రాగం: ఆభోగి
గానం: ప్రీతి తమ్హాంకర్
రచన: కనకప్రసాద్
సాహిత్యం
పల్లవి:
మరి వేరే ఎవరు?
సరి చూచువారు?
సరి చూచువారు?
చరణం:
పరి పరి చెరలాపి
దరి చూపే వారు?
మరి వేరే ఎవరు? |మరి వేరే ఎవరు?|
దరి చూపే వారు?
మరి వేరే ఎవరు? |మరి వేరే ఎవరు?|
చరణం:
నిదుర విడిన మొదలు
చిదురులు పది వేలు
నిలుకడ మూగ వలె
నిలచిన మన్నారు |మరి వేరే ఎవరు?|
చిదురులు పది వేలు
నిలుకడ మూగ వలె
నిలచిన మన్నారు |మరి వేరే ఎవరు?|
[సంగీతం, ఉస్తాద్ రాషిద్ ఖాన్ చరణ్ ధర్ ఆయోరి(ఆభోగి) గీతానికి అనుసరణ.]