1. ఈ క్రింది పదాలకన్నిటికీ చివరి మూడు అక్షరాలు సమానమే. ప్రక్కన ఇచ్చిన క్లూలను బట్టి ఆ పదాలు కనుక్కోండి. 1. తుమ్మెద ధ్వని […]
సెప్టెంబర్ 1999
ఇతోధికంగా ప్రోత్సాహాన్నిస్తున్న “ఈమాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ఈ సంవత్సరపు కథా, కవితల పోటీలలో ఎన్నుకున్న రచనలను అందిస్తున్నాం. ఇందుకు ఆనందంగా ముందుకు వచ్చి ఎంతో సహకారాన్నందించిన వంగూరి ఫౌండేషన్ స్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి మా హార్దిక కృతజ్ఞతలు.
క్రితం సంచికలో తానా వారు ఎన్నుకున్న కథలు ఇండియాలో ఉన్న రచయితలవైతే వంగూరి ఫౌండేషన్ వారివి అమెరికా రచయితలవి. ఇలా ఈ రెండు ప్రాంతాల రచయితల దృక్పథాల్ని, వాళ్ళు ఎన్నుకున్న అంశాల్ని, వారి వారి కథన పద్ధతుల్ని పోల్చి చూసే అవకాశం కలుగుతోంది. ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చి యీ విషయంపై వారి అభిప్రాయాలను మిగిలిన వారితో పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ అభిప్రాయాల్ని “పాఠకుల అభిప్రాయాలు” ద్వారా గాని, లేకుంటే వచ్చే సంచిక కోసం విశ్లేషణాత్మక వ్యాసాలుగా కాని పంపవచ్చు.
శ్రీ చేకూరి రామారావు గారు ఇక్కడికి వచ్చి వెళ్ళిన సందర్భంగా “ఈమాట”కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది మీరు ఈ సంచికలో చూస్తారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను సూటిగా, తేటగా వివరించారాయన. ఇలా ఎంతో ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపిన శ్రీ చేరా గారికి అభివందనాలు. ఈ ఇంటర్వ్యూ జరగటానికి కారకులు, వీటిలో చాలా ప్రశ్నలు తయారుచేసిన వారు శ్రీ విన్నకోట రవిశంకర్. వారికి మా కృతజ్ఞతలు.
అసంఖ్యాక అంశాల పరిశోధనల్లో మునిగిపోయి ఉండి కూడా శ్రీ వెల్చేరు నారాయణరావు గారు అజంతా కవిత్వం మీద ఒక చక్కటి వ్యాసం రాసి ఇచ్చారు. వారికీ మా కృతజ్ఞతలు.
ఈ సంచికలో ప్రవేశపెడుతున్న మరో కొత్త శీర్షిక “పదకేళి”. ఇది మీకు వినోదాత్మకంగా ఉంటుందని, ఈ అన్వేషణలో మీరు విస్తృతంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఈ శీర్షికను నడపడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన శ్రీ సోమయాజుల కాశీ విశ్వనాథం గారికి మా కృతజ్ఞతలు.
ఎందరో పాఠకులు “ఈమాట”ను చదవటమే కాకుండా వారి బంధుమిత్రులకు కూడా దీని గురించి తెలియజేసి ప్రచారం కలిగిస్తున్నారు. అందుకు వారందరికీ ఎంతో కృతజ్ఞులం. అలాగే, తమకు తెలిసిన రచయితల్ని కూడా “ఈమాట”కు తమ రచనలు పంప వలసిందిగా ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది.
ప్రముఖ రచయిత్రి మహ జబీన్ సూచించినట్లు రచయిత్రుల రచనల్ని ప్రచురించాలని మాకూ చాలా ఉత్సాహంగా ఉంది. మగవారితో అన్ని విషయాలలోనూ సమానులుగా ఉన్న ఇక్కడి తెలుగు మహిళలు రచనా విషయంలోనూ ఏమాత్రం తీసిపోకూడదు. వారికి మా హృదయపూర్వక ఆహ్వానం అందిస్తున్నాం. వారి దృష్టికోణం నుంచి ఎన్నో విషయాలను చర్చించవలసిన అవసరం ఉంది.
ముఖచిత్రాల వల్ల ఈ పత్రిక తొలి పేజీ రావటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నదని, ముఖ్యంగా low speed modemsతో చూడాలనుకుంటున్న వాళ్ళకు కొంత కష్టంగా ఉంటున్నదని కొందరు పాఠకుల నుంచి విన్నాం. అందుకు గాను ప్రయోగాత్మకంగా ఈ సారి ముఖచిత్రం లేకుండా ప్రచురిస్తున్నాం. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తే సంతోషిస్తాం. ఇక ముందు ఎలా చెయ్యాలో నిర్ణయించుకోవటానికి అవెంతో ఉపయోగపడతాయి.
ఇది జరిగి సరిగ్గా ముప్ఫయి సంవత్సరాలయింది. అంటే 1969 అన్నమాట. నాకు తెలిసి ఆంధ్ర దేశంలో ఇంట్లో మానేసి హాస్పిటల్లో ముఖ్యంగా మధ్య తరగతి […]
దమయంతమ్మ గారు వాళ్ళ బన్నీ, ఆపగాడు, ఎలుమంతి శంకర్రావు, చంటి, రవణ మేష్టారి కాశీపతి, బూతుల కిష్టప్ప, గాజుల మామ్మ గారింటికి సునాబేడ నుండి […]
ఎడంచెయ్యి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నా శంకర్ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై. “నాన్నా,” కిరణ్ పిలిచాడు. దరువాగి […]
ఉదయం 7.30 కావస్తోంది. కిటికీలోంచి కనిపిస్తూన్న ఆహ్లాదకరమైన దృశ్యాన్ని గమనిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు రామారావ్. చుట్టూరా మంచి తోట. ముందుభాగంలో ఒక చిన్న సరస్సు. […]
ఆఫీస్ నుంచి రాగానే అంటే ఆరు గంటలకు భోజనం చేయటం అలవాటయి పోయింది. కారు డ్రైవ్ వేలో ఆపుతుండగానే, ప్రసూన డైనింగ్ టెబుల్ మీద […]
[ డాక్టర్ జె. బాపురెడ్డి గారు ఒక వంక ఐ.ఎ.ఎస్. ఆఫీసర్గా అనేక బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో పనిచేస్తూనే మరో వంక పుంఖానుపుంఖాలుగా సాహిత్య సౌరభాల్ని […]
మంత్రించినట్లు, మరబొమ్మకి కీ ఇచ్చినట్లు సరిగ్గా ఆరున్నరకి నిద్ర లేస్తుంది తాను మరోసారి గృహిణి యంత్రం పని మొదలెడుతుంది. నలుగురి అవసరాలకు తాను మాత్రం […]
ఏమివాయ్ మై డియర్ షేక్స్పియర్! మళ్ళీ ముఖం వేలవేసినావ్?? సొర్గానికి పోయినా సవితి పోరు తప్పనట్టు అమరలోకం లాటి అమెరికాకి వచ్చినా ఒక టెలుగూస్ […]
[ ప్రస్తుతం University of Wisconsin, Madison లో కృష్ణదేవరాయ Special Chair Professor గా ఉంటున్న శ్రీ వెల్చేరు నారాయణ రావు గారు […]
సిన్సినాటి తానా మహాసభ లో జయప్రభ చేసిన ప్రసంగ వ్యాసం. (జయప్రభ గారు ఈ వ్యాసానికి శీర్షిక ఇవ్వలేదు. సందర్భం తెలియటంకోసం మేమే ఈ […]
ఆటల్లో మునిగినా ఎట్లా గమనించారో, ఎవరు ముందుగా చూశారో తెలియదు, పిల్లలంతా గుమికూడారు దాని చుట్టూ..వాళ్ళ కేకలూ, చిందులూ చిటికెలో వదిలేసి.. ఎంత ఎగరాలని […]
పరుగెత్తే ప్రవాహం లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ అసంకల్పితంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా […]
మళ్ళీ వచ్చింది మరో ఉగాది అడ్డమైన కవితలకు నాంది (అందులో ఒకటి నాది) ఏమిటో మన భ్రాంతి ప్రభవాది షష్టి చక్ర నిర్విరామ పరిభ్రమణంలో […]
[ శ్రీ చేకూరి రామారావు గారి వివరాలు కొన్ని, వారి మాటల్లోనే. ఉస్మానియాలో B.A., ఆంధ్రాలో M.A. Telugu, Madison, Wis.లో, Cornell Univ.లో […]