విందు

ఈ స్వాగత్ నవరతన్ చపాతీ
ఎవరో అతను మడి చేల తొక్కిన గోధుమ
వేకువన ముసుర్లో ఒక మనిషి
వణుకుతూ రాత్రి ఒక ఊపిరి
బరువుగా తిరగళ్ళ చప్పుడు
ఆ గాలి పాడితే ఈ గజల్
నలుగురం కలుసుకున్నప్పుడు
నాజూకు మిల మిలా సారాయి
చేవెళ్ళ ద్రాక్ష నెత్తుటి చార
ఆ చేతి వెచ్చనకి ఈ రొట్టి
కొలిమి సెగ ఎగసి ఈ అగరొత్తి కావిళ్ళకింత అని ఆశలు
వెల చూసి కలనేసి ఈ మొగల్ పరదాలు
కూనేరు జాబిలిని గిలకొట్టి మీగడ
సాలూరు చేనూలు చిరివాడ ఆవాలు
ఈ రొయ్య నా చెరువు
మీ పరువు నా బరువు
మీరు తాగేది నా మధువు
మీరు త్రుంచేది నా రొట్టె.

మూలం: డిలాన్ థామస్ This Bread I Break