పరావర్తనం

ఇక ఏదోక రోజు ముగించాల్సిందే
పగటివెలుగు సన్నగిల్లుతోంది
ఇక గాయపరచాల్సింది
-రాత్రే.
తియ్యని రాత్రి, నమ్మదగని
అసంగతం కాని రాత్రి
ఆకాశంలో చంద్రుడు
నిండుకున్నాడు.
రెండ్రోజులుగా
కొండల్లాంటి నా భుజాలపై చీకటి.
మనం పైకి లేచినప్పుడు
ఎవరూ చప్పట్లు కొట్టరు, ఆమెతో సహా.
కానీ, ముళ్ళను శరీరం నుంచి వేరు చేయడానికి
అందరూ తలో చేయీ వేస్తారు.
కనిపించని రాతి గుండ్లకింద
నక్షత్రాల ఎగ ఊపిరి
జీవన ప్రవాహంలో
కాంతి సంవత్సరాలు నునుపుదేరి
ప్రకాశిస్తాయి.