అరుణాచల పతి
రాగం: శుభపంతు వరాళి
తాళం: మిశ్ర చాపు
సంగీతం, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
సాహిత్యం
పల్లవి:
ఎరుగనిదేమిటి?
చరణం:
ఎరనై చిక్కితే
ఒగి లోలోపల
రహి నీ దాపని |అరుణా|
చరణం:
నిరతము రాఁపడి
చెలగే బోఁతికి
కలిగినదేమిటి? |అరుణా|
చరణం:
అదువైతే మది
చదివినదేమిటి?
ఒదవినదేమిటి? |అరుణా|
చరణం:
తనువిటు పెనవితే
తన గతి తానని
జని బాపేవని |అరుణా|
ఎరుగను …?
ఎరుగను …?
ఎరుగను ఇదేమిటి? |అరుణా|
(శ్రీమతి శ్రీవిద్య బదరీనారాయణన్ సియాటిల్ ప్రాంతంలో నాదోపాసన కర్ణాటక సంగీత పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆవిడ చిన్నప్పటి నుండి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ, శ్రీ మదిరిమంగళం రామచంద్రన్ గారి వద్ద ఆరు సంవత్సరాలు, ఢిల్లీ విశ్వ విద్యాలయం సంగీత విభాగం అధిపతి డా. రాధ వెంకటాచలం గారి వద్ద సుమారు రెండేళ్ళూ శిక్షణ తీసుకున్నారు. 1997 నుండి 2003 వరకు ఆకాశవాణి (AIR)లో కచేరీలు ఇచ్చేరు. 2003 నుండి ఇటీవలి వరకు సియాటిల్ ప్రాంతంలో సాధన సంగీత కళాశాలను నిర్వహించిన డా. అశోక్ కుమార వద్ద సంగీతాన్ని అభ్యసించేరు.)
For వరహాలు చెట్టిగారు. for బుక్ సెంటర్ మేడ.