బాల బేలవు ముద్దరాల
రాగం: నీలాంబరి
తాళం: రూపక
సంగీతం, గానం: పేరి పద్మవతి
స్వర రచన: వేంకటరామన్ సత్యనారాయణ
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
సాహిత్యం
పల్లవి:
బాల బేలవు ముద్దరాల
విపణ పణి
తాళ జాలవు కుహన జాల
బేలవూ
తాళ గలవా?
చాలా |బాల|
విపణ పణి
తాళ జాలవు కుహన జాల
బేలవూ
తాళ గలవా?
చాలా |బాల|
కూహ కదాశయ పటు సహస్ర ఫణి
దంష్ట్రా దంశిత చేత జూత పణి
చరణం:
మాటైన మాటాడవూ
పలుకైననూ పలుకవే
మాటైన మాటాడవూ ఏల
పలుకైననూ పలుకవే
మాటైన మాటాడు
పలుకైన పలుకవే
చిలుక ముద్దుల కొలికిరో చెల్లెలా
కల్లల్ల లోకమమ్మా
అల్ల కల్లోలమమ్మా |బాల|
పలుకైననూ పలుకవే
మాటైన మాటాడవూ ఏల
పలుకైననూ పలుకవే
మాటైన మాటాడు
పలుకైన పలుకవే
చిలుక ముద్దుల కొలికిరో చెల్లెలా
కల్లల్ల లోకమమ్మా
అల్ల కల్లోలమమ్మా |బాల|
పణ విపణి
వెయ్యి కోరల భవ కరాళ
బేలవు
చాల గలవా? |బాల|
భీకర చండ మనీషాభీరణి
దురిత విపాదిత జర్జర ధారణి
చరణం:
ఆ వంక ఆరడి
ఈ యంక రాయిడి
నీవింత నినుపార మేలా?
ఈ యంక రాయిడి
నీవింత నినుపార మేలా?
అడుగడుగు మోసమమ్మా
అడరు వాచాలమమ్మా
అట్టే
తెల్లబోతావు సుమ్మా
పరమేశ్వరీ |బాల|
For శిరీష, who makes this necessary, and then possible