తెలుగు వ్యాకరణం, ముఖ్యంగా చిన్నయ సూరి బాలవ్యాకరణం పైన ఏ మాత్రం ఆసక్తి వున్న వారికైనా దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి పేరు తప్పకుండా తెలిసి వుంటుంది. ఆయన బాలవ్యాకరణానికి రమణీయం అన్న పేరుతో రాసిన వ్యాఖ్య బహు ప్రసిద్ధం. ఈ సంచికలో ఆయన చిన్నయసూరి వ్యాకరణంపై విజయవాడ రేడియో కేంద్రంలో – సుమారు 1975 ప్రాంతంలో – చేసిన ప్రసంగం వినండి.
వీరికి సంబంధించినవే మరి రెండు వివరాలు ఆసక్తి గల పాఠకుల కోసం ఇస్తున్నాను:
అయిదేళ్ళ క్రితం ఆయన ఆత్మకథ పునర్ముద్రితమయినప్పుడు బాగా తెలుగు పాఠకుల ఆదరణ పొంది, అతి కొద్ది కాలంలోనే మూడవ ముద్రణ కూడా జరిగింది. ఆయన ఆత్మకథపైన ఒక మంచి పరిచయం పుస్తకం.నెట్లో.
ఆయన గొంతుకలోనే జానకితో జనాంతికం అన్న ఆయన రచన:
ఈ రచన పూర్తి పాఠం ఇక్కడ చదవండి.