ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు

ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు

సంగీతం, గానం: నచికేత యక్కుండి
రచన: కనక ప్రసాద్
స్ఫూర్తి: రవీంద్ర సంగీతం నుండి అగునేర్ పొరోష్మొని అనే గీతం.

సాహిత్యం

పల్లవి:
ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు
రగిలే ఎడారిలో
మిగిలే నిరాశలో
పొగిలే విరాగికి
అగుపించని సహాయమై వాలు            |ఒగి|
చరణం:
అమవత్ తమోమయాంతరంగాన
క్రమ శేముషీ ప్రదీప్తమై లోన
నిశి దినము నీ దృగంచలం పైన
ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు            |ఒగి|
చరణం:
అదిరే పెదాలపై అదే మాట
మదిలో అనాది నీవనే చోట
చెడి ఈ హృదాలయం చెఱై పోగా
వణికే స్వరాన వేడ్కొనే పాట            |ఒగి|
చరణం:
ఈ జీవనార్ణవము
ఆభీల నీరవము
ఏకాంత హారవము
జగమే భయార్తమై మనే తావు            |ఒగి|

“I dedicate this song to the memory of my dear uncle, whom I affectionately called ‘Raja Mama,’ and who passed away very recently. Raja Mama was an ardent connoisseur of music and he especially loved to listen to me sing.” – నచికేత యక్కుండి.