స్వరార్చనం

రాగం: బేగడ
తాళం: ఆది
స్వర రచన: శ్రీ గోపాల కృష్ణ భారతి (తమిళ మూలం: చిదంబరం కీర్తన)
గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
తెలుగు: కనకప్రసాద్

సాహిత్యం

పల్లవి:
స్వరార్చనం కల
రాగ సుధా రసార్ణవం
చెన్నారెడు చెవి తేనియలై కీర్తనలూ
అనశ్వరం          |స్వరార్చనం|
అనుపల్లవి:
స్వర స్వన ఝర్ఝర రవళులు
అలరీ పొరలే అమృత ఝరిలో
ఝల్లునా తంబురి మీటు
జతయై అల్లే జతి రాజిల్లను మనోహరం         |స్వరార్చనం|
చరణం:
వాయులీన తంత్రీ మూర్చనల మనసు కరిగి
థక ధిమి థక ఝణు తాడనముల నూగీ సొరగి
నిరం తరం          |స్వరార్చనం|
చరణం:
తనువును తావును మరచీ
నాదము తానెయై పాదు తన్మయం
నిరంతరం నీ పద కైరవ
నీరవ ఘోషా శృత సుకృత ఫలం          |స్వరార్చనం|