కరుణఁజూడు లలిత

రాగం: ధర్మవతి
తాళం: ఆది

స్వర రచన, గానం: విద్వాన్ పుచ్చా వేంకట శేషయ్య శాస్త్రి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

పల్లవి:
కరుణఁజూడు లలిత భవాని
తెఱగు పరచునది నీవ గాని
కరుణజూడు లలిత భవాని
అ.పల్లవి:
పరుల తప్పులెంచును నటించును
బిగిసి అయ్యవారై చరించును
విసిగి వెసనకాడై కృశించును
వెదకి చితికితే ఒదవా ఏమి? |కరుణఁజూడు|
చరణం:
ఇరుల కొరలి నిను తెలియగ లేని
తిరుగులాడి నెపమెన్నక దీనిని |కరుణఁజూడు|