ఈ సంచికలో కొన్ని జానపద పాటలు విందాం. ఇవి నిజంగా జానపదుల పాటలా లేక ఆధునిక రచనలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ జానపద వాఙ్మయం మనకు జాతీయవాదం బలంగా వున్న రోజుల్లో సినిమాల్లోను, గ్రామఫోను రికార్డులపైన, ముఖ్యంగా రేడియోలోను చాలా ప్రముఖంగా వినబడేది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: పరుచూరి శ్రీనివాస్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
పరుచూరి శ్రీనివాస్ రచనలు
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మంగళకైశికి రాగంపై చేసిన ప్రసంగం; లలిత సంగీతం అంటే ఏమిటి? నలుగురు ప్రముఖుల – రజని, మంగళంపల్లి, ఈమని, ఎమ్. ఎన్. శ్రీరాం – అభిప్రాయాలు, ఆలిండియా రేడియో ప్రసారం; మరికొన్ని లలితగీతాలు, ఈ ప్రత్యేక సంచికలో మీకోసం.
ఈ పదిహేనేళ్ళలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక లఘు చిత్రం గురించిన వివరాలు చూద్దాం. దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు.
శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి ఆయనే అధ్యక్షుడు. మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు.
సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం.
ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్‌లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.
రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.
ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి. వైజయంతిమాల సొంతంగా తెలుగులో ఇచ్చిన నాలుగు పాటల రికార్డులు, గాయని ఎమ్. కృష్ణకుమారి, గాయని బి. ఎన్. పద్మావతి పాడిన పాటలు. వీరి వివరాలు తెలిపితే సంతోషం.
ప్రస్తుతం నా ఆడియో టేపులు, డిస్కులు నాకు అందుబాటులో లేవు. అందువల్ల ఈ నెలలో కూడా మరికొన్ని లలిత గీతాలే అందిస్తున్నాను. ఇవన్నీ విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.
ఈ సంచికలో దాశరథి, భుజంగరాయశర్మ, విశ్వేశ్వరరావు, అడవి బాపిరాజు వంటి ప్రముఖులు రచించిన కొన్ని లలితగీతాలు వినిపిస్తున్నాను. ఓలేటి వెంకటేశ్వర్లు, వేదవతి, ఛాయాదేవి తదితరులు పాడిన ఈ గీతాలు మొదటగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.
సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్ళకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి.
కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్ళు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కాని, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్ళని గుర్తించే సమాజమూ లేదు.
2016లో శ్రీకాంతశర్మ లలితగీతాలు అన్న పేరుతొ ఒక 35 గీతాల పుస్తకం, దానికి జతగా 15 పాటలున్న ఒక సి.డి. వెలువడింది. ఈ సంకలనం నుండి, తేనెల తేటల మాటలతో అన్న బహు ప్రసిద్ధి గాంచిన దేశభక్తి గీతంతో పాటుగా, మార్కెట్లో లభ్యం కాని మరికొన్ని పాటలు కూడా ఇక్కడ వినవచ్చు.
నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.
ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్యతో 1995లో ‘వ్యాపకాలు జ్ఞాపకాలు’ అన్న శీర్షిక తో విజయవాడ రేడియో కేంద్రం 1995లో దంటు పద్మావతిగారు నిర్వహించిన సంభాషణ వినండి.
కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటల కైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు.
ఈ మాటంటే చాలామందికి తీవ్రమైన అభ్యంతరం ఉండొచ్చు కాని, తెలుగు సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకే ఎక్కువ తెలియదు. మనకి కొన్ని ముఖ్యమైన పుస్తకాల పేర్లు, వాటిని గురించిన పొగడ్తలు, ఆ పుస్తకాలు రాసిన కవుల గురించి చాలా వివరాలు తెలుసు. కానీ, దాని సాహిత్యార్థం ఇది; ఆ పుస్తకం చదివితే వచ్చే ప్రశ్నలు ఇవి, ఆ పుస్తకం చదవాల్సిన మార్గం ఇది, అని వివరించి చెప్పే వ్యాసాలు తెలుగు సాహిత్యంలో చాలా పుస్తకాల మీద రాలేదు.
ఈ సంచికలో సి.ఎస్.ఆర్ పాడిన కొన్ని పాటలు, పద్యాలు విందాం. సి. ఎస్. ఆర్ పూర్తి పేరు చిలక(ల)పూడి సీతారామాంజనేయులు. ఆయన మొదట నాటకాల్లోను తరువాత సినిమాల్లోను వేసిన పాత్రల గురించి సమాచారం ఇప్పుడు ఇంటర్నెట్లో తేలికగానే అందుబాటులో వుంది.
గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారు. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమైంది.
అనంతకృష్ణశర్మగారు సాహిత్య రంగంలోనే కాదు సంగీత రంగంలో కూడా గొప్ప పండితులన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంచికలో వినిపిస్తున్న ప్రసంగం మార్చ్, 1960లో అపూర్వ రాగములు అన్న శీర్షిక క్రింద సైంధవి రాగంపై ఆకాశవాణిలో చేసినది.
తొలి అయిదు దశాబ్దాలలో, అంటే 1981-82 వరకు, వచ్చిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమారంగానికి రెండు ప్రత్యేకతలున్నాయి. చాలా మంది పాటల రచయితలు ప్రథమంగా పేరొందిన కవులు కావడం, అలాగే సంగీత దర్శకులు మంచి గాయకులు కూడా కావడం.
గాయకుడిగా ఆయన ప్రతిభకు స్పష్టంగా అద్దం పట్టే పాటలివి. మొదటి రెండు 1948లో మహాత్మా గాంధి మరణానంతరం రాసి, హెచ్.ఎం.వి. వారికి రికార్డుగా ఇచ్చినవి. అదే సమయంలో గాంధీకి నివాళులర్పిస్తూ చాలా భారతీయ భాషలలో బాగా పేరు పొందిన గాయనీగాయకులు రికార్డులిచ్చారు.
2003లో హైదరాబాదులో కె.వి.రావుగారు, మరికొందరు సంగీతాభిమానులు కె.రాణి, ఎ.పి.కోమల, సి. కృష్ణవేణిగార్లను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం జరిపారు. వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నేను, మిత్రులు మధుసూదనశర్మగారితో కె. రాణిగారిని రెండుసార్లు హైదరాబాదులో కలిశాను. చాలా బాగా మాట్లాడేవారు.
రజని 1988లో ఆకాశవాణి వారికిచ్చిన ఈ ఇంటర్‌వ్యూ నా దృష్టిలో చాలా అపురూపమైనది. రజని సంగీత, సాహిత్య, వ్యక్తిగత వికాసాల గురించిన ఎన్నో వివరాలు వినవచ్చు. అంతకంటే, 1920-30ల నాటి తెలుగు సాహిత్య, సంగీత చరిత్రల గురించిన ఎంతో ఆసక్తికరమైన సమాచారం ఈ ఇంటర్‌వ్యూలో ఉంది.
ఇలాంటి ప్రయోగం ఇంతకూ ముందు, తరువాత కూడా ఎవరూ చేయలేదు. రామాయణ అవతరణ కథను వాద్యగోష్ఠిలో వివిధ రాగాలలో క్రౌంచ మిథునంతో మొదలు పెట్టి కొన్ని ఘట్టాలుగా విభజించి కల్పన చేశారు. దీని సృజన లేక సృష్టి వెనుకనున్న కొన్ని వివరాలను రజనీకాంతరావుగారే (ఇంగ్లీషులో) వివరిస్తారు.
అన్నమయ్య సంకీర్తనలలోని రాగాల విశిష్టత పైన రజనీకాంతరావుగారు చేసిన ఈ ప్రసంగం 2000 సంవత్సరం ఆగస్టు నెల చివరిలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.
మొదటి అయిదు పాటలు ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడినవి. ‘స్వరముల తూగే ఘనరాగమయివో’ అన్న గోదావరి నదిపైన పాట (రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం: మల్లిక్) కేవలం జగన్నాథాచార్యులుగారి పాటలతో ఒక సంకలనం చేయాలనే కోరిక చాలా సంవత్సరాలుగా ఉంది కాని, వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను.
ఈ మధ్య మరీ ‘తాతల కాలంనాటి పాతపాటలు’ వినిపిస్తున్నానని కొంతమంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారని, రేడియో ప్రసంగాలు ఏమయినా ఉన్నాయా అని నా టేపుల్లో వెతుకుతుంటే మో (వేగుంట మోహనప్రసాద్), సంజీవదేవ్, విజయవాడ రేడియో కేంద్రంలో మాట్లాడినవి దొరికాయి.
కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు.
గతంలో బి.ఎన్. రెడ్డి పైన వ్యాసం రాసినప్పుడే ఈ రేడియో ఇంటర్‌వ్యూని ప్రస్తావించినందువల్ల దానిని కూడా జత పరచుదామనుకున్నాను కానీ సమయానికి డిజిటైజ్ చేయడం సాధ్యపడలేదు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. అలా ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు, ఇక్కడ, మీరందరూ వినగలిగేట్లు!
ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోనిది. కోరస్‌లో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు.
ఈ సంచిక కోసం ఎప్పటిలాగా లలిత గీతాలు, సాహిత్య కార్యక్రమాలు, సంభాషణలు కాకుండా విజయవాడ రేడియో స్టేషన్ నుండి భక్తిరంజని కార్యక్రమంలో దశాబ్దాల పాటు వినబడిన కొన్ని కీర్తనలు, స్తోత్రాలు, అష్టకాలు లాంటివి వినిపిస్తున్నాను.
ఇది విశ్వనాథ రాసిన మొదటి నాటకం (1924). చాలా చక్కటి రచన! కీచకవధ కథని నాటక వస్తువుగా తీసుకుని చాలా గొప్పగా నిర్వహించారు విశ్వనాథ. నాలుగుసార్లు (ఇంకా ఎక్కువ?) ముద్రణలు పొందింది. ఈ నాటకాన్ని రేడియోలో ప్రసారం కోసమై ఉషశ్రీ కొంత కుదించారు.
Tandem Songs అంటే ఒకే పాటని -సాహిత్యంలో కొద్దిగా మార్పులుండవచ్చు- వేర్వేరు గాయనీ గాయకులు, అదే బాణీలోనో లేక వేరే బాణీలోనే పాడటం. తెలుగు సినిమా పాటల్లో కంటే లలిత సంగీతంలో ఇలాంటి పాటలు చాలా యెక్కువగా కనిపిస్తాయి. అలాంటి ఒక ఒక 5 లలితగీతాలు ఇక్కడ వినండి.
ఇప్పుడు అసలు నాజర్ ఎవరంటే ఎంతమందికి తెలుస్తుందో! నాజర్ జీవిత చరిత్ర గురించి తెలుగు వికీపీడియాలో చాలా వివరాలతో వ్యాసముంది – చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చాలా నియమబద్ధమైన జీవితం గడిపిన మనిషి ఆయన.
గాయని జిక్కి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదు. ఈ సంచికలో జిక్కి పాడిన, అంత తేలికగా దొరకని, మూడు పాటలు: మువ్వలు పలికెనురా, మబ్బుల్లో జాబిల్లి, కుందరదనా వినవే రామకథ – విందాం.
పిచ్చయ్య శాస్త్రిగారు, గుర్రం జాషువాగారు ఇద్దరూ వినుకొండలో స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలసి జంట కవులుగా రచనలు చేయాలనుకున్నారని అయితే వీళ్ళిద్దరి పేర్లు కలవక విరమించుకొన్నారనే కథ ఒకటి ఉంది.
సెయింట్ జార్జి కోటలో నున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పనిచేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలులో పని చేసినప్పటికీ, కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది.
ఈ అరుదైన యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం కట్టి 1999 వేసవిలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేసినది.
20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా అబ్బూరి రామకృష్ణరావుగారి పేరు తెలియకుండా వుండదు. శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని ప్రశంసించేవాడు.
ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.
ఈ సంచికలో వినిపిస్తున్న పాటలు సుమారు 1915-1924 మధ్య కాలంలో రికార్డు కాబడినవి. అంటే రికార్డయిన తొలి ‘తెలుగు’ పాటలు!
పట్రాయని సంగీతరావు గారు ఈమాట పాఠకులకు సుపరిచితమే. 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.
అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను.
వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం.
ఇది భాగవతుల త్రిపుర సుందరమ్మగారు (బీనాదేవి) రావిశాస్త్రిగారి కథలపైన 1997లో విజయవాడ కేంద్రంలో చేసిన ప్రసంగం. ఈ ప్రసంగ పాఠం తరువాత వార్త దినపత్రికలోను, పైన పేర్కొన్న సమగ్ర రచనల సంకలనం లోను ప్రచురితమైంది.
రేడియో ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈ సంచికలో ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన కొన్ని రికార్డులను విందాం.
ఈ సంచికలో ప్రముఖ గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ స్టేషన్ నుండి 1979-1980 ప్రాంతంలో ప్రసారమయ్యిందని జ్ఞాపకం.
ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న ఈ చక్కటి సంగీతనాటిక విజయవాడ స్టేషన్‌లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభంలోనో, ప్రసారితమైంది.
తెలుగు నేర్చుకోవడం మూలంగా తెలుగులో వున్న పుస్తకాలు చదవడం మూలంగా ప్రపంచ విజ్ఞానాన్ని పెంచగలమని మన దేశపు విజ్ఞానులు ప్రపంచానికి ప్రదర్శించగలరా? నువ్వు ఏ భాష వాడివైనా తెలుగులో రాసిన పుస్తకాలు చదవకపోతే నీ విజ్ఞానానికి ఈ రకంగా లోపం వస్తుంది, అని మనం చెప్పగలిగిన రోజున, ఆ మాట ప్రపంచం లోని విజ్ఞానులు విన్న రోజున, వాళ్ళు తెలుగు పుస్తకాలు చదివి అందువల్ల గ్రహించిన విజ్ఞానాన్ని ప్రపంచ విజ్ఞానంలో భాగం చేసిన రోజున — తెలుగు ప్రపంచ భాష అవుతుంది.
చిన్నయ సూరి బాలవ్యాకరణం పైన ఏ మాత్రం ఆసక్తి వున్న వారికైనా దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి పేరు తప్పకుండా తెలిసి వుంటుంది. ఆయన బాలవ్యాకరణానికి రమణీయం అన్న పేరుతో రాసిన వ్యాఖ్య బహు ప్రసిద్ధం. ఈ సంచికలో ఆ ప్రసంగం వినండి.
తెన్నేటి సూరిగారి చెంఘిజ్ ఖాన్ ఎంత ప్రాచుర్యం పొందిందో మాటల్లో చెప్పలేం. ఈ రచనని (సెప్టెంబరు 1998) రేడియో నాటకంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అనుసరించి ప్రసారం చేశారు. ఆ పుస్తకంలో వున్న వేగం, చదివేటప్పుడు కలిగే అనుభూతి ఈ నాటకం వినడంలో కూడా ఉన్నాయో లేదో మీరే చెప్పండి.
నటీమణి ఎస్. వరలక్ష్మితో శ్రీ ఈడుపుగంటి లక్ష్మణరావు చేసిన ముఖాముఖీ, ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం సమర్పణ. ఇద్దరు ప్రసిద్ధులు పాల్గొన్న ఒక అపురూపమైన ముఖాముఖీ!
నాలుగేళ్ళ క్రితం ఆంధ్రభారతి శాయిగారితో కలిసి తెలుగు నిఘంటువులు, పదకోశాలు పోగు చేసే కార్యక్రమంలో ఒకరోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ‘విద్యార్థి కల్పవల్లి’ కోసం వెతుకుతుంటే ఊహించని విధంగా వింజమూరి శివరామారావుగారి గేయసంకలనం కల్పవల్లి-గీతికాలతాంతాలు (1958) అన్న పుస్తకం కనబడింది. చిన్నప్పుడు విజయవాడ రేడియో కేంద్రం నుండి విన్న ఎన్నో లలితగేయాల పూర్తి పాఠాలు ఒక్కసారి కళ్ళముందుంటే కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.
తన గురువుగారైన శ్రీపాద కృష్ణమూర్తి గారి గురించి శ్రీ వేదుల సత్యనారాయణ శర్మ పంచుకున్న సంగతుల ఆడియో ప్రసంగం. – పరుచూరి శ్రీనివాస్ సమర్పణ.
ఆధునిక కాలంలో వేమనకు గుర్తింపు రావడానికి కట్టమంచి రామలింగారెడ్డిగారు నిర్వహించిన పాత్ర చాలా పెద్దది. ఇక్కడ మీకు వినిపించుతున్న సి. ఆర్. రెడ్డిగారి రేడియో ప్రసంగం Caste-less society – Vemana అన్న శీర్షికతో అక్టోబర్, 1948లో ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
ఈ ప్రయత్నం అంతా ఎందుకు? అంటే లిఖిత గ్రంథానికి తోడుగా వేరే పాఠ్యగ్రంథం ఉంది అని గుర్తిస్తే ఫలితాలు ఎలా వుంటాయో చూడ్డానికి. తెలుగులో, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలో, పాఠ్యగ్రంథానికే ప్రామాణిక గౌరవం, లిఖిత గ్రంథానికి కేవలం ఆనుషంగిక గౌరవం వున్నాయి. ప్రామాణికమైన గురువుగారు తనకి కంఠస్థంగా వున్న పాఠం చెప్పినప్పుడు శిష్యులు లిఖిత ప్రతిలో వేరే పాఠం వుంది అని చూపిస్తే ఆయన తనకి కంఠస్థంగా వున్న పాఠాన్నే ప్రామాణికంగా చెప్తాడు. లేఖకుడికి పాఠాలు చెప్పే గురువులకున్న ప్రామాణికత లేదు.
ఈ పర్యాయం కొన్ని దేశభక్తి గేయాలు, జయజయప్రియభారత జనయిత్రీ, కలగంటిని, శ్రీపురాణధాత్రికి, – కృష్ణశాస్త్రి, రాయప్రోలు తదితరులు రచించినవి, ఇంకా కొన్ని మీ ముందుంచుతున్నాను. నా చిన్నతనంలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా తరచుగా ప్రసారమైన పాటలివి.
ప్రఖ్యాత గాయకుడు, రంగస్థల నటుడు శ్రీ మాధవపెద్ది సత్యం సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని, రేడియో కోసం వారు పాడిన ఐదు లలితగీతాలను మీతో పంచుకుంటున్నాను.
బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగ పడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిర్శకంగా పరిశీలించి బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.
ఈ ప్రత్యేక జనరంజని కార్యక్రమంలో పెండ్యాలగారు సినీ సంగీతం గురించి, గాయకుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన వర్ధమాన గాయనీ గాయకులకు యిచ్చిన సూచనలు ఆలోచించదగ్గవి.
30 మార్చ్ 2014 ప్రచురణ: ఉగాది సందర్భంగా గతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయిన కొన్ని లలిత గేయాలు మీకోసం అందిస్తున్నాను. జయ నామ సంవత్సర శుభాకాంక్షలతో – శ్రీనివాస్.
ఆయన ప్రఖ్యాత రచన ‘శివతాండవా’న్ని ఆయనే గానం చేశారు. ఈ రచనని చాలా మంది చాలా రీతుల్లో ప్రదర్శించ ప్రయత్నించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది 1993లో నాగపద్మినిగారు ‘శివతాండవాన్ని’ రేడియో ప్రసారణ కోసం చేసిన అనుసరణ.
మరల నిదేల పుట్టపర్తి వారి గళంబన్నచో … ఇది నారాయణాచార్యులవారి శతజయంతి సంవత్సరం. ఆయన గురించిన చాలా వివరాలు అందరికీ అందుబాటులో వున్నాయి. కానీ మీకు ఇక్కడ వినిపించబోయే జ్ఞాపకాలు వారి శతజయంతి సందర్భంలో నా నివాళి.
ఏల్చూరి మురళీధరరావుగారు నవంబర్ 2013 ఈమాటలో ప్రచురించిన ‘కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసం ద్వారా కుమారసంభవం కావ్యం రాసిన కవి నిజంగా ఎవరు? అతని కాలం ఏది? అనే వాదనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి కాల, కర్తృనిర్ణయాలపైన నా ఆక్షేపణలను ఈ వ్యాసంలో వివరిస్తాను.
ఆలిండియా రేడియో విజయవాడ వారు నాటిక రూపంలో ప్రసారం చేసిన విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖ రచన చెలియలికట్ట అపురూపమైన ఆడియో.
ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వివిధభారతి కార్యక్రమం ద్వారా సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం ఈమాట పాఠకులకోసం అందిస్తున్నాను.
పాలగుమ్మి విశ్వనాథం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ సంగీత రూపకాన్ని అందిస్తున్నాను. ఇది 1964 ప్రాంతంలో ‘కాళిదాసు జయంతి సందర్భంగా తొలిసారి ప్రసారమయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాల సమిష్టి కృషి.
ఆకాశవాణిలో ప్రసారమయిన ఒక చా.సో. ఇంటర్వ్యూ దానికి అనుబంధంగా చా.సో కథ వెనుక నేపథ్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు; రచయితగా, వ్యక్తిగా చాసోని అర్థం చేసుకోవడానికి ఈ ఆడియోలు సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.
సినీ నటుడు నాగభూషణం నటించి సమర్పించిన సాంఘిక నాటకం రక్తకన్నీరు గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత ప్రసిద్ధమైన నాటకం అది. ఎంతో అపురూపమైన ఆ నాటకం పూర్తి ఆడియో ఈమాట పాఠకుల కోసం…
ఈ సంచికలో రెండు అపురూపమైన ఉగాది కవిసమ్మేళనాలను సమర్పిస్తున్నాను. ఇవి 1964, 1969 సంవత్సరాలలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రికార్డయినవి. తల్లావఝల శివశంకరశాస్త్రి, వెంపరాల, జరుక్ శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, ఆరుద్ర లాంటి వార్ల గొంతుకలు, వారి కవితలు వినటం ఒక ఎత్తైతే విశ్వనాథ వారి పద్యపఠనం మరొక ఎత్తు.
ఇంటర్నెట్ ద్వారా రాత, రాతతో ముడిపడ్డ సమాచార వ్యవస్థ ఎంతగా మార్పు చెందాయో, ఆ మార్పులు మన సమాజంలో ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నాయో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. ఇది కనీవినీ ఎరుగని ఒక పెనుమార్పుగా మనం అనుకుంటున్నాం. అయితే, అంతకంటే మౌలికమైన మార్పు రాత వల్ల మానవ సమాజాల్లో వచ్చింది.
సుమారు 1972-73 ప్రాంతంలో, ఈ నాటకాన్ని సత్యం రాశారు. రేడియోలో బాగా ప్రాచుర్యం పొందిన తరువాత స్టేజి నాటకంగా కూడా మలచబడి చాలా పర్యాయాలు ప్రదర్శింపబడింది. ఆయనకి బాగా పరిచయస్తులైనవారు చెప్పేదేమంటే ఆయన అమరావతి కథల కంటే ఈ నాటకాన్నే తన ముఖ్య రచనగా ఇష్టపడేవారని.
అంత హాయిగా, ధారాళంగా, మంచి విషయ పరిజ్ఞానంతో కబుర్లు చెప్పే మనుషుల్ని నేను చాలా తక్కువ మందిని కలిశాను. దేశ స్వాతంత్ర్యోద్యమం గురించి, 1925-1960ల మధ్య కాలం నాటి సాంస్కృతిక జీవనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. ఇంక ఆ కాలం నాటి నాటక, సంగీత ప్రపంచం గురించయితే చెప్పనక్కరలేదు.
ఆలిండియా రేడియో 1965లో ప్రసారం చేసిన భాస మహాకవి ప్రతిమా నాటకం నుంచి ఒక సన్నివేశం ఆడియో, సంస్కృత, తెలుగు పాఠ సహితంగా ఈమాట పాఠకుల కోసం పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్నారు.
ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప.
ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
రేడియోలో ప్రసారమైన శ్రవ్యరూపకాల విషయంలో సంఖ్యాపరంగా కానీ, శ్రోతల ఆదరణ విషయంలో కానీ కృష్ణశాస్త్రిగారిదే అగ్రస్థానం. ఆయన పనిచేసిన కాలంలో రికార్డయినవి చాలావరకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.
సినీ పరిశ్రమలో పోస్టర్లు, పాటల పుస్తకాలు, కరపత్రాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే. ప్రతి వారికీ వీటి గురించి గొప్ప జ్ఞాపకాలే వుంటాయని అనుకుంటున్నాను.
ఈ గొంతుకలన్నీ ఆకాశవాణి వారు వేరువేరు సందర్భాల్లో రికార్డు చేసినవి. ప్రముఖుల గళాలు అన్న శీర్షికన శంకరమంచి సత్యం ప్రసారం చేసిన ఒక కార్యక్రమం ఈ ఆడియోల సంకలనం.
కొన్ని అపురూపమైన తెలుగువారి గొంతుకలు – ఆచంట లక్ష్మీపతి, టంగుటూరి ప్రకాశం పంతులు, గుఱ్ఱం జాషువా, జరుక్ శాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, స్వామి శివశంకర్, విస్సా అప్పారావు, మొక్కపాటి నరసింహ శాస్త్రి, దామోదరం సంజీవయ్య మరి కొంతమందివి.
రాధికాసాంత్వనము ప్రచురితమైన సంవత్సర కాలం తరువాత, 1911లో, ‘శశిలేఖ’ అన్న పత్రికా సంపాదకులు ఇది అశ్లీల కావ్యమని అభ్యంతరం లేవనెత్తటముతో, ఈ పుస్తకం నిషేధింపబడి తెలుగు సాహిత్య, ప్రచురణా రంగములలో పెద్ద కార్చిచ్చు రేగిల్లినది.
విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు.
“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”
కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది.
సుమారుగా 1940 నుండి 1960ల పూర్వార్ధపు మధ్యకాలం చిత్రసంగీతానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ కాలంలో అన్ని భాషలలోనూ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి. […]
అయితే భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇంకొకటి వుంది. అది దేశంలో ఒక మధ్యతరగతిని తయారు చేసి వాళ్ళ ఊహలద్వారా ఒక భారత జాతీయతని నిర్మించడం.
మూడు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్తుంటే స్నేహితులొకరు “ఆముక్తమాల్యద” టీకాతాత్పర్య సహితంగా దొరికితే కొనిపెట్టమన్నారు. ఏ పుస్తకాల కొట్లో అడిగినా దొరకలేదు. ఈ మధ్యమరొకరు […]
(పరుచూరి శ్రీనివాస్ “తెలుసా”, “ఈమాట”, తానా పత్రికల ద్వారా సుపరిచితులు. తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాంఘికచరిత్ర, సంగీతచరిత్ర మొదలైన అనేక విషయాల్లో “నడుస్తున్న నాలెడ్జ్” […]
[ఈ వ్యాస రచనకు Randor Guy రాసిన “B.N. Reddy – A monograph” (National Film Archives of India, Pune, 1985) […]
[పరుచూరి శ్రీనివాస్ నివాసం యూరప్ ఐనా SCIT ,తెలుసా లాటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందరికీ చిరపరిచితులు. తెలుగు భాష, సంస్కృతులకు సంబంధించిన అనేకానేక […]