తరాలుగా కరడు కట్టి
బీడైన నేల
మళ్ళీ నవ్వి పచ్చదనాన్ని పరుస్తుందని
కలగంటామా
కలలు మరచిన ఆకాశాలు
పురుడు పోసుకు
రంగుల విల్లులౌతాయని
తలుస్తామా
భావన మరచిన హృదయం
భాష నేర్చుకు
బరువుగా పలకరిస్తుందని
ఊహిస్తామా
కాలపు ఒడిదుడుకులకు
ఊపిరి నిలుపుకు నిలిచి
పచ్చగా పులకించడమే కదా
ఉగాది!