కాల సంబంధానికి ఒకసారి తిరిగి వెళ్ళినట్టయితే, ప్రాచీన సాహిత్యంలో అప్పటి కవుల దృక్పధం ఎలా ఉండేదంటే (అంటే అటు సంస్కృత సాహిత్యంలో కాని లేదా […]
మార్చి 2002
“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
“పాఠకుల అభిప్రాయాలు” శీర్షిక ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నది. దీన్ని ఉపయోగించుకుని ఎప్పటిలానే మీమీ అభిప్రాయాల్ని, సలహాల్ని అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం.
ఈ మధ్య అనుకోకుండా ఒక రసవత్తరమైన చర్చ మొదలైంది. దీని ముఖ్యాంశం “తెలుగు సాహిత్యరంగంలో అమెరికా ఆంధ్రులకీ ఇండియా ఆంధ్రులకీ ఉన్న, ఉండవలసిన, సంబంధం ఎలాటిది?” అనేది. ఐతే యధాప్రకారం గానే వ్యక్తిగత ఆరోపణలూ నిందల మధ్య అసలు విషయానికి అంత ప్రాధాన్యత దొరుకుతున్నట్టు కనిపించదు. కాని ఇది చాలా ఆలోచించదగ్గ ప్రశ్న. దీనికి సమాధానం దొరికినా దొరకకపోయినా కనీసం అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు పంచుకోవటం ఎంతో అవసరం. ఈ అంశం గురించి ఆలోచన ఎక్కువపాళ్ళలోనూ ఆవేశం తక్కువపాళ్ళలోనూ ఉండే రచనల్ని “ఈమాట” ఆహ్వానిస్తోంది.
క్రితం సంచికలో తెలిపినట్లు గత మూడేళ్ళుగా “ఈమాట”లో వచ్చిన రచనల్నుంచి ఎంచిన కొన్నింటిని పుస్తకరూపంలో తీసుకువస్తున్నాం. దీన్ని “ఆటా” సమావేశాల సందర్భంగా జులై తొలిరోజుల్లో విడుదల చెయ్యబోతున్నాం. “ఈమాట” జులై సంచికలో ఈ సంకలనం గురించిన అన్ని వివరాలు ఇస్తాం, దీనికి వెల్చేరు నారాయణరావు గారు రాసిన లోతైన విశ్లేషణ తో సహా.
మొన్నమొన్నటి వరకు ఉత్సాహంగా రాసిన రచయిత(త్రు)లు కొంతమంది కొన్నాళ్ళుగా మౌనం వహిస్తున్నారు. వీరు మళ్ళీ కలాలు పట్టవలసిన అవసరం ఉంది. అలాగే కొత్త రచయితలు, రచయిత్రులు ముందుకు రావాలి. అలాటి వారు మీకు తెలిసి ఎవరైనా ఉంటే వారికి “ఈమాట” గురించి తెలియజెయ్యండి. స్వేఛ్ఛగా, ఎలాటి ఒత్తిడులు లేకుండా, మనసున ఉన్న భావాల్ని గురించి రాయటానికి వెనకాడకండి. అంతగా అనుమానంగా ఉంటే కలం పేరుతో రాయండి. సహేతుకంగా, నిష్పక్షపాతంగా రాసిన రచనల్ని ప్రచురించటానికి “ఈమాట” సిద్ధంగా ఉందని మరిచిపోకండి.
అనువాదం ప్రాముఖ్యం తెలియని జాతికి విమోచన లేదు. దీవి సుబ్బారావు శ్రమకోర్చి, బసవ, అక్క మహాదేవి, అల్లమప్రభు, తదితర కన్నడ వచన కవులను(12 వ […]
“ఆకులోఆకునై” కాలమ్ గా “ఆంధ్రప్రభ దినపత్రిక” లో వచ్చిన వ్యాసాలను సంకలించి అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవిగారు. ఇందులోని వ్యాసాలు మల్లెపూవుల మీద నిలిచిన […]
నా పేరు అభిరామి. అందరూ నాపేరెంతో బావుంటుందంటారు. “మీ లాగే” అని కొసరు. నేన్నవ్వేసి ఊరుకుంటాను. “నీ నవ్వు కూడా” అంటారప్పుడు. చిన్నప్పణ్ణుంచీ అంతే. […]
ఒక రాజు గారున్నారు. అందరూ వారిని “పెద్ద రాజుగారు” అంటారు. చూట్టానికి వారు “పెద్ద” రాజులా ఉండరు. అసలు “రాజు”లా కూడా ఉండరు. వారి […]
నేనెప్పుడూ బందీనే. ఎంత స్వేచ్ఛగా ఉందామనుకొన్నా ఏదో ఒక తీగ కాలికి చుట్టుకొంటుంది. అండమాన్ ఆకాశం నీలంగా మెరిసిపోతుంది.సముద్రం నాలాగే అశాంతిగా కదులుతోంది. బీచ్ […]
“ఇప్పుడేం చెప్పమన్నావు. ఏభయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు లాహోర్ లో ఉన్నాను కదా Tribune కి సబెడిటర్ గిరీ. నాకు బాగా జ్ఞాపకఁవేను. మా […]
“ఛ.. ఈ మగవాళ్ళెప్పుడూ ఇంతే. చెప్పిన టైం కి ఏ పనీ చేయరు”, మనసులో అనుకుంటూ మళ్ళీ మెసెజ్ పంపించింది “ఆర్యు దేర్? ” […]
గూడు వదలాలంటే భయం అడుగు వెయ్యాలంటే భయం ఎవరికో ఎక్కుపెట్టబడ్డ బాణం గుండెల్లో గుచ్చుకుంటుందని కాదు నిన్నటిలా ఎగరాలంటే భయం నింగి నీలంలో ఈదాలంటే […]
నేను ఈరోజు త్వరగా యింటికి వెళ్ళాలి నువ్వు కూడా ఈ పనంతా కానిచ్చేసి మీ యింటికి త్వరగా వెళ్ళిపో .. నేను రేపు అదిరిపోయేట్లు […]
కరెంటు స్టౌలతో వంట తెచ్చింది నాకు పెద్ద తంటా బొట్టుపెట్టుకోవాలో లేదో డైలమా డ్రైవింగ్‌లో మొదలు పెట్టాను ఓనమా పతిదేవుడే ప్రథమగురువు అప్పుడే మొదలైంది […]
[యుజీనియొ మొంటాలే (Eugenio Montale – 1896-1981 )ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించారు. పలువురు ఇతన్ని డాంటే తో పోలుస్తారు. గాయకుడు కాబోయి కవి అయ్యాడు. […]
చలిలో పొగమంచులో ఎన్నిసార్లు నీకోసం స్టేషన్లో ఎదురుచూడలేదు, పచార్లుచేస్తూ, దగ్గుతూ ఆ దిక్కుమాలిన దిన పత్రికలు కొంటూ గ్యూబా సిగరెట్లు కాలుస్తూ(తర్వాత వీటిని తలలేని […]
(ఈ వ్యాసానికి ఆధారం 2000 ఆగస్ట్‌లో, చికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో, చేసిన ప్రసంగం. దీని ముఖ్య ఉద్దేశం అమెరికా […]
అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఉయాల తీయని గాంధర్వ హేల గాయకమణి ఘంటసాల సి.నారాయణరెడ్డి ఘంటసాలవారి కమనీయ కంఠాన పలుకనట్టి రాగభావమేది! […]
తెలుగుసాహిత్యాన్ని ద్విపద, ప్రబంధము, శతకము, యక్షగానము మొదలైన ప్రక్రియల్లాగే అనేకార్థ కావ్యాలు కూడ అలరింపజేసాయి. రెండర్థాలు వచ్చే కావ్యాలు ద్వ్యర్థి కావ్యాలు. మూడర్థాలు వచ్చేవి […]