రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు చేసిన ఒక రేడియో ప్రసంగం నవంబరు, 2018 సంచికలో విన్నాం. ఈ సంచికలో ఆయన అదే శీర్షికలో ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు.
శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్ళకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి. పాతికేళ్ళ క్రితం తెలుగులో మొదటి చర్చా వేదికలయిన SCIT, WETDలలో శాస్త్రీయ రాగాల ఆధారంగా తయారయిన సినిమా పాటల గురించి జరిగిన చర్చల నుండి పెద్ద పాటల జాబితా తయారు చేసిన రోజుల్లో ఈ రాగం ఆధారంగా వచ్చిన పాటలు కూడా కొన్ని జతచేశాం. ఉదాహరణకు: మనసున మనసై (డా. చక్రవర్తి), వదసి యది కించిదపి (భక్త జయదేవ), హిమగిరి సొగసులు (పాండవ వనవాసం), ఈ మూగ చూపేల బావా మాటాడ (గాలిమేడలు), నీ నీడలోన నిలిచేనురా (సువర్ణసుందరి) అన్న పాటలు.