రాగం: హేమవతి
తాళం: ఆది
గానం: శ్రీదేవి తుమ్మరకోటి, ప్రియ ఆనంద్, శ్రీవిద్య బదరీనారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
సాహిత్యం
పల్లవి:
అదీ ఇదీ వదలితే సదా
శివం శివం శివం శివం
శివం శివం శివం శివం
చరణం:
అనీ వినీ అలసితే అనా హతం
శివం శివం శివం
పదే పదే వెదికి ఆగితే
అహర్దివం శివం శివం |అదీ ఇదీ వదలితే|
శివం శివం శివం
పదే పదే వెదికి ఆగితే
అహర్దివం శివం శివం |అదీ ఇదీ వదలితే|
చరణం:
స్వకం పరం రెండు మరచితే
పరాత్పరం శివం శివం
తనేమిటో తరచి చూచితే
తనువే అనారతం ధృవం శివం |అదీ ఇదీ వదలితే|
పరాత్పరం శివం శివం
తనేమిటో తరచి చూచితే
తనువే అనారతం ధృవం శివం |అదీ ఇదీ వదలితే|
చరణం:
నక్తందివం ప్రతిపదం స్వయం
మనోహరం అనామకం త్వం అహం
యదోద్భవం శివం శివం
అదీ ఇదీ వదలితే సదా శివం |అదీ ఇదీ వదలితే|
మనోహరం అనామకం త్వం అహం
యదోద్భవం శివం శివం
అదీ ఇదీ వదలితే సదా శివం |అదీ ఇదీ వదలితే|