హరహరమహదేవ!


సి ఆర్ ఆర్ కాలేజి, ఏలూరు.

ఈ సంచికలో వినిపించబోయే నాటకం విజయవాడ కేంద్రం ద్వారా తరచుగా ప్రసారితమై బహు జనాదరణ పొందినది. ఈ నాటక రచయిత శంకరమంచి సత్యం. అవును, అమరావతి కథలు రాసిన వ్యక్తే! అమరావతి కథల కంటే ముందే, సుమారు 1972-73 ప్రాంతంలో, ఈ నాటకాన్ని సత్యం రాశారు. రేడియోలో బాగా ప్రాచుర్యం పొందిన తరువాత గుంటూరులోని ఒక నాటకాభిమాని ప్రోత్సాహంతో, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సహాయంతో, స్టేజి నాటకంగా కూడా మలచబడి చాలా పర్యాయాలు ప్రదర్శింపబడింది. ఆయనకి బాగా పరిచయస్తులైనవారు చెప్పేదేమంటే ఆయన అమరావతి కథల కంటే ఈ నాటకాన్నే తన ముఖ్య రచనగా ఇష్టపడేవారని. అర్చక కుటుంబం నుంచి వచ్చి ఆధునిక విద్యావంతుడైన ఆయన మనసులోని సంఘర్షణల ప్రతిబింబమే ఈ నాటకం. అర్చకవృత్తిలో ఉన్నవారిని అదే కులంవారు కూడా సమానంగా చూడకపోవటం, దేవాలయాల్లో అర్చకులకి ధర్మకర్తలకి మధ్యనుండే ఘర్షణలు ఆయనను కలిచివేస్తుండేవి. ఒక రకంగా ఇది శంకరమంచి సత్యం ఆత్మకథారూపకమైన నాటకం అనవచ్చు.

ఈ నాటక రచనా నేపథ్యం గురించి, సత్యంగారి గురించి ఎన్నో వివరాలు చెప్పిన శ్రీకాంతశర్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

కొసమెరుపు: ఇక్కడ ఇచ్చిన అపురూపమైన చిత్రంలో సత్యంగారితో పాటు ఈమాట పూర్వ సంపాదకులు వేలూరి వెంకటేశ్వరరావు గారిని కూడా చూడవచ్చు. అలాగే వెల్చేరు నారాయణరావు, శ్రీరాముల రాజేశ్వరశర్మలను కూడా. ఈ ఫోటోను స్కాన్ చేసి పంపిన ప్రొ. శర్మగారికి కృతజ్ఞతలు.

-పరుచూరి శ్రీనివాస్