హృదయ కమలములను

రాగం: సింహేంద్రమధ్యమం
తాళం: రూపక
స్వర రచన, గానం: Dr. వసుంధర అయ్యంగార్
మృదంగం : కృష్ణ ప్రసాద్ మాడెహళ్ళి
రచన, స్వర కల్పన: కనకప్రసాద్

సాహిత్యం

పల్లవి:
హృదయ కమలములను ముకుళించి రహించిన పూజ
హృదయ కమలములను ముకుళించి రహించిన పూజ
హృదయ కమలములను ముకుళించి రహించిన పూజ మీ
పద సరోజములను నయన పంకజము లలర్చి రమణ యతి రాజ |2|
అ.పల్లవి:
నిరత రాగముల నీరాగ నతి రవళించి
స్వర కింజల్కముల తమి కెంజిగురు కెరలద్ది
పద పాదాబ్జముల ప్రణత కర పద్మముల కైమోడ్చి
శ్రుతులను మీ హృత్కైరవ శ్రవణము అనునాదమొనరించి
చరణం:
అహంత ధ్వాంత …
అహంత ధ్వాంత కాంతారముల కనుకట్టి మీ అడుగు తోవ
అనంత కరుణార్ద్ర క్రాంతి ఆస్వాంతమున శాంతి మహానుభావా

Meaning

This prayer is composed collecting our Heart lotuses,
and decorating Your Lotus Feet with our eye lotuses,
O Ramana, King of renunciates!

Ragas steeped in utmost devotion, and yet rendered
          as salutations to You in utter dispassion,
Shone upon floral filaments of Svaras, adorned with tender
           murmurings of our love for you,
Our hands folded like water lillies emplaced
           near your Lotus Feet, in surrender
With Sruthi in unison with the sound emanating
          from the white lotus of your Heart.

Amid the darkness of one’s own ego …
A path laid by Your Feet amidst the dark forest
           appearing out of one’s false sense of ego,
is verily peace within, brought forth
          by your infinite grace, O Great One.


For సుజాత, భాను ప్రసాద్ పిన్నమనేని