రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.

ఫ్రెంచి భాషలో తొలి చారిత్రక నవలగా, మనస్తత్వ ప్రధాన నవలగా ఈ నవల పేరు పొందింది. ఇందులో కథానాయిక తప్ప తక్కిన అందరూ చారిత్రక వ్యక్తులే. ఏ భాషలోని చారిత్రక నవలల్లోనైనా చారిత్రక వ్యక్తులు అతి తక్కువగా, కల్పిత పాత్రలు ఎక్కువగా ఉండడం సహజం. కానీ ఈ తొలి ఫ్రెంచి చారిత్రక నవలలో అన్నీ చారిత్రక పాత్రలే. కథానాయిక మాత్రమే కల్పితం.

తిండి, నిద్రా
రెండు శరీరాలనూ వెలేసుకుంటాయి
కోరికలు, సమీక్షలూ
ఇష్టాలు, ఇష్టమైన వాళ్ళు
అక్షరాలుగా మారిపోతారు.

కవిత్వం కూడదు మన ప్రేమలాగ.

“అవునొరేయ్. బొత్తాల్లో ఉన్న సుకవే సుకం రా. జుప్పు అటిటు ఆడకుండా ఆగిపోయిందనుకో. బాచేయటానికి కాజా గాడింకో ఇరవయ్యో పాతికో దొబ్బుతాడు. రాంబారికో యాభై ఎకరం గొబ్బిరితోటుంది కాబట్టి, ఆళ్ళ మాంగారు ఇంకో యాభై పల్లంకొట్టి పిల్లనిచ్చేరు. నీకూ నాకూ ఏం వుంది? తాడుంటే బొంగరవుండదు. బొంగరవుంటే తాడుండదు.” జిప్ ప్యాంట్ కుట్టించడం విరమించుకున్నాడు సత్తిగాడు.

చల్లని తెల్లని కట్టడమది. పాలరాయి విరివిగా వాడిన సంగతి ప్రాంగణంలోకి వెళ్ళగానే బోధపడింది. అసంఖ్యాకంగా ఉన్న గుమ్మటాలు, నాలుగు పక్కలా కనిపించే మీనార్లు, ఎంతో ఎత్తుగా ఉన్న ప్రవేశ ద్వారం, శీతాకాలపు ఆరుబయట సన్నపాటి పొగమంచు వీచికలా అక్కడంతా పరచుకొని ఉన్న కళాత్మకత-వినమ్రభావన కలిగింది.

నిసి క్రమేపీ వేరే రకమైన సరళ జీవన విధానం అలవరచుకుంది. ఇప్పుడు, ఇన్ని ఏళ్ళ తదనంతరం, తన సౌందర్యం గురించి కొత్త స్ఫురణ ఆమెలో కలిగింది. పొడవుగా వదిలేసిన తెల్లని మెరుపుల జుట్టు, మృదువుగా మారిన ముఖరేఖలు. కళ్ళలో జాలి, వేదన, ఆలోచనల స్థానంలో, కొత్త తరహా చురుకు చూపులు, ప్రఫుల్లమైన నవ్వు. దుస్తులు నగల ఎన్నికలో కొత్త నాజూకులు. ఏది ఇందులో తన స్వాభావికం?

ఇంగ్లీషు కుంపినీవారి దుష్పరిపాలనమునందు జరుగుచుండిన అన్యాయముల వలన మన్యములోని కొండరాజులు జమీందారులు తరచుగా తిరుగుబాటుచేయుచు తమ పరిసరారణ్యములోని ఆటవికజాతుల నాయకుల దగ్గర తలదాచుకొనుచుండిరి. ఆ మన్యప్రాంతములందు కల్లోలములు కలిగినప్పుడు ఆటవికజాతులును తిరుగుబాటు చేయుచుండెను.

యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? అనుకొని ఏదీ జరగదు. ఊహించనివి ఊహించకుండా జరుగుతాయి. అయినా ఇది అనుకోకుండా జరిగిందా? అనుకొనే జరిగింది కదా! కావాలని చేసిన యాక్సిడెంట్‌కి ఎంత మూల్యం చెల్లించాలి? మూల్యం చెల్లించడం కోసమే యాక్సిడెంట్ చేస్తారా! విరిగిన చేయి, వెన్ను పక్కగా దిగబడిన రాయి, నీ ప్రమేయం లేకుండా నిన్ను తడిమే చేతుల స్పర్శ కూడా.

వాలిన కన్నులు
తెరదించిన నాటకంలో
మిగిలిన కథలో మెదులుతూ
నడిచే కాలమూ జీవితమే.

గొంతు నడిచిన చప్పుడు
ఎప్పుడూ కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది
దారి పొడవునా వినిపిస్తూనే ఉంటుంది.

స్టే-ఎట్-హోమ్ డాడ్‍గా ఉండే ఉద్దేశ్యం లేదని సందీప్ స్పష్టం చేశాడు అందరికీ. పాలసీ ప్రకారం వచ్చే ఆర్నెళ్ళ లీవ్ కాకుండా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నొచ్చుకున్నాడు. అనిత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు, ఆమెకి ఆమె ఉద్యోగం అంత ముఖ్యం! ఇద్దరూ మొండిపట్టు పట్టి బాబుని పూర్తిగా ఏ ఆయాకో వదిలేయడం ఇష్టం లేక, మనసు చంపుకుని ఉద్యోగం మానుకున్నాడు.

కేసియోపియా అని గ్రీసు దేశస్తులు పిలిచిన నక్షత్ర మండలాన్ని వివిధ సంస్కృతులలో ప్రజలు వివిధమైన పేర్లతో పిలిచేరు. ఈ గుంపులో ఉన్న నక్షత్రాల గురించి అరబ్బులకి తెలుసు, చైనీయులకి తెలుసు, వేదకాలపు భారతీయులకి తెలుసు. వారివారి పురాణ గాథలలో ఇటువంటి కథలు వారికీ ఉన్నాయి.

నీ చేతులు పట్టుకుందాం అనుకుంటాను
నీ చెంపలు నిమురుదాం అనుకుంటాను
వందల వేల మాటలతో
నిన్ను ఉక్కిరిబిక్కిరి చేద్దామనుకుంటాను
మాట గొంతులోనే ఉంటుంది
నేను గుమ్మం దగ్గరే ఉంటాను.

కళ కేవలం తనకోసమే తాను ఉంటుంది. ఎప్పుడైతే కళాకారుడు ఈ సత్యాన్ని విస్మరించి, తన కళ ద్వారా మానవాళికి సందేశం ఇవ్వాలని ఉబలాటపడతాడో అప్పుడతను కేవలం ఒక ప్రబోధకుడు మాత్రమే. తన కళ ద్వారా సామాజిక నైతికతను నిర్దేశించి, అమలుచేయాలని తపనపడతాడో అప్పుడతను కేవలం ఒక తార్పుడుగాడు మాత్రమే.

ఒంటరి పక్కమీద
కనిపించని దిగులు
తడుముకునే కొద్దీ తగిలే ఒంటరితనం
గొంతులో మాట నోటిలోనే విరిగిపోతుంది
వెన్నెల కురుస్తున్నప్పుడు వర్షాన్ని కోరుకోవడాన్ని చీకటి ఒప్పుకోదు
ఆప్యాయతలన్నీ అరచేతి తెరమీద కనబడతాయి

నిన్నూ నన్నూ దాటాలని చూస్తూనే
టపటప మోగుతున్న పెదవులని
రెపరెపలాడుతున్న ఎడదలని
మాటల చివరన విడుదలని
గొంతు లోతుల్లో మార్చుకుంటూ
నటిస్తున్నాం విభ్రమని

అష్టావధానాల మధ్య
పెనంతో దోస్తీ వదలని దోశె పైన
అడుగంటిన అన్నం పైన
ఆసరా కాలేని మనుషుల పైన
చూపలేకపోయిన కోపాన్ని
చల్లారిన టీతో దిగమింగిన క్షణం

గాలి దారిమ‌ళ్ళి గాయాలు రేపిన‌ప్పుడు,
న‌డిక‌డ‌లిలో నెత్తురు పోటెత్తిన‌ప్పుడు,
పోటెత్తిన నెత్తుటిలో
క‌ష్టాల కాగిత‌ప్ప‌డ‌వ‌లు విడిచినప్పుడు-
అప్పుడు కూడా
నేను నేనుగానే ఉండేవాణ్ణి.

ఆక్రమిత భూభాగాల్లా
బతుకు సుతారాలేవీ పరిచయం లేని అడుగులకు
యుద్ధం చేయడానికి ముందుకు మున్ముందుకు
దూకక తప్పని పాదాలకు
కత్తుల కొనలకెదురేగి నిలువు నెత్తుటితో
వీరతిలకం దిద్దడం ఈనాటి ఇతిహాసమేం కాదు

ఈ కథలుకూడా ఊరికే చదివి వదిలేసేవి కావు. మళ్ళీమళ్ళీ చదవవలసినవి. చదివి నేర్చుకోవలసినవి. సంపుటిలో కొన్ని కథలు లౌకికమైన అంశాలను చర్చించేవైతే, కొన్ని సంప్రదాయబద్ధమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికపరమైనవి. ఈ కథా సంపుటిలో ప్రతీ కథ జీవితాన్ని ఒక కొత్తకోణంలో పరిచయం చేసేదే!

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.