లోపలి పిలుపు విని

లోపలి పిలుపు విని

రాగం: భూపాలం
తాళం: తిశ్రగతి, ఏక తాళం

స్వర రచన, గానం: పేరి పద్మావతి
స్వర రచన: వేంకటరామన్ సత్యనారాయణ
రచన, స్వర కల్పన: కనకప్రసాద్

సాహిత్యం

పల్లవి:
లోపలి పిలుపు విని
లోనికి పోవలెను
పాపికి చపలునికి
కపటికి ఇది నీ తెరువు
లోపలి పిలుపు విని
లోనికి పోవలెను
చరణం:
ఊపని ఊయల ఇది లోచూపున నిలుపగవలెను
ఏపని కలిగిననేమి ఏమరువక నీ సెలవు          | లోపలి |
చరణం:
చేపిన పొదుగే లేగకు చక్కెర తీపైనట్లు
ఓపిన యమ్మకు నెమ్మది తేట నీరు దిగినట్లు
అలల కొలని జలలు అట్టె తళ తళ లాపినయట్లు
ఆగిన తలపుల నడుమన నీ అడుగుల సడి విన్నట్లు          | లోపలి |
చరణం:
రాజేయని అగ్గి ఇది రాత్రి పవలు దీని చిచ్చు
రాజుకు పేదకు నొకటే నానాటికి చూడగను         | లోపలి |
చరణం:
వడి వడి చిలికే కవ్వము చల్ల తీపు కననట్టు
పడి పడి లేచే కెరటము పదపడి మరలినయట్టు
వడలి విడని అడియాశలు నావీ నీవన్నట్టు
చెడి అన్నామలై రమణా నీవన్నది విని విననట్టు
కోపికి శపితునికి అపరాధికి ఇది నీ యాన          | లోపలి |

స్వర రచన

[స్వరం పై గీత తారా స్థాయికి, క్రింద గీత మంద్ర స్థాయికి గుర్తు. స్వరాల్ని కలుపుతూ క్రింద చుక్కల గీత తాళ గతికి సూచనలు.]

స  రి గ ప గ  ప  గ స గా | ద ప గ రి గ రి స ద సా
లో ప లి . పి లు పు వి ని |లో ని కి . పో . వ లె ను
స  రి గ ప గ  ప ద ద దా | ప ద స రి స ద దా ప గ రి గ రి గ సా
పా . పి కి చ ప లు ని కి | క ప టి కి ఇ ది నీ తె రు వు . .. |లోపలి| 
 
గా ప గ పా  ప ప ప ప ద ప |  గా ప గ ప ద  స స స స సా
ఊ ప ని ఊ య ల ఇ ది లో | చూ పు న ని లు ప గ వ లె ను 
రీ రి రి రి రి రి రి రీ రీ | స రి స ద ద ద ప గ ద ద ప గ
ఏ పని క లి గి న నేమి | ఏ.మ రు వ కనీ . సె ల వు . |లోపలి| 
 
గా ప గ పా ప పా పా ద ప | గా ప గ పా దా దా దా
చే పి న పొ దు గే లే గకు | చ క్కె ర తీ పై న ట్లు
ప ద స స సా స  స రీ  రి రి | సా రి స స ద ప ద సా సా
ఓ . పి నయమ్మకు నెమ్మది | తే ట నీ . రు ది గి న ట్లురి సరి సరి సరి స | ద  రి రి రీ రీ
అ లల కొల ని జ లలు అ . ట్టె | త ళ త ళ లా .పి న య ట్లు
రీ రి రి ద ద ద ద  గ గ  గ గ | రి గ ద  ద ద ద గ గ రీ రీ రి గ రి గ సా
ఆ గి న త ల పుల న డు మ న | నీ. అ డు గు ల స డి వి న్నట్లు . . . .   |లోపలి|
 
గా పా ప ప పా ప ద పా | గా ద ప ప ద పా ద సా స
రా జే యని అగ్గి ఇ ది | రా త్రి ప వ లు దీ ని చి చ్చు
రీ రి రి రీ రి రి రి రి రీ | స రి స ద ద ద గా గ గ రి గ రి గ సా
రాజుకు పేదకు నొక టే | నా .  నా  . టి కి చూ డ గ ను . . . .    |లోపలి|
 
గ గ ప గ ప ప పా పా ద ప | గా గ పా ద ప ద సా సా
వ డి వ డి చిలి కే కవ్వము | చ ల్ల తీ పు క న న ట్టు
ప గ ప ద రీ రీ రి  రి రి రి |స రి స ద ప ద స స స స సా
ప డి ప డి లే చే కె ర టము | పద ప డిమ ర లి న య.ట్టురి సరి స ద రి సా రి స | దా సాస రీ రీ రీ
వ డ లి వి డ ని అడియాసలు | నా వీ నీ . వ న్నట్టురి రీ రి రి  స ద దా | ప ద రి రి స ద ద ప ప గ గ రి రి గ రి గ సా ; ;
చెడి అ . న్నామలై ర మణా | నీ . వ . న్న ది వి ని వి న న . ట్టు  . . . . 
స రి గ ప గ ప ద ద దా | ప ద రీ స ద ప గ ద ద ప గ | రీ ; ; ; ; ; ; ;
కో . పి కి శ పి తు ని కి | అ ప రా ధి కి ఇ ది నీ . యా | న . . . . . . .	 |లోపలి|

‘For Mark.’