పదిహేనేళ్ళ అమృతకి, ఆ వయసుకి తగ్గట్టే తన రూపరేఖలపై ప్రత్యేకదృష్టి ఉండేది. సంప్రదాయాన్ని తోసిరాజనే కొత్త ఫేషన్లు, ప్రయోగాలు ఇష్టపడేది. పారిస్ నగరంలో అడుగుపెట్టాకనే షేర్-గిల్ ఆత్మాకృతి చిత్రణ పూర్తిగా వికసించింది. మొత్తం పందొమ్మిది చిత్రాలను ఆమె అక్కడే గీసింది. ఒక కళాకారిణిగా తోటి కళాకారుల మధ్య జీవించే, పనిచేసే అవకాశం అక్కడ ఆమెకి దొరికింది.

లైన్ డ్రాయింగ్ ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? రేఖ ఎంత అద్భుతమైన భాషో తెలుసా? ఒక వస్తువును అది అర్థం చేసుకున్నంతగా మరే కళ ఈ ప్రపంచాన్ని చూడలేదు. వాస్తవాన్ని చప్పున గాలికూదేసి రేఖ చేసే మహా మాయే లైన్ డ్రాయింగ్. రేఖ అనేదేదీ లేని ఈ వస్తు ప్రపంచంలో అది మనం ఉందనుకున్న మరో కొత్త లోకాన్ని సృష్టించింది.

అలా పరవశించిన తిరుగుడులో అజంతా, ఎల్లోరా, తంజావూరు, మహాబలిపురం, పట్టడకల్ చిత్ర శిల్పాలు, కంచు శిల్పాలు, తాళపత్ర చిత్రాలు, దక్షిణాది ఫ్రెస్కోల్లోని ఆకుపచ్చ, నీలి, ముదురు పసుపు, చామనచాయల్లో అందగత్తెలయిన దేవతలలో చూసింది పౌరాణిక దృశ్యాల్లో ఆధునిక రేఖల వొంపుల విన్యాసాలను, చైతన్యం తొణికిసలాడే లయనీ!

కొన్ని ప్రశ్నలూ జవాబులూ అవుతూండగానే ఆకర్షణ వల్ల ఒంట్లో విద్యుత్తు, దాన్నుంచి చెంపల్లో వేడి, కళ్ళలో మెరుపులు, పెదాల మీద నవ్వులూ. కొన్ని మాటల్లో తెలిసీ, కొన్ని మాటల్లేకుండానూ. చేతులు పట్టుకుని నడకలు, అర్థాలతో బరువెక్కిన మాటలు, ఊహలతో మత్తెక్కిన కళ్ళూ, కొన్ని ‘మిస్ యూ’లూ చేతికి అందేంత దూరంలో ఆశగా. మరికొంత దూరంలో ఒళ్ళు విరిచే ఉద్రేకాలూ బిగి కౌగిలింతలూ తడి ముద్దులూ.

తెరల సంగతి సరే, మరి నేను?
నేనా?
నేనొక ముద్దగన్నేరు పువ్వును!
ఇటువైపు వచ్చినవాళ్ళు
సీతాకోకలై సేదతీరుతారో,
పిచ్చుకలై పీక్కుతింటారో ఎవరికి తెలుసు?

ఫిల్టర్‌లో నీళ్ళు పోయడం, కూరగాయలు కోయడం, పాలప్యాకెట్‌ కట్‌చేసి గిన్నెలో పోయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, రేపు ఉదయానికని గుర్తుపెట్టుకుని ఇవ్వాళ రాత్రే రెడ్‌ రైస్‌ నానబెట్టడం… ఇవన్నీ నా పిల్లలమ్మ పనులు. అయినా, అవన్నీ నేను చేసిపెడతాను, నా పనితీరు తను మెచ్చకపోయినా.

ఇన్ని ఆడ పనులు చేయగలిగినవాడిని, బట్టలు మాత్రం ఉతకలేను.

గురువారం సంత కాడ, దొమ్మరాటొచ్చిందని, సూత్తాకెల్తంటే, రొప్పుకుంటా ఎదురొచ్చిన చిర్రావూరి పంతులుగారబ్బాయి బద్రం, “ఉరేయ్ ఈర్పినోరి చిన్న శీనుగాడు ఎర్ర కాలవలో కొట్టుకు పోతన్నాడంట” అని చెప్పి అదే పోత పొయ్యాడు. నేనూ ఆడెనకాలే పరిగెట్టుకుంటా పోయా. ఆయిలు కొట్టు తాతాలు గారి పెద్దరగుల వీధి గుండా పోతే దెగ్గరని అటేపునుంచి పోతంటే, అప్పుడెదురొచ్చాడు చిన్న శీనుగాడు.

బండి ఖాళీగా పోతుందనీ
ఇద్దరు మనుషులకి ఇరవై రూపాయిలే అనీ
కేకవిని చెంగుమని
లోపలికెక్కి కూలబడతాం
నెట్టుకుంటాం, సర్దుకుంటాం
లేదా చోటు దొరక్క నిలబడతాం

మన పురాణాల్లోని కొన్నికొన్ని పాత్రలు అన్యాయానికి గురైనాయని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కవి హృదయం సాధారణంగా ఆర్ద్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రల యెడ సహానుభూతి కలిగి ఉంటుంది. ఒక ఏకలవ్యుడు, ఒక ఊర్మిళ, ఒక అహల్య, ఒక కర్ణుడు లాంటి వారి యెడ ఏంతో అనుకంపనని చూపిస్తుంటారు చాలామంది. వాల్మీకి ఊర్మిళకు అన్యాయం చేశాడని వాల్మీకి రామాయణాన్ని మార్చబూనాడట పుట్టపర్తి నారాయణాచార్యులుగారు.

అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చిపెట్టుకుంటూ ‘తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ; కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మనీ’ ప్రాధేయపడ్డాడు.

కొంచెంగానే నవ్వి చెప్పిన మాట
కలువల కింద మెదిలి వెళ్ళిన చేపపిల్లలా
చెప్పకనే చూపు మిగిల్చుకున్న నవ్వొకటి
చలిమంటలో అగ్గి ఆరనట్టే

సృజన సాహిత్య విమర్శ వాంఛనీయమైన ఆలోచన చేయడానికి అటు రచయితకూ, ఇటు చదువరికీ కూడా ప్రేరణ ఇచ్చేదిగా ఉండాలి. రచనలో పాఠకునికి ఏ మూలపదార్థం అనుభూతిదాయకమౌతుందో చెప్పగలగాలి. రచయితకి రచన ఔన్నత్యాన్ని భంగపరిచే ఏ లక్షణాల్ని పరిహరించుకోవాలో చెప్పేదిగా ఉండాలి. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో రెండవ బహుమతి గెల్చుకున్న వ్యాసం.)

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఈ మధ్య మరీ ‘తాతల కాలంనాటి పాతపాటలు’ వినిపిస్తున్నానని కొంతమంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారని, రేడియో ప్రసంగాలు ఏమయినా ఉన్నాయా అని నా టేపుల్లో వెతుకుతుంటే మో (వేగుంట మోహనప్రసాద్), సంజీవదేవ్‌, విజయవాడ రేడియో కేంద్రంలో మాట్లాడినవి దొరికాయి.

గడినుడి 15 పూర్తిగా నింపినది ఈసారి కామాక్షి గారు ఒక్కరే. కామాక్షి గారికి అభినందనలు. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల, 2. పి.వి.ఎస్. కార్తీక్ చంద్ర 3. జి.బి.టి. సుందరి 4. హేమంత్ గోటేటి 5. హరిణి దిగుమర్తి. వీరికీ మా అభినందనలు.

గడి నుడి – 15 సమాధానాలు, వివరణ.