(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్ఆన్లైన్”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, ఈ వ్యాసంలో పరిశీలించిన కథలు ఇక్కడ “ఈమాట” లో ప్రచురించినందువల్లనూ, “నీహార్ఆన్లైన్”లో జరిగిన […]
నవంబర్ 2001
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
ఈ సంచిక సెప్టెంబర్ 1 న రావలసింది. కాని సాంకేతికసమస్యల వల్ల ఇప్పటిదాకా కుదర్లేదు. ఇకముందు ఇలాటి సమస్యలు రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీ జువ్వాడి రమణ గారు వారి సర్వర్ మీద మళ్ళీ “ఈమాట”కు నివాసం కలిగిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు.
ఇది “ఈమాట” మూడవ జన్మదిన సంచిక. ఇంతకాలం ఆదరించిన రచయిత్రు(త)లు, పాఠకులు ఇకముందు కూడ ఇతోధికంగా ఆదరిస్తారని మా ఆశ.
ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్ వారి పోటీల్లో గెలిచిన కవితలు-సూపర్ నోవా, అహం బ్రహ్మాస్మి, మెటమార్ఫసిస్, వ్యాసం –టెక్నాలజీ!కోవాడిస్ ఇస్తున్నాం. ఇందుకు ఉత్సాహంతో సహకరించిన శ్రీ చిట్టెన్ రాజు గారికి అభివాదాలు.
వచ్చే సంచిక నుంచి మరో కొత్త శీర్షిక ప్రవేశపెడుతున్నాం. “మనం మనం బరంపురం” అనే పేరుతో రాబోతోన్న ఈ శీర్షిక కోసం మీకెదురైన అనుభవాలను గురించిన “చిన్న చిన్నకథలు” ఆహ్వానిస్తున్నాం. ఈ చిన్న చిన్నకథలు ప్రింట్లో ఒక పేజీకి మించకుండా ఉండాలి. కొద్ది లైన్లైనా సరే ఓ కథనో అనుభవాన్నో చెప్పగలగటం ముఖ్యం. పెద్ద కథలు రాయటానికి సమయం దొరకని రచయిత్రు(త)లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని “ఈమాట” పాఠకులకు వారి నిర్మాణాత్మకతని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాం.
“ఈమాట” కు వచ్చే అన్ని రచనల్లాగే ఇవి కూడ review చెయ్యబడతాయి. Reviewers అంచనాల ఆధారంగా ప్రచురణ నిర్ణయాలు తీసుకోబడతాయి.
తెలుగు వెబ్సైట్లు పండిన తాటిపండ్లలా రాలుతోన్న ఈ పరిస్థితుల్లో “ఈమాట” నిలబడ్డమే కాదు, అభివృద్ధిని సాధించటానికి కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు, లేఖ సర్వర్ నిర్వాహకులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. “ఈమాట” కి ఎలాటి వ్యాపారదృష్టి లేదు, ఉండబోదు. కనుక ఈ మూడు వర్గాల వారు పాల్గొంటూ ప్రోత్సహిస్తున్నంత కాలం “ఈమాట”కు తిరుగుండదు. ఈ సందర్భంగా మరొక్కసారి రచయిత్రు(త)లకు తమతమ రచనావ్యాసంగాన్ని ఇంకా ఉత్సాహంతో కొనసాగిస్తూ “ఈమాట”లో ప్రచురణకు పంపవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాం.
కరెంటు తీగలకు అడ్డొచ్చానని కరుగ్గా నరికేశారు కొమ్మలని రంపం పెట్టి కోస్తుంటే కంపించింది వళ్ళంతా అడ్డొచ్చిన ప్రతిదాన్ని తొలగిస్తారా? గడ్డుకాలం దాపురించింది మీకు.
జుట్టును చెరుపుతుంది వర్షానికి ముందు గాలి ప్రియురాలు రంగురంగుల బంతులు పచ్చిక మీద పిల్లలు అలసిపోయారు. కుండీలో విరబూశాయి ఒకేరంగుపూలు బడిపిల్లలు ఎర్రని రోజాలను […]
కోల్పోవద్దు మరో అవకాశం రాకపోవచ్చు తిరిగి నీ కోసం.. మనసు విప్పి మాటాడడానికీ, ఒక మంచి మాటను చెప్పడానికీ, ప్రేమిస్తున్నానని తెలుపుతూ, ఒక సందేశం […]
ట్రంబుల్ స్టిక్నీ(Trumbull Stickney: 1874 – 1904) విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. క్రమశిక్షణ లో పెరిగాడు.హార్వర్డ్,పారిస్ లలో విద్యాభ్యాసం. సకల శాస్త్రాలను,సాహిత్యాలను పుక్కిటపట్టాడు. ప్రత్యేకించి […]
“అయినా లాభం లేదు. ఫ్లైట్ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు. ఇటు తిరిగి చూస్తే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతూ.. ఒక క్షణంసేపు […]
క్లుప్తంగా భవిష్యత్తులో కనుక్కోబడే టెక్నాలజీలు పొల్యూషన్ ని తీసేస్తాయనీ, మానవులకు అంతులేని ఎనర్జీ లభించేట్లు చేస్తాయనీ, ప్రకృతిని రక్షిస్తాయనీ, మనందరం కలలు కంటున్నాం. మన […]
మొహం పైకెత్తి ఆకాశంలోకి తేరిపార చూస్తూ వస్తున్న ఆంజనేయులును చూసి “నువ్వెంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నా మరీ అలా పైకి చూసి నడవక్కర్లా!” అన్నాడు […]
“టు మ్యారీ ఎ విడో ఆర్ నాట్ టు మ్యారీ?! దటీజ్ ది క్వశ్చన్! షేక్స్పియర్ పడ్డ అవస్థలో పడ్డాం!” ఇది గురజాడ వారి […]
అతన్ని పలుకరించాలంటే బిడియం అడ్డొచ్చింది. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం. తను చాలాసేపే ఎదురుచూసింది. కానీ అతనిలో ఏమీ కదలిక లేదు. […]
(శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆగష్ట్ 10న డెట్రాయిట్లో ఒక సభలో చేసిన ప్రసంగ వ్యాసమిది. శ్రీకాంతశర్మ గారు సంస్కృతాంధ్రాల్లో బాగా పరిచయం […]
సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను. పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను. తపస్వియు పరాక్రమవంతుండును […]
హృదయవాదీ మానవతావేదీ కథకుడైతే అతని కంట పడ్డ లోకరీతులూ, వెంటపడ్డ రాగద్వేషాల ఫణితులూ ఎలాటి రూపం పొంది, ఎటువంటి ఫలితాల్ని ఇస్తాయో ఈ “బొంబాయి […]
నడు, నడు తొందరగా. టైమై పోతోంది బాసుతో మీటింగుకి. ఇంకా కొన్ని రిజల్స్టు ప్రింట్ చెయ్యాలి. తొమ్మిదింటికల్లా .. ఆవిడ .. అబ్బా, పోట్లు […]
నిరాద్ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్ బాబు 1999లో, తన నూట […]
విస్ఫోటనమైతే మనకివాళ కనిపిస్తోందిగాని ఈ చుక్క పగిలి చాలా రోజులయ్యింది స్వర్గానికి అడ్డదారి వెతుకుతూ మనం కాగితప్పడవలెక్కినప్పుడే ఈ కుట్రకి వ్యూహరచన జరిగింది గాలిపటంలా […]
అప్పట్లో కళ్ళలో స్వప్న మాలికలు. గుండెలో భావుకత్వపు డోలికలు. బ్రతుకొక పాటగా క్షణమొక కవితగా కాలం కలస్వనోస్ఫాలిత సంగీతమై మాధ్వీక మాధుర్యమై సాగిపోయేది. ఎన్ని […]
ఆహా అనంతాల అరుగు పైకి ఆనందంగా ఎగిరిపోదామని విమానం ఎక్కిన రోజు రామన్నాయి కాబోలు ఊపిరీ, ఉదరం హోరుపెట్టి మరీ. మూయలేని చెవులలోంచి పారిపోదామని […]
చటుక్కున ముందుకుపోతూ కనపడని లక్ష్యాన్ని అందుకోవాలని తాపత్రయం అందరూ అందరికన్న ముందుకు పోవాలని! కొందరైన వెనక్కి తగ్గాలా!? అందుకే అందరు ఆగిపోయారు.
ఎగిరిన ప్రతిసారి క్షేమంగా దిగేవి విమానాలు కావు శాశ్వతంగా పట్టాలమీదే పయనించేవి రైళ్ళు కావు ఆహ్లాదం నుండి ఆనందం నుండి ప్రమాదం లోకి జారడానికి […]
ఎందరో వచ్చారు ఎందరో పోయారు. గుడి బయట ఏ మాత్రం వడలిపోని తామరపూలు సవ్వడి చేయకుండా నవ్వడం మానలేదు.