త్రిపురాంతకేశ్వరా!

త్రిపురాంతకేశ్వరా

రాగం: రాగ మాలిక
తాళం: ఖండచాపు

స్వర కల్పన, సంగీతం, గానం: చిదంబరం కవస్సెరి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

{మాయా మాళవగౌళ}

పల్లవి:
త్రిపురాంతకేశ్వరా
ఇపుడేది త్రోవరా
రిపులారుగురి కేల సోలి కైవ్రాలి వెట్టి కైకిలి సేవరా. |త్రిపు|
చరణం:
దేహమ్ దురంసల కటాహమ్
వృత్తమ్ మహేచ్ఛా విదాహమ్
గేహమ్ అవితృప్త లోలమ్
చిత్తమ్ సదా మత్త వైచిత్ర వ్యాలమ్ పశుపతే
అనుపల్లవి:
జపమాల చాఁతునా?
తపమేమి చేతునా?
విపులాచ పృథ్వియని ఈడ నాడ ఏడాడు త్రిప్పటలాడి వేఁతునా? |త్రిపు|

{సింధు భైరవి}

చరణం:
వారమ్ అభివేగ భారమ్
రాత్రమ్ విగతమ్ అనువారమ్
చింతా అహఁ మదభ్యాంతా
నిద్రా ఛాయా దష్ట వికలా భస్మ శాయిన్

{చక్రవాకం}

అనుపల్లవి:
లోనింత లోపము
నేటించు లోకము
పైపైన గోటు మాటు వాచాటు టక్కరి పటాటోపము |త్రిపు|

{శుభ పంతువరాళి}

చరణం:
విషయా: విషాదన నిచయా:
చర్యా తర్షిత కదర్యా
చర్చా నిభృత జిగీషా
శాస్త్రమ్ వాగ్జాల మాత్రమ్ భగవన్ కాలహంత్రే

{మాయా మాళవగౌళ}

అనుపల్లవి:
అరుణాచలమ్మట
అరచేతి స్వఁమ్మట
కరుణా మసృణ స్థాణు మౌనావరణ మహా కృచ్ఛ్రోజ్జ్వలమ్మట. |త్రిపు|

(వ్యాకరణ దోషాలు సవరించి పెట్టిన డా. జె.ఎస్.ఆర్.ఎ. ప్రసాద్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గీతానికి స్వర రచన కావలసినవారు ఈమాట సంపాదకుల ద్వారా మమ్మల్ని సంప్రదించమని మనవి.)


‘కీర్తి నిశ్శేషులు చర్ల గణపతి శాస్త్రి గారి స్మృతికి, కృతజ్ఞతలతోను’