నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.
నవంబర్ 2000
ఇది “ఈమాట” ద్వితీయ జన్మ దిన సంచిక! ఇందుకు కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు అభివందనచందనాలు, దివ్యదీపావళి శుభాకాంక్షలు!
“ఈమాట”కు రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒక సారి వెనక్కు తిరిగి దీన్ని ఏ ఆశయాల్తో ప్రారంభించామో గుర్తుకు తెచ్చుకుని ఇప్పటికీ అవి అర్థవంతంగానే ఉన్నాయా లేక ప్రయాణదిశని మార్చాలా అని ఆలోచించాల్సిన అవసరం ఉందనుకుంటాను. అప్పుడు “ఈమాట” ఆశయాలు మూడు
మొదటిది భారతదేశం బయట ఉంటున్న తెలుగు వారి జీవన విధానాల్ని,అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయిత(త్రు)లకి ఒక వేదిక కల్పించటం.
రెండోది ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండేట్టు చూడటం.
మూడోది Internet technology ని వీలైనన్ని విధాల ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడటం.
ఈ రెండేళ్ళ లోనూ ఈ ఆశయాల సాధనలో చాలావరకు కృతకృత్యులమయ్యామనే అనిపిస్తోంది. ఈ విషయంలో మీరు కూడ మీ అభిప్రాయాల్ని పంచుకుంటే బాగుంటుంది కాని “మౌనం మన సహజభూషణం” అని పూర్తిగా అర్థమయాక ఇది అభిలషణీయమే కాని ఆచరణీయం కాదని తేల్చుకున్నాం.
మార్పులూ చేర్పుల విషయానికి వస్తే, పత్రిక స్వరూపంలో చెయ్యవలసిన మార్పులు చాలా కనిపిస్తున్నయ్. అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటే చెయ్యాలని మా ప్రయత్నం.
ఉదాహరణకు, ఇప్పటి వరకు “ఈమాట”లో వచ్చిన కథలన్నిటిని నేరుగా చూడటానికి వీలుగా ఒక master directory ఈ సంచికలో ఇస్తున్నాం. వచ్చే సంచిక నుంచి అన్ని అంశాలకు, ఒక్కో రచయిత(త్రి) రచనలకు నేరుగా ఇదే సదుపాయం కలిగించబోతున్నాం.
పత్రిక స్వభావం, వస్తువైవిధ్యం, విషయగుణం మొదలైన రంగాల్లోనూ మార్పుల అవసరం ఉన్నది. ఐతే ఔత్సాహిక రచయిత్రు(త)ల సహకారాన్ని కోరటం తప్ప ఈ విషయంలో సంపాదక వర్గం అశక్తతని వ్యక్తం చెయ్యక తప్పటం లేదు. కొత్త శీర్షికలని నిర్వహించటానికి గాని, కొత్త ప్రక్రియలని చేపట్టటానికి గాని ఎవరైనా ఉత్సాహం చూపిస్తే వారిని ప్రోత్సహించటానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం.
మా ఈ ప్రయత్నం మీద నమ్మకం ఉంచి తమ రచనలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న రచయిత(త్రు)లకు మా కృతజ్ఞతలు. ఇంకా రచయితలు, రచయిత్రులు రావలసి ఉంది, రాయవలసి ఉంది. త్వరలోనే వస్తారని, రాస్తారని మా ఆకాంక్ష.
“ఈమాట” సంపాదకుల్లో ఒకరైన శ్రీ ద్వా. నా. శాస్త్రి గారి “విమర్శప్రస్థానం” రచనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే “ఏటుకూరి వెంకటనరసయ్య స్మారక పురస్కారా”న్ని ప్రకటించారు. శ్రీ శాస్త్రి గారికి మా అభినందనలు. ఈ పుస్తకం కావాలనుకున్న వారు శ్రీ శాస్త్రి గారికి పది డాలర్లు పంపితే వారు నేరుగా ఒక కాపీ పంపగలరు. వారి అడ్రస్ ఇది Dr. D. N. Sastry, Reader in Telugu, S.K.B.R. College, Amalapuram – 533 201, A.P.
కె. వి. ఎస్. రామారావు
ఒక పద్యంలో ఉండే అక్షరాలు, పదాలు, వాటి అమరికల గురించి అసాధారణమైన షరతులకు లోబడి రాసే, లేదా చెప్పే, పద్యాన్ని చిత్రకవిత గా నిర్వచించొచ్చు. […]
“సాహితీసమరాంగణ సార్వభౌము”డైన శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు భువనవిజయ సభ తీర్చి ఉండగా తెనాలి రామలింగడు ఆ సభకి ఆలస్యంగా వచ్చాడు. అది చూసిన రాయల వారు […]
“నీకు బుద్ధి లేదురా సీతారావుడూ! జైలుకెళ్ళి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే తిరిగొచ్చావ్ గదరా.” పాపారాయుడి కళ్ళలో నామీద అంతులేని జాలి. ఆ […]
మా చిన్నప్పుడు వేసంకాలం వచ్చిందంటే తప్పకుండా తరవాణి కుండ ఇంట్లో వెలియాల్సిందే. ఆ మాటకొస్తే వేసంకాలం కాకపోయినా ఉండేదనుకోండి. మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళే మూడుతరాలవాళ్ళు. […]
కలనించి మెలకువకు వంతెన వేస్తూ ఫోన్ చప్పుడు.. “హలో” వదలని నిదరమత్తు, బద్ధకం. “హలో! నేను శంకర్ని మాట్లాడుతున్నా!” “ఆఁ శంకర్ ఏమిటి సంగతులు?” […]
అతను స్టీలు కుర్చీలో నిస్త్రాణగా వాలి కూర్చు నున్నాడు. ఆమె అతని కుర్చీకి కొంచెం ఏటవాలుగా మోడా మీద ఒద్దిగ్గా కూర్చు నుంది. స్కూల్లో […]
eశ పొద్దున్నే లేచి eమెయిలు చూసుకోవడం మొదలుపెట్టాడు. అష్టకష్టాలూపడి eమధ్యనే eమెయిలు చూడ్డం ఒక అలవాటుగా చేసుకున్నాడు. కూతురు eళ దగ్గర్నుంచి eమెయిలు. eమ్మాన్యుయేల్ని […]
(విజయనగరం లో పుట్టి పెరిగిన నేను, ప్రస్తుతం చెన్నై వాస్తవ్యుడను. కంప్యూటరు వృత్తి, కవనం ప్రవృత్తి. కథ, కవిత్వం రెండిటిపైనా ఆసక్తి ఉంది. ప్రత్యేకించి […]
న్యూయార్కు నగరం పొలిమేరలో ఉంది మా ఇల్లు. అందువల్ల అర్థరాత్రి అయినా సరే మా ఆవిడతో పాటు లాంగ్ ఐలెండ్ జ్యుయిష్ మెడికల్ సెంటరు […]
“నేను వెళ్ళిపోతున్నాను” అంది గీత, హాలు లో తన సూట్ కేసుల ప్రక్కనే నిలబడి. “ఎక్కడికి?!” అడిగేడు అప్పుడే ఆఫీసు నుండి ఇంటి కొచ్చిన […]
ముందు మాట సరస్వతీదేవికి భాసుడు నవ్వులాంటివాడైతే, కాళిదాసుడు విలాసంలాంటివాడని పేరు (భాసో హాసః కాళిదాసో విలాసః). ఈనాటకం దాదాపు 2500 ఏళ్ళక్రితం భాస మహాకవి […]
(జరిగిన కథ వర్ధమాన హోంబిల్డర్ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న […]
(ఈ రాగలహరి శీర్షికలో మూడవ రాగం సింధుభైరవి. ఇంతకు ముందు పరిచయం చేసిన మోహనం, అభేరి రాగాల్లాగే, ఇప్పుడు సింధుభైరవి రాగాన్ని పరిచయం చేయ […]
ప్రపంచం అంతా “ఎడ్డెం” అంటే “తెడ్డెం” అనే మనస్తత్వం ఈ అమెరికా వాళ్ళది. అలా అనుకుని ఊరుకున్నా పరవాలేదు; వాళ్ళ తెడ్డెమే ఒప్పు మిగిలిన […]