నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.
45-50 సంవత్సరాల క్రితం బాలానందం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న అయ్యగారి వసంతలక్ష్మిగారు ఈ మధ్య కాలంలో తామొకనాడు పాడిన పాటలను తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరల పాడి వినిపిస్తున్నారు. ఉదాహరణకు ఇక్కడ మీరు విన్న పాటలు, అదనంగా మరికొన్ని యూట్యూబ్ ఛానల్‌లో వినవచ్చు: గొల్లభామ, కుందేలు-తాబేలు (సంగీత నాటకం), ఈగ-సాలీడు.
- గొల్లభామ-గొల్లవాడు
- మా పాపాయి
- పుట్టినరోజు పండగ
- నూతిలోను చూచితే అందుకలదు ఒక కప్ప
- చీమ కథ
- తెల్లని జాబిలిపై ఎవరో