మేఘసందేశం (తెలుగులో)

మేఘసందేశం – తెలుగు రూపకం

పాలగుమ్మి విశ్వనాథంగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనతో నాకున్న ఆత్మీయమైన పరిచయాన్ని, గొప్ప జ్ఞాపకాలను మరల గుర్తుకి తెచ్చుకుంటూ ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ సంగీత రూపకాన్ని అందిస్తున్నాను. ఇది 1964 ప్రాంతంలో ‘కాళిదాసు జయంతి’ సందర్భంగా తొలిసారి ప్రసారమయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాల సమిష్టి కృషి. మేఘుడు, యక్షిణిగా ప్రధాన పాత్రల్లో N.Ch. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నంల మధుర గాత్రంతో పాటుగా మరికొందరు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రముఖ కళాకారుల గొంతులను కూడా వినవచ్చు. దీనిలోని ఒక పాట తరువాత సినిమాలో వాడబడి బాగా ప్రాచుర్యం పొందింది కూడా. మరిన్ని వివరాలకు ఈ ఆడియో వినండి.

ఈ కార్యక్రమానికి రచన, నిర్వహణ చేసిన ‘సత్య’ అసలు పేరు చెప్పిన వారికి మీరు కోరిన రెండు లలిత గీతాలు కానుక!