….

వెంక (నిరాశగా అంటాడు) డిస్కషన్స్‌ కి ఏం లోటు లేదండి. మీ అమెరికా వాళ్ళే ఎవరో జీటీవీ వాళ్ళతో కలిసి హరిత మిత్ర ఎవార్స్డ్‌ అని సభలు చేస్తున్నారు. రమ్మన్నారు నాకు తీరుబాటు లేదు……

జానీ అవునండి. కోకోకోలావోడు స్పాన్సర్‌ చేసేడు. ఎన్విరానమెంటల్‌ ప్రొటక్షన్‌ మీద నేషనల్‌ లెవిల్లో గెష్టుల్ని రప్పించి లెక్చర్స్‌ ఇప్పిస్తనారు……

చెట్ల మీటింగులు ఎన్నని పెడతాఁవండీ వెధవ్మీటింగులు ప్రాణాలు విసుగేస్తునాయి. ప్రతిదానికీ మాటాడితే ముందు యూనివర్శిటీలో ఓ మీటింగు తియ్యడం, అందరు చెప్పిన మాటలూ ఒక సూవనీరో వైట్‌ పేపరో వెయ్యటం. మళ్ళీ ఎవడి గొడవ్వాడిదే! ఎన్విరానమెంటల్‌ ప్రోబ్లమ్స్‌ మీద పోవర్టీ మీద పాపులేషను మీద ఎయిడ్స్‌ మీద వల్లకాడుమీద వసిరిదిబ్బ మీదా తెల్లార్లేస్తే రెండు పుంజీల సభలూ సదస్సులూ వరల్డ్‌ బేంకి దెగ్గిర్నుంచీ ఫోర్డు ఫౌండేషను దెగ్గిర్నుంచీ గ్రేంట్స్‌ తెచ్చి మరీ పెడుతున్నారు…… ఎన్విరాన్‌ మెంటు మీద ఈ ఏడాది ఈ ఊళ్ళోనే మీరు లెక్ఖపెడితే పద్ధాలుగు సభలు జరిగేయి. ఒక్క దాలిగుంటయినా క్లీన్‌ చేసేరేమో ఇదుగో ఈ వెంకటేశ్వర్లు నడగండి.

వెంక మొదట్లో నేనూ చాలా మాట్లాడేవాణ్ణండి…పుస్తకాలు కూడా రాసేను. సభల్లో ఎంతసేపూ మాటలూ, పుస్తకాలూ……ఇంతే!

రాఘ అలాక్కాదండి. At the end of the conference… ఏక్షన్‌ కమిటీ అని ఒకటి ఫార్మ్‌ చెయ్యాలి….ఒక హండ్రడ్‌ తౌజండ్‌ డాలర్స్‌ కార్పస్‌ ఫండ్‌ గా ఫార్మ్‌ చేసి………

జానీ (మాటకి అడ్డం పడి) ప్రతీ సదస్సు చివరా ఏక్షన్‌ కమిటీలు ఏస్తారండి. ఏక్షన్‌ కమిటీల మీద జోకు మీకు తెలీదా?

రాఘ ఏంటి జానీ?

జానీ మీటింగులు పెట్టినందుకు ఏదో ఒకటి చేసి చూపించినట్టుగ ఉండాలని చివర్లో అందరూ కలిసి పని చేసినట్టుగ ‘ఏక్షన్‌’ చేస్తారు…..That is why it is called an Action Committee….

నర వెంటనే ఏదో అవుతుందని కాదురా. It is a symbolic gesture…. అంతే!

రవి సింబల్సే మిగుల్తాయి……We’re too caught up in symbols. కొత్త కొత్త సంఘాలూ…..కొత్త కొత్త సదస్సులు……They provide great entertainment though….!

విమ ఏయ్‌.. సదస్సంటే గుర్తొచ్చింది సండే ఆంధ్రజ్యోతి చూశావా?….అలింగోద్యమ సదస్సులో గాయత్రీ స్టేట్‌ మెంటిచ్చింది? అలింగోద్యమ చైతన్యానికీ అలింగ కవితకీ పయొనీర్‌ తనేనంట. “అసలు agenderization అనే పదానికి అలింగీకరణ అని తెలుగులో మొదటి సారిగా కాయిన్‌ చేసింది నేను!” అందంట?!

జానీ ఊఁ! క్రిమో గాడూ నేనూ ఎళ్ళేఁవు. చాలా అగ్గీ ఫోర్‌ మీదున్నాది. ” నాకు అన్యాయం చేసినా పరవాలేదు కాని నా కవితకి అన్యాయం చెయ్యొద్దని జాతిని కళ్ళ నీళ్ళతో హెచ్చరిస్తున్నాను” అంది.

విమ ఇది చూడు…..(పేపర్‌ తీసి చదువుతూ)
” త్రిలింగ సీమన
అలింగ భావన
తెగించి లేవోయ్‌ చెల్లెల
నడుమూ
బిగించి రావే తమ్ముడ తమ్ముడ!
అనే కవిత తను 1989 లోనే ప్రచురించిందంట! లేవోయ్‌ చెల్లెల రావే తమ్ముడ అంటూ జెండర్‌ వ్యవస్థ మీద పడ్డ మొట్ట మొదటి ఎజెండరైజ్డ్‌ సమ్మెట దెబ్బగా ఈ కవితని విమర్శకులూ పరిశోధకులూ అందరూ ఒప్పుకున్నదే కదా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుగు కవిత్వంలో తన స్థానాన్ని గురించి మాట్లాడే రివిజనిష్టు ధోరణుల్ని చూస్తే జాలేస్తుంది. చారిత్రక సత్యాల్ని విస్మరిస్తే ఎట్లా?” అని. అలింగోద్యమం తన ప్రైవేట్‌ సొత్తా?! మరి ఇవతలోళ్ళమంతా ఏమైపోవాలి…..

మంగ అసలు మన మీటింగుల్ని బాగు చేసుకోడానికే ముందొక ఉద్యమం తేవాలి! (రాఘవతో) మా మీటింగే ఒక్కోసారి ఫార్స్‌ లా అనిపిస్తుంది. ఎప్పుడూ ఇదుగో మేం ఆరుగురమే……ఎప్పుడేనా ఎవరేనా మీలాగ క్యూరియాసిటీ కొద్దీ వచ్చి కూర్చోనెళ్తారు. మాలో మేఁవే ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా ఏం జరుగుతుందని…… అంతా గందరగోళంగా ఉంటాది ఒక్కోసారి.

జానీ మన ‘నోటెడ్‌ ఎన్విరానమెంటలిష్టు’ గారికి హరిత మిత్రా2000 అని బిరుదిచ్చి శాలువా ఏస్తనారంట……

రాఘ (ఆసక్తిగా) ఎవరెవరు?

జానీ ఆయన అసలు పేరేటో కూడా ఎవరికీ తెలీదండి. రోజూ ఏదో ఒక పేపర్లోనో టీవీ ఛానల్లోనో నోటెడ్‌ ఎన్విరానమెంటలిష్టు ఇలాగన్నాడు అలాగన్నాడు అని స్టేట్‌ మెంట్లొస్తాయి…….

అసింతా (ఆశ్చర్యంగా నవ్వుతుంది) అవను! అవురు ఎరుకానమే! అందరూ నోటెడ్‌ ఎన్విరానమెంటలిష్ట్‌ అంటాయి….

నర పోన్లేరా! నువ్వు కుర్రాడివి నీకు తెలీదు గానీ….It could be a lot worse. I’ve covered a world war…. చిన్న చిన్న విషయాలకే డిస్కరేజ్‌ అవుతావు. Human endeavor is a very inefficient process…. అదైనా చేస్తునాడు కదా! The important thing is never to give up….

రుద్ర (నరసిమ్మూర్తితో) ఒరే నరిసీ! నీ కుచ్చుటప్పాలు తరవాత కొట్టుకో! నాకు ఆకలి దంచుకుంటోంది…..(నరిసిమ్మూర్తి మాటల్లో ఉండి వినిపించుకోడు.)

విమ అమెరికన్‌ సంస్కృతే అంత! యాంత్రిక జీవిత విధానంలో మిగిలిన సామ్రాజ్య వాద సంస్కృతి అవశేషాలు…

రాఘ ఏంటండీ మీకు మేం సామ్రాజ్యవాదుల్లా కనిపిస్తున్నాఁవా?

గోపా Its a popular stereotype… (విమలతో) మాది యాంత్రిక జీవితం అని మీకెవరు చెప్పేరు…..We’re just like you. We would like to help if we can…..

విమ సారీ మిమ్మల్ని అనాల్ని అన్లేదు. In general అమెరికన్‌ సామ్రాజ్యవాద వలస ధోరణుల్ని నిరసించటం మేధావులమైన మన కనీస బాధ్యత. కాదంటారా….

గోపా నేనూ ఇక్కడున్నప్పుడు అలాగే అనుకునే వాడ్ని. But it isn’t that simple. అమెరికాని అమెరికన్లని చూసి నేర్చుకోవల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. They are a hard-working lot. And its a country of laws. ఏ ముక్కూ మొహం తెలీని వేరే జాతి మనుషుల్నయినా ఆదరించి వాళ్ళలో కలుపుకుంటారు. ఎందులో ఎన్ని flaws ఉన్నా పన్ల దగ్గరికి వచ్చినప్పుడు their focus is always on what is possible, what they can do together, in spite of all thier faults and foibles. అందుకే అంత యంగ్‌ నేషన్‌ అయినా అన్ని రకాలుగా డెవలప్‌ అయ్యేరు. They are well-off for a good reason. అమెరికాని experience చెయ్యకుండా అమెరికా గురించి మీరు ఏం మాట్లాడినా shallowగా ఉంటుంది…..just like anything else…..

విమ ఇక్కడ లేరా శ్రమజీవులు. ఇక్కడ పడే కష్టం కష్టం కాదా?

గోపా ఎందుక్కాదు. చెప్పేను కదా its a land of laws. వాళ్ళ చట్టాల మీద వాళ్ళకి ఉన్న గౌరవం కట్టుబాటు మనకి లేవు. మనకి ప్రతీ దానికీ అడ్డుతోవలు. అందుకే ఇక్కడ ఎంత కష్టపడినా కష్ట పడ్డవాడికి ఫలితం దక్కదు……..

వెంక ఇదుగో విమలా! కబుర్లు కాదు….బ్లూప్రింట్లు తెచ్చేవా?

విమ మీ బేగులో పేట్టుకుని నన్నడుగుతారేంటి. Absent-minded professor…

వెంక (గోపాల్‌ కి రాఘవకి బ్లూ ప్రింట్‌ తీసి చూపిస్తాడు) ఇదుగోటండీ చుట్టూ కొండలు మధ్యలో ఇక్కడ పేలేయి టేంకర్లు…దగ్గిర దగ్గిర లక్ష మంది జనాల్ని లారీల్దొరికితే లారీలు బస్సుల్దొరికితే బస్సులు రిక్షాలు ఎడ్ల బళ్ళు చివరికి మునస్పాల్టీ చెత్తల్లారీల్లో కూడా జనాల్నెక్కించి పంపించేఁవు మాకెవరికీ నిద్దర్లు లేవు….

మంగ వెంకటేశ్వర్లు గారయితే అనకూడదు గానీ ఈయన ఉంటాడా పోతాడా అనుకున్నాఁవు….

రవి ఎందుకు మేషారు ఇంత ప్రయాస పడతారు. మీకు హార్ట్‌ కంప్లైంటు కూడాను….

మంగ చూళ్ళేక రవీ. అంతే!

వెంక తనన్నది నిజఁవేరా! ఒకల కోసం అని కాదు. ఏదో జరుగుతుందనీ కాదూ….చూళ్ళేక. చూస్తూ చూస్తూ ఊరుకో లేక! ఏ దిక్కూ లేని ఆడమనుషుల్ని మంగా వాళ్ళ ఇంటిముందు తెచ్చి పడీసి పోతారు చూసేవు కదా? ఆయమ్మాయి పట్టించుకుంటాది కాబట్టి………….జనఁవొచ్చి ప్రాణ భయంతోటి పరిగెట్టుకొచ్చి మా ఇంటిమీద పడి ఎటు పారిపోమంటారు మేషారూ అంటే అదుగో అలా ఎగెయినిస్ట్‌ ది విండ్‌ డైరెక్షన్‌ పారిపోండి అన్నాను. నన్నూ ఇంట్లోంచి లాక్కుపోయేరు…ఆ హడావుడికి కాదులే….నాకు రావల్సుండి హార్టెటాకొచ్చింది. (గుళ్ళోకి చూపించి) అదుగో! ఆయను దయ…..!

చెట్ల అన్ని పన్లూ మీ ఒక్క నెత్తిమీదే వేసుకుంటారు…(రవితో) మీ మేష్ట్రుకి డెలిగేట్‌ చెయ్యతం బొత్తిగా చాత కాదు… ప్రతీ దానికీ తనే బైల్దేరుతాడు….

వెంక వేసుకుంటారంటే నాకు మాత్రం సరదా ఏటండీ…..ముఖ్యఁవయిన హియరింగులకే నేనొస్తాను మిగితావి స్టూడెంట్స్‌ ని చూసుకోమని పంపించినా ……ఎంత చేసినా ఇంకా ఎవరో ఒకరు ఒస్తుంటారు..ఏదో ఒకటి ఎటెండవాలి…..

రుద్ర (మళ్ళీ గట్టిగా) నరిసింహా! ఆకలి…!

నర (మంగవేణితో ఆలోచనగా) ఈమధ్యేంటి ఇలా మాటాడుతున్నావు? ఫార్సా? No No! మనం అనుకోడంలో ఉన్నాది……(రుద్రమూర్తిని అప్పుడు పట్టించుకుని) ఊఁ?

రుద్ర ఏం అనుక్కోకురా ఏదో ఒకటి అనుక్కోవాలా? నాకు ఆకలేస్తుంది.

నర ఏఁవీ అనుక్కోకపోడానికి నీలాగ రాయిని కాను. ఆకలేస్తే ఇవుగో తాళాలు…రూంకెళ్ళి తిని పడుక్కో.

రుద్ర నన్ను ఎనిమిది గంటలకల్లా రమ్మన్నావంది ఆ పిల్ల?

నర అన్నాను సారీ. అన్ని పన్లూ లేటయిపోయేయి……నీకు తొందరైతే రూముకెళిపో?!

రుద్ర No, I’ll hang around.

వెంక నేను వెళ్ళి పడుకుంటాను. మదీనా గారు తెల్లారి ఐదుకి జీప్‌ పంపిస్తాడు. లేటు చెయ్యకుండా రండి. (లేచి నిల్చుంటాడు) అబ్బా…నడుం పట్టీసింది! (చెట్ల పంతులుతో) మీలాగ చెట్లు పాతడం గొప్పుల్తవ్వడం అయితే బంగార్లాగుంటాది…….ఎందుకీ ఎదవ కోర్టు గొడవ…

చెట్ల (బీడీ వెలిగించి దమ్ము కొడుతూ) నువ్వు పెద్దింజినీరువీ! నీ పని నాకు చేతకాదు. కుక్క పని కుక్కే చెయ్యాలి గాడిద పని గాడిదే చెయ్యాలి. ఏవండి రుద్రా గారు తప్మాటన్నానా?

రుద్ర (కొబ్బరి ముక్క గీక్కుని తింటూ) కుక్కల గురించీ గాడిదల గురించీ మనకేం తెలీదు చెట్ల పంతులూ. అదుగో that man said we have a lot to learn from America….of all countries?……I’m not so sure about that but….. కుక్కలూ గాడిదలూ పిల్లులూ…..now thats a different matter altogerher! Thinkers and poets like Ravi sure can learn a lot from dogs and cats……

జానీ రచయితలూ ఆర్త్ల్టిసంటే మీకేటండీ రుద్రా గారూ అంత రంజకం లాగుంటాది?

నర (నెత్తి మీద కొట్టుకుని) వాడికి పొయెట్రీ, మ్యూజిక్కూ ఆర్టూ ఏ వల్లకాడూ అక్ఖల్లేదు…..

రుద్ర What art? ఇంక విలువైనవి ఏవీ లేకపోతే then you fashion yourself to be an art freak….and you always look for clever ways to capture the experience through your craft…which corrupts the experience itself… (రవిని చూపించి) వాడితో అదే అన్నాను. నువ్వు కవివైతే నువ్వు రాయవల్సిన కవిత ఏదో రాసి why can’t you just shut up… ఆ పని చాలా కష్టం. And this is no art, I am sorry. It is acquired taste that tells you that Beethoven’s Ninth Symphony is more beautiful than a chorus of cats screaming; both produce equally valid sensations.

నర వాడికి నచ్చిందొకటుందిలే…బాత్రూంలో పాడుతుంటాడు…

రుద్ర (excited) Do you know that….. మనదీ ఒక బతుకేనా కుక్కల వలె నక్కలవలె?

రవి మనదీ ఒక బతుకేనా
కుక్కల వలె నక్కలవలె
మనదీ ఒక బతుకేనా
సందులలో పందుల వలె….

రుద్ర అదీ… Can you live like a dog or a pig? Did you ever try that, even for a day? ఆ మంగ చూడు రోజుకో డౌరీ బర్నింగ్‌ కేసు తెస్తుంది. చదువుకున్న మొగుడూ అత్తగారూ చదువుకున్న పిల్ల మీదే కిరసనాయిలు పోసి కాల్చెస్తారు చూసేవా? Man is the most vicious species on earth. No other animal so wantonly kills its own kind. What makes you so sure that dogs and pigs are inferior to you? నన్నడిగితే ఆ పద్యం మళ్ళీ తిరగరాసుకోమంటాను…..When you know how blessed a dog’s life is, then –
మనదిరా బతుకంటే
కుక్కల వలె నక్కలవలె
బతుకంటే మనదేరా
సందులలో పందుల వలె…. అని.
(రవికేసి తిరిగి) రవి కుమార్‌ ! Do you know what’s different between Man and a pig? Unlike Man, a pig can never be a lofty thinker….. (అందరూ నవ్వుతారు.) Perhaps thats why some pigs don’t burn their daughters-in-law for dowry while the rest of them form a foundation, release volumes of poetry about it, sing sorry songs and pat each other on how ‘human’ they are! ఊఁ…?

నర నువ్వెందుకురా ఇందులోకి? మా తంటాలేవో మేం పడతాం నువ్వూరికే ఉండకూడదా? There is tragedy all around. Some create problems and some of us want to help…….. ఒక విషయం చెప్మన్నారా? ఎవర్నీ ఏం అనీ లాభం లేదు. అదుగో మా రుద్రా అంటాడు కదా……Mind is a strange thing! (నవ్వుతాడు) ముప్ఫయ్యేళ్ళు జర్నలిజం చేసి ఒక్కటే నేర్చుకున్నాను. ఎవర్నీ ఏం అనీ లాభం లేదు! పదిహేడేళ్ళు పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌ కవర్‌ చేసేను. అన్ని పార్టీలు అంతమంది లీడర్స్‌ నాకు తెలుసు. ఊఁ? If you lived as long as I did, you will find out that giving up is not an option…

వెంక అన్నేళ్ళు పొలిటికల్‌ కరస్పాండెంట్‌ గా చేసీ ఇంకా మీరు ఇలా మాట్లాడతన్నారంటే మీకు తెల్లార్లెగిసి దండం పెట్టాలి. చాలామందికి అన్నిటి మీదా నమ్మకం పోతుంది….ఫ్రెండ్సని నమ్మినవాళ్ళే చూడండి. స్పూరియస్‌ డేటా కుకప్‌ చేసి గెల్చుకున్నారు. అది తప్పంటే యూనివర్శిటీలో స్టూడెంట్స్‌ చేత నాకు కేష్ట్‌ ప్రెజుడిస్‌ అని నా మీద దొంగ కేసులు బనాయించేరు…….

నర నువ్వు కేసులకి దడుస్తావా వెంకటేశ్వర్లూ! Everybody denounces the system…..but what alternative do we have? ఒక సారి తమిళనాడు సీఏం ఒకడు నేను నెగిటివ్‌ గా ఏదో రాసేనని నన్ను The pig that came through the Khyber Pass అని పబ్లిగ్గా తిట్టి, కాళ్ళూ చేతులూ విరిచెస్తాఁవని బెదిరించేడు….ఆ తరవాత త్రీ మంత్స్‌ కి సింగిల్‌ విండో పోలసీ డెసిషన్స్‌ మీద అతనికి ఫేవరబుల్‌ గా రాస్తే అది చదివి పీయెం అతన్ని కాల్‌ చేసి కంగ్రాట్యులేట్‌ చేసింది….It saved his post at that time! మా ఇంటికొచ్చి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇప్పటికీ పలకరించి దండం పెడతాడు. I’ve made a decision not to be negative about people or situations, it just doesn’t help anything. In stead, I play up the positive. Everybody has an opportunity to do some good if they really want to…..and everybody likes a compliment…. అందుకే మునస్పాల్టీ ఎద్దులాగ రాయటం నా డ్యూటీ అనుకుని రాసుకుపోతాను…..

మంగ మీరలాగ ఎంకరేజ్‌ చేస్తారు గాని నరిసింమ్మూర్తి గారు….! పుస్తకాలు పేంప్లెట్లు ఏసేసి మాకూ చేతులు నొప్పెడతనాయి. ఒక్కోసారి మనలో మనఁవే పుస్తకాలు రాసుకుని అచ్చేసుకుంటామా ఇదంతా ఒక ఫార్సా అనిపిస్తుంది.

నర మళ్ళీ అదే మాటా? లేదులే! నువ్వు ఒక ఎస్సేవో పాటో పుస్తకఁవో ఏదో ఒకటి రాసేవనుకో! అది నువ్వు నిజంగా ఎందుకు రాస్తునావూ అన్నది నీకు ఎప్పటికీ తెలీదు. ఏం…? అలాగే దాన్ని ఎవరు ఎప్పుడు చదివి ఎలాగ ఇన్ఫ్లుయెన్స్‌ అవుతారన్నదీ నీకూ ఎవరికీ ఎప్పటికీ తెలీదు. మనం ఓదానిమీద రాస్తే అది మర్నాడే టపీ మని సాల్వయిపోతుందని కాదు. అందుకోసం కాదు….ఎందుకోసం అని అడగటం మంచిదేలే కానీ ఇందుకోసం అని నీకు ఎప్పటికీ తెలీదు. కానీ….Scripta Manent అని విన్నావా? The written word stays!(జ్ఞాపకం చేసుకుంటాడు) నా సర్వీసు కొత్తల్లో…. one of the first assaults on a Harijan woman in independent India occurred in Andhrapradesh… I went there to report on it.. ఆవిడ్ని గుడ్డలూడదీసి రోడ్డు మీద జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కొట్టేరు…..(నొప్పిగా అంటాడు)….they beat her to near death.. ఊఁ….I wrote a series of reports on it…..and that shook the entire parliament for three days in a row. Punditjee was moved to tears….. ఫార్సనుకుంటే ఫార్సూ నిజఁవనుకుంటే నిజం. మనం అనుకోడంలో ఉన్నాది.

గోపా Thats an amazing attitude.. చెప్పటం తేలికే గానీ…. How do you-

నర అదుగో రుద్రమూర్తిని చూసి నేర్చుకున్నాను….That man knows no conflict. But… వాడు చెప్పినా ఏం ప్రయోజనం లేదు….

రుద్ర Thats right! I am a useless guy. I am not in conflict with this terrible world, all the messes you have created with your cunning ideas, debates and ACTION in the first place, and now so nobly want to clean up….

నర నువ్వాట్టే మాటాడకు…..

రుద్ర నీ కబుర్లు వింటానికి రాలేదు. నన్ను డిన్నరుకి రమ్మన్నావు రా!

నర ఉండొఖ్ఖ పది నిమషాలు, బాబ్బాబూ!

పూజారి (రుద్రమూర్తి దగ్గరికొచ్చి) బాబూ! ఆకలన్నారు? చక్రపొంగలున్నాది ఇమ్మన్నారా….

రుద్ర ఇవ్వండివ్వండి మహా ప్రసాదం… ఆండవనే! (గాల్లోకి దండం పెడతాడు).

(పూజారి ఇత్తడి గిన్నెలో చక్రపొంగలి, ఆకులు తెచ్చి రుద్రమూర్తి పక్కన పెడతాడు.)

రుద్ర (ఆకుల్లో వడ్డించి, దగ్గరగా ఉన్న రాఘవతో, గోపాల్తో) Here…you want some?

రాఘ (తిరస్కారంగా చెయ్యూపి) No…No thanks!

రుద్ర (ప్రసాదం ఆత్రంగా తింటూ) I forgot! You have no God!

రాఘ Thats right! We don’t worship that stuff. What about you….? Are you a god-man??

రుద్ర god-damn? No…I’m not. My God is dead too! But unlike you, I have no mind to worship.

గోపా ఆయనతో నీకెందుకు రాఘవా పెద్దాయన….ఒదిలెయ్‌ !

రాఘ నేనేం చేసేను? అతనే చూడు……

రుద్ర ఊఁ…..(ఆకు నాకుతూ పారెయ్యడానికి లేచి) Mind is all you have left for worship… (మళ్ళీ వచ్చి కూర్చుంటాడు.)

రవి (ఆలోచనగా) Mind and its contents…..??

రుద్ర (స్థిరంగా అంటాడు) Mind itself is its contents!

రాఘ (కోపంగా) ఇదంతా మీకు ఏం పట్టదా? We are discussing about poverty and environmental degradation here…….! We want to be a part of the solution. (ఆవేశంగా) మంచికీ చెడ్డకీ, బీదరికానికీ ధనిక స్వామ్యానికీ జరిగే ఈ పోరాటంలో మీరెటు వైపు?

రుద్ర Yeah right! Do-gooder’s high! That’s the most potent of all pleasures…Gives you something to talk about and entertain yourselves, doesn’t it?

నర రుద్రా! That’s a very cynical thing to say….

రుద్ర నాకు మంచీ చెడ్డా లేవు. That’s your game….A cynic is someone who has his feet firmly planted on the ground.

రాఘ మంచీ చెడ్డా ఏంటి….కనీసం మర్యాద లేదు. ఆ చెప్పేదేదో వినయంగా, సౌజన్యంతో చెప్పొచ్చు…….

రుద్ర వినయం కోటు తొడుక్కున్నట్టు తొడుక్కుంటారు….Humility is an art that one practices. There is no such thing as humility. As long as you know, there is no humility. ఎన్విరాన్‌ మెంట్‌ అని పోవర్టీ అనీ ఈ కబుర్లన్నీ ఏఁవిటి? Nature gave you a bounty……You squander it away on the one hand and talk endlessly about it on the other!

రాఘ మాకిదేం సరదా అనుకుంటున్నారా? Is that what you think??

రుద్ర నాకేం తెలుసు? The plain fact is that if you don’t have a problem, you create one. If you don’t have a problem you don’t feel that you are living…Boredom is a bottomless pit.

గోపా మీరు పొరపాటు పడుతున్నారు సార్‌ ! రాఘవ….He is a selfless, guileless fellow!

రుద్ర రాఘవ రావు గురించే కాదండి. Just in the manner of speaking! You know….?! We never really listen to each other. We are always listening to ourselves. So you have no way of knowing what I really mean… ఒద్దు లెండి. I think we’ve had enough.. నరిసిగా! చాలింక రా!

(ఇంకా ఉంది)