ఆశబోతు జనాలు
(అవుతాయవుతాయని గావాల)
అమ్ముతారు కొంటారు
అందుకే! అని పోతారు
కట్ట మీద గుడిగంట
ఎందుకు అంటున్నా
బెదురుగొడ్డు జనాలు
(పదండిపదండని గావాల)
అలగంటారు ఇలగుంటారు
ఏదండేదీ? అనుకుంటారు
ఎత్తుమీద ఆకాశం
ఎవళ్ళు అంటున్నా
పన్లమీద జనాలు
(ఫలానా అని గావాల)
అలగొస్తారు ఇలగెల్తారు
అల్లంతవరుకు! అని పంతాలు
అక్కల్లాగ చుక్కలు
అలగుండమ్మా అంటున్నా
బెష్టాకారి జనాలు
(కిష్టా రామా అంటూని)
ఒకటిస్తారు రెండొడుకుతారు
ఈ ఇంతలెక్కే అని నసుగుడు
అరసవిల్లి సూర్యుడు
అమ్మనీ! అంటున్నా
నిమానుగా జనాలు
(నిజఁవో నిష్టూరఁవో నమ్మాల)
కష్టం చేసొచ్చి మొక్కులు
కనపడకుండా దండాలు
చల్లంది తల్లీ భూదేవి
ఎల్లండెల్లండివై అంటున్నా
(మూలం the greedy the people, e.e. cummings )